అంతర్జాతీయం
మెక్సికోలో దాడులు.. 11 మంది మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
మెక్సికో, నవంబర్ 28: నిత్యం కల్లోలంగా ఉండే మెక్సికన్ దక్షిణాది రాష్టమ్రైన గురెరోలో జరిగిన దాడిలో ఇద్దరు పోలీసులతోసహా 11 మంది పౌరులు మృతి చెందారు. రియోబ్రేవోలో జరిగిన కాల్పుల ఘటనలో ఇద్దరు పోలీసు అధికారులు, ఐదుగురు గన్‌మెన్‌లు మృతి చెందారు. మరోచోట ముష్కరుల దాడిలో నలుగురు సివిల్ పోలీసులు మరణించారని అధికారులు వెల్లడించారు. టిక్సిట్లా పట్టణంలో శుక్రవారం అర్థరాత్రి గస్తీ తిరుగుతున్న ఏడుగురు పోలీసులపై దాడి జరిగిందని వారన్నారు. దాడిలో నలుగురు పెట్రోలింగ్ సిబ్బంది మృతిచెందారని తెలిపారు. అయితే దాడి చేసింది ఎవరన్నది స్పష్టం కాలేదు. మాదకద్రవ్యాల ముఠాకు చెందిన రెండు గ్రూపులు పాల్పడినట్టు స్థానికులు పేర్కొన్నారు. అలాగే ఉత్తర సరిహద్దు రాష్టమ్రైన తవౌలిపాస్‌లో జరిగిన కాల్పుల్లో ఇద్దరు పోలీసు అధికారులు, ఐదుగురు అనుమానిత గన్‌మెన్లు మరణించారు. రియోబ్రేవో కనీసం ముగ్గురు మృతి చెందినట్టు పోలీసులు చెప్పారు. రియోబ్రేవో ప్రాంతం టెక్సాస్ సరిహద్దులోని మెక్‌అలెన్‌కు దగ్గర్లో ఉంటుంది. శుక్రవారం రెండు గ్రూపుల మధ్య జరిగిన ఘర్షణ కాల్పులకు దారితీసింది. ఓ గన్‌మెన్ పోలీసు పెట్రోలింగ్ పార్టీపై దాడి చేసి ఇద్దరు అధికారులు చంపేశాడు. ఒక మహిళా అధికారి తీవ్రంగా గాయపడ్డారు.
ఈజిప్టులో నలుగురు పోలీసులు మృతి
కైరో: ఈజిప్టులోని గిజా నగరంలో మిలిటెంట్లు మరోసారి పంజా విసిరారు. మోటారు సైకిల్‌పై వచ్చిన దుండగులు సక్కారాలోని టూరిస్టు స్పాట్ వద్ద చెక్‌పోస్టుపై కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో నలుగురు పోలీసులు మృతిచెందారు. అప్రమత్తమైన పోలీసులు మిలిటెంట్లను పట్టుకునేందుకు గస్తీని ముమ్మరం చేశారు. 2011లో మొదలైన ప్రజా తిరుగుబాటుతో అప్పటి అధ్యక్షుడు హోన్నీ ముబారక్ గద్దె దిగినప్పటి నుంచి దేశంలో అరాచక శక్తులు పేట్రేగిపోతున్నాయి. 2013లో మహ్మద్ మోర్సీ అధికారం కోల్పోయిన తర్వాత ఈ దాడులు మరింత తీవ్రమయ్యాయి. మిలిటరీ, పోలీసు సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని మిలిటెంట్లు హత్యాకాండకు తెగబడుతూనే ఉన్నారని, ఈ దాడుల్లో ఇప్పటివరకు దాదాపు 600 మంది భద్రతా సిబ్బంది మరణించి వుంటారని ఒక అంచనా.