అవంతిక వస్తోంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూర్ణ ప్రధాన పాత్రగా అవంతిక వచ్చేస్తోంది. శ్రీరాజ్ బల్ల దర్శకత్వంలో భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న చిత్రమిది. జూన్ 16న చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా రామసత్యనారాయణ మాట్లాడుతూ ఇది తమ బ్యానర్‌లో వస్తున్న 90వ చిత్రమన్నారు. అరుంధతి, అమ్మోరు తరహాలో గ్రాఫిక్స్ ప్రాధాన్యత కలిగిన చిత్రమని, 35 నిమిషాలపాటు సాగే గ్రాఫిక్స్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందన్నారు. ఈమధ్య విడుదలైన టీజర్‌కు అనూహ్య స్పందన వచ్చిందని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూరె్తై సెన్సార్‌కు సిద్ధమైందన్నారు. పూర్ణ నటన చిత్రానికి హైలెట్ కానుందని, మిగతా కార్యక్రమాలు పూర్తి చేసి జూన్ 16న భారీస్థాయిలో విడుదల చేస్తున్నామన్నారు. చిత్రానికి కెమెరా కర్ణ, ఎడిటింగ్ సోమేశ్వర్ పోచారం, శివ వై ప్రసాద్, సంగీతం రవిరాజ్ బల్ల.