ఇది.. కిరాక్ పార్టీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిఖిల్ సిద్ధార్థ్, సిమ్రాన్ ఫరింజా, సంయుక్తా హెగ్డే ముఖ్యపాత్రల్లో శరన్ కొప్పిశెట్టి దర్శకత్వంలో ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్న చిత్రం ‘కిరాక్ పార్టీ’. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ హైదరాబాద్‌లో విడుదలైంది. ముఖ్య అతిథిగా పాల్గొన్న దర్శకుడు తేజ టీజర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా తేజ మాట్లాడుతూ- టీజర్ మళ్లీ మళ్లీ చూడాలన్పించేలా వుంది. నిఖిల్ నాచురల్‌గా నటించాడు. ఈ సినిమా మంచి విజయం సాధించాలి అన్నారు. నిర్మాత అనీల్ సుంకర మాట్లాడుతూ- కొత్త టీమ్ అయినా అనుభవమున్నవాళ్ళలా పనిచేశారు. కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన సినిమాల్లోనే బెస్ట్ ఫిలింగా నిలుస్తుంది అన్నారు. నిఖిల్ మాట్లాడుతూ- ఈ చిత్రానికి లీడర్ అనీల్ సుంకర. సినిమా విషయంలో ఆయనకు చాలా క్లారిటీ వుంది. ప్రతి విషయాన్ని దగ్గరుండి చూసుకుంటాడు. షూటింగ్ పూర్తి అయ్యాక చాలా ఏడుపు వచ్చింది. అందరం కలిసి ఇన్నాళ్లు పనిచేశాం. ఇప్పుడు షూటింగ్ అయిపోవడంతో దుర్మూహర్తం అనే ఫీలింగ్ కలిగింది. కన్నడంలో సంచలన విజయం సాధించిన ఈ చిత్రం తెలుగులో కూడా మంచి విజయం అందుకుంటుంది అన్నారు. ఈ చిత్రానికి సంగీతం:అంజనీష్ లోక్‌నాధ్, కెమెరా:అద్వైత గురుమూర్తి, ఎడిటింగ్:ఎం.ఆర్.వర్మ, సమర్పణ:అనీల్ సుంకర, దర్శకత్వం: శరన్ కొప్పిశెట్టి.