అంతర్జాతీయం

పారదర్శకత పూజ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, ఫిబ్రవరి 7: ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి నిర్వహణ తీరులో పారదర్శకత లోపించిందని భారత్ ధ్వజమెత్తింది. ముఖ్యంగా వీటో అధికారం కలిగిన దేశాలు వ్యవహరిస్తున్న తీరు ఎంతమాత్రం సమంజసంగా లేదని పేర్కొంది. ఎలాంటి కారణం లేకుండా ఉగ్రవాదులకు సంబంధించి ఈ దేశాలు వ్యవహరిస్తున్నాయని చైనాను పరోక్షంగా దుయ్యబడుతూ భారత్ చురకలు వేసింది. ముఖ్యంగా పాకిస్తాన్ కేంద్రంగా పని చేస్తున్న మసూద్ ఆజాద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలన్న అంశంపై చైనా మోకాలడ్డటాన్ని భారత్ నిరసించింది. భద్రతా మండలి పనితీరు విధానాలపై జరిగిన చర్చలో పాల్గొన్న భారత శాశ్వత ప్రతినిథి సయ్యద్ అక్బరుద్దీన్ మాట్లాడుతూ ‘వీటో అధికారం కలిగిన దేశాల్లో ఏ దేశం తన అధికారాన్ని ఉపయోగిస్తోందో అర్థంకాని పరిస్థితి చాలా సందర్భాల్లో కనిపిస్తుంది’ అని అన్నారు. కొందరు ఉగ్రవాదుల విషయంలో ఈ వీటో దేశాలన్నీ ఏకగ్రీవంగానే తమ నిర్ణయాన్ని ప్రకటిస్తున్నాయని, ఇందులో పారదర్శకత ఏ కోశానా కనిపించడం లేదని అక్బరుద్దీన్ అన్నారు. పైగా ఈ దేశాలు తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి సహేతుకత విషయంలోనూ ఎలాంటి స్పష్టతా కనిపించడం లేదని ఆయన పేర్కొన్నారు. అక్బరుద్దీన్ తన ప్రసంగంలో ఏ దేశం పేరు ప్రస్తావించకున్నా, పాక్ ఉగ్రవాదులకు సంబంధించి తరచూ వీటో అధికారాన్ని ఉపయోగించిన చైనాను దృష్టిలో పెట్టుకునే ఆయన మాట్లాడారన్న విషయం స్పష్టంగా ద్యోతకమైంది. జైషే మహ్మద్ అధినేత అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించేందుకు భారత్ చేసిన ప్రతి ప్రయత్నాన్నీ చైనా అడ్డుకున్న విషయం తెలిసిందే. భద్రతా మండలి ఆంక్షల కమిటీలో చైనా తన వీటో అధికారాన్ని అడ్డుపెట్టి భారత్ ప్రయత్నాలకు గండికొడుతూ వచ్చింది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో మొత్తం 14 ఆంక్షల కమిటీలు ఉన్నాయని, ఈ కమిటీలు తీసుకునే నిర్ణయాలపై ఎలాంటి వివరణా ఉండకపోవడం విడ్డూరంగా ఉంటోందని అన్నారు.