ఎలావుందీ వారం?

ఎలావుందీ వారం? (ఏప్రిల్ 17 నుండి 23 వరకు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)

పనులను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. ఆదాయ వ్యయాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యం తృప్తికరం. బంధువర్గంలో మీ పలుకుబడి పెరుగుతుంది. ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల యందు ముందు చూపు అవసరం. విద్యార్థులకు విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. స్థిరాస్తి వ్యవహారాలకు దూరంగా ఉండండి. సంఘ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆభరణాలు కొనుగోలు చేస్తారు. పెట్టుబడులకు సరైన సమయం కాదు. పట్టుదలతో కార్యాలు పూర్తి చేస్తారు.

వృషభం (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా)

ఉద్యోగులకు బదిలీలు, ఊహించని మార్పులు ఉంటాయి. వ్యవసాయదారులు ప్రత్యామ్నాయ పద్ధతుల ద్వారా లబ్ధి పొందుతారు. దంపతులు అవగాహనతో పనులు పూర్తి చేస్తారు. మనశ్శాంతితో అన్నింటా మెలగండి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఆరోగ్యానికి ఔషధ సేవనం ఉపకరిస్తుంది. వ్యక్తిగత విషయాల పట్ల తొందరపాటు తగదు. స్పెక్యులేషన్ లాభిస్తుంది.

మిథునం (మృగశిర 3,4 పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా)

వ్యూహాత్మకంగా పనులు నిర్వహిస్తారు. ఆర్థిక అంచనాలు అనుకూలిస్తాయి. ఇతరులతో పరిచయాలు, వ్యాపకాలు మెరుగవుతాయి. బంధుమిత్రులను విందులు, వినోదాలకు ఆహ్వానిస్తారు. నగదు, వస్తువులు, పత్రాల విషయంలో జాగ్రత్త అవసరం. కుటుంబంలో అంతా ఒకే మాట మీద ఉండేట్టు చూస్తారు. వ్యవహారాలలోనూ, ఒప్పందాలలోనూ తొందరపాటు తగదు. దంపతుల మధ్య అవగాహన అవసరం. స్పెక్యులేషన్ లాభిస్తుంది. ఉద్యోగులు, వ్యవసాయదారులు లాభాలను అందుకుంటారు. సంతోషంగా ఉంటారు.

కర్కాటకం (పునర్వసు 4 పా, పుష్యమి, ఆశే్లష)

కార్య సఫలత. పనులు పూర్తవుతాయి. విద్యార్థులు, ఉద్యోగులకు అనుకూల కాలం. హుషారుగా ఉంటారు. వృత్తి, వ్యవసాయ, వ్యాపార రంగాల వారు రాణిస్తారు. అలంకరణలకు వ్యయం చేస్తారు. ప్రయాణాలు కలసి వస్తాయి. సంఘంలో విలువలు పెరుగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు. అతిగా ఎవరినీ నమ్మవద్దు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా)

సమస్యలున్నప్పటికీ సామర్థ్యంతో పూర్తి చేస్తారు. ఆదాయ వ్యయాల లావాదేవీలు అనుకూలిస్తాయి. వాహనాలు నడిపేటపుడు జాగ్రత్త అవసరం. ప్రయాణాలలో మెలకువ వహించండి. ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఎవరినీ అతిగా నమ్మవద్దు. దంపతులకు అనుకూలం. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలున్నాయి. భాగస్వామ్య వ్యాపారాలకు అననుకూలం. బ్యాంకు లావాదేవీలపై అప్రమత్తంగా ఉండండి.

కన్య (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త 1,2 పా)

సంయమనంతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి పనుల నిర్వహణ. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. ఇతరుల మాటలకు లొంగిపోవద్దు. విద్య, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల వారు అనుకున్నది సాధిస్తారు. మెరుగైన గుర్తింపును పొందుతారు. బహుమతులు అందుకుంటారు. మనశ్శాంతి లభిస్తుంది. మంచి వార్తలు వింటారు. శుభకార్యాలు అనుకూలిస్తాయి.

తుల (చిత్త 3,4 పా, స్వాతి, విశాఖ 1,2,3 పా)

అధికారుల ఆశీస్సులు అందుకుంటారు. ఆర్థికంగా ఎదుగుతారు. ఖర్చులను నియంత్రించటం మంచిది. నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. పబ్లిక్ రిలేషన్స్‌లో గౌరవ మర్యాదలు పొందుతారు. మాటకు విలువ అధికమవుతుంది. కోర్టు వ్యవహారాలు వాయిదా వేయటం మంచిది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాలలో శ్రమ ఉన్నప్పటికీ ఆదాయం అనుకూలంగా ఉంటుంది. స్ర్తిలకు అన్ని రంగాలలో ఉత్సాహం. ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

వృశ్చికం (విశాఖ 4 పా, అనూరాధ, జ్యేష్ట)

ఏకాగ్రతతో పనులు పూర్తి చేస్తారు. బంధుమిత్రుల సలహాలు లాభిస్తాయి. విదేశీ ప్రయాణాల విషయంలో, ఆస్తి విషయాలలో ఇతరులను నమ్మి డాక్యుమెంట్లు, డబ్బు ఇచ్చి మోసపోవద్దు. ఆటంకాలున్నప్పటికీ మీరనుకున్న రీతిలో పనులు నెరవేరుతాయి. స్ర్తిలకు ధన, గౌరవాలందు లోటుండదు. కోపతాపాలు ఇతరులపై చూపించి విలువైన సమయాన్ని వృధా చేసుకోవద్దు. ప్రయాణాలు, వాహనాల వినియోగంలో అప్రమత్తత అవసరం. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల వారి లావాదేవీలు మెల్లగా ఊపందుకుంటాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపా)

కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో ముఖ్య వ్యవహారాలు పూర్తి చేస్తారు. ధనం పలు రకాలుగా వచ్చే అవకాశం ఉంది. నిరుద్యోగులకు స్థిరత్వం, ప్రైవేటు ఉద్యోగులు పర్మినెంట్ అవుతారు. విద్య, వ్యవసాయ, వ్యాపార, వృత్తి రంగాల వారు అనుకున్న ఆశయాలకై మెరుగైన కృషి చేయాల్సి ఉంటుంది. స్ర్తిలు అన్నింటా రాణిస్తారు. ప్రయాణాలు తృప్తికరం. విలువైన పత్రాలు అందుకుంటారు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా, శ్రవణం, ధనిష్ట 1, 2 పా)

పనులు పూర్తవుతాయి. ధనాదాయం ఉంటుంది. ఆస్తి లావాదేవీలు అనుకూలిస్తాయి. విలువైన వస్తువులు ఖరీదు చేస్తారు. పెండింగ్ పనులు పూర్తి చేసి గుర్తింపు పొందుతారు. నూతన వ్యక్తులతో పరిచయాలుంటాయి. వాహన సౌఖ్యం. స్ర్తిలకు ఉత్సాహవంతమైన కాలం. స్పెక్యులేషన్ అనుకూలిస్తుంది. ప్రయాణాలు ఆనందకరం. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల వారు కాలానుగుణంగా లాభాలు పొందుతారు. ఒక సమాచారం సంతోషపరుస్తుంది.

కుంభం (్ధనిష్ట 3,4 పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా)

సమయపాలనతో పనులు పూర్తి చేస్తారు. గౌరవ మర్యాదలు మెరుగవుతాయి. బకాయి పనులను పట్టుదలతో పూర్తవుతాయి. కుటుంబ వ్యక్తుల మధ్య ఏకాభిప్రాయం కుదురుతుంది. దంపతుల మధ్య అవగాహన. ప్రయాణాలు వాయిదా వేయాల్సి రావచ్చు. ఆరోగ్య విషయంలో ఓర్పు వహించండి. నేర్పు, తీర్పు, ఓదార్పులతో బంధు మిత్రులను ఆకట్టుకొంటారు. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం కలుగజేసుకోకండి. విద్య, ఉద్యోగ, వ్యాపార, వృత్తి, కళారంగాల వారు ఆలోచనలను నిలకడగా ఉంచుకోవాలి.

మీనం (పూర్వాభాద్ర 4వ పా, ఉత్తరాభాద్ర, రేవతి)

బాధ్యతాయుతంగా అన్ని పనులు పూర్తి చేస్తారు. అనుకోని ఖర్చులు ఎదురవుతాయి. సంఘంలో సరైన గుర్తింపు లభిస్తుంది. ఇతరులతో తగుమాత్రంగా వ్యవహరించండి. మోసపూరిత ప్రలోభాలకు దూరంగా ఉండండి. ఉద్యోగులకు బదిలీలు, ప్రమోషన్లు. విద్యార్థులకు పోటీ పరీక్షలందు ఉత్తీర్ణత. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు మెరుగవుతాయి. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఆలోచించి అడుగు వేయండి.

ఎ.సి.ఎం. వత్సల్ 93911 37855