‘హౌరాబ్రిడ్జి’ పాటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాహుల్ రవీంద్రన్ చాందిని చౌదరి, మనాలి రాథోడ్ హీరో హీరోయిన్లుగా రేవన్ యాదు దర్శకత్వంలో ఇ.ఎం.వి స్టూడియోస్ బ్యానర్‌పై తెరకెక్కిన హౌరాబ్రిడ్జి చిత్రంలోని పాటలు హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న నారారోహిత్ సీడీని ఆవిష్కరించి తొలి కాపీని ఆంధ్రప్రదేశ్ మంత్రి పత్తిపాటి పుల్లారావుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో నారారోసిత్, నిఖిల్, ఆర్.కె.గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ- మంచి సినిమా తీశారని తెలుస్తోంది. మంచి టైటిల్, తప్పకుండా ఈ సినిమా మంచి విజయం సాధించాలి అన్నారు. నారారోహిత్ మాట్లాడుతూ- ఫిబ్రవరి 3న విడుదలవుతున్న ఈ చిత్రం ఘనవిజయాన్ని అందుకోవాలని, పాటలు బాగున్నాయని అన్నారు. దర్శకుడు రేవన్ యాదు మాట్లాడుతూ- దర్శకుడిగా ఇది నా రెండవ చిత్రం. చాలా కొత్తగా వుంటుంది. నిర్మాతలు ఎక్కడా ఖర్చుకు వెనుకాడలేదు. ఇంత బాగా సినిమా రావడానికి కారణమైన నా టెక్నీషియన్లకు ప్రత్యేక కృతజ్ఞతలు. శేఖర్ చంద్ర మంచి సంగీతాన్ని అందించారు అన్నారు. రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ- సినిమా విషయంలో చాలా ఆనందంగా ఉన్నాను. ప్రమోషన్ పరంగా కూడా నిర్మాతలు ఇన్నోవేటివ్‌గా వున్నారు. తప్పకుండా నాకు మంచి కమర్షియల్ విజయాన్ని ఇచ్చే చిత్రం ఇది అన్నారు.