అదిలాబాద్

నిబంధనలు ఉల్లంఘిస్తున్న సింగరేణి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీరాంపూర్ రూరల్, నవంబర్ 21: సింగరేణి యాజమాన్యంలో కార్మికు లు పోరాడి సాధించుకున్న హక్కుల ను, అగ్రిమెంట్లను, నిబంధనలను ఉల్లంఘిస్తోందని ఎఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీతారామయ్య ఆరోపించారు. శనివారం శ్రీరాంపూర్‌లోని ఆర్‌కె8గనిని సందర్శించి మాట్లాడారు. సింగరేణి కార్మికులు కోసం ఎన్నో పోరాటాలుచేసి సాధించుకున్న హక్కులను యాజమాన్యం కాలరాస్తుంటే గుర్తింపు సంఘం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కార్మికుల సొంతింటి పథకం, వారసత్వ ఉద్యోగాలు,సకలజనుల సమ్మెజీతం వెంటనే చెల్లించాలని కోరారు. సమ్మె జీతం సాధారణ సెలవుతో కాకుండా వేతనం తో కూడిన సెలవు కావాలన్నారు. ఈనెల 22న సిసిసిలోని నర్సయ్య భవన్‌లో నిర్వహించే సమావేశానికి బదిలీ వర్కర్లు అధికసంఖ్యలో హాజరు కావాలన్నారు. అనంతరం వివిధ యూనియన్ల నుంచి పలువురు కార్మికులు ఎఐటియుసి ప్రధాన కార్యదర్శి సీతారామయ్య సమక్షంలో యూనియన్‌లో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి స్వాగతించారు. పార్టీలో చేరినవారిలో రాములు, జక్కుల నారాయణ, మోటపలుకుల చంద్రయ్య, మోహన్ రెడ్డి, అవునూరి కొమురయ్య, సమ్మయ్య, శ్రీరాములు, సత్యనారాయణ తదితరులున్నారు. కార్యక్రమంలో ఉప ప్రధాన కార్యదర్శి కె.వీరభద్రయ్య, బ్రాంచి కార్యదర్శి కొట్టె కిషన్ రావు, ఫిట్ కార్యదర్శి బాల్‌రెడ్డి, నాయకులు మోహన్, వెంకటేశ్వర్ రావు, పోశం, మోతె నారాయణ, చంద్రయ్య, శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.

బెల్లంపల్లి జిల్లా కోసం పద్మశాలీల ర్యాలీ
బెల్లంపల్లి, నవంబర్ 21: తూర్పు జిల్లాకు కేంద్రమైన అన్ని సౌకర్యాలున్న బెల్లంపల్లి పట్టణాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని శనివారం బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గ తెలంగాణ పద్మశాలి సంఘం ఆద్వర్యంలో పట్టణంలోని కాంటాచౌరస్తా, తెలంగాణ దీక్ష శిబిరం నుంచి పాత బస్టాండు ఏరియా వరకు పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకు లు మాట్లాడుతూ నూతన జిల్లాల ఏర్పాటును ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ నేతృత్వంలో ఒక కమిటీ నిర్ణయించిందని తెలిపారు. కరీంనగర్ జిల్లా పక్కన ఉన్న పట్టణాన్ని జిల్లా చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడం సిగ్గుచేటన్నారు. మంచిర్యాలను జిల్లా చేస్తే అన్ని విధాలా దూర ప్రాంతంలో ఉన్న ఆసిఫాబాద్, కౌటాల, బెజ్జూరు, దహెగాం, వాంకిడి మండలాల ప్రజలకు దూరంలో ఉంటుందని పేర్కొన్నారు. బెల్లంపల్లిని జిల్లా చేస్తే అన్ని విధాలా పరిపాలనా సౌలభ్యంగా అందరికీ అందుబాటులో ఉంటుందని, మంచిర్యాలను జిల్లా చేస్తే ఎవరికీ ఉపయోగం ఉండదన్నారు.