అదిలాబాద్

కొమురంభీం విగ్రహానికి పాలాభిషేకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాంకిడి,అక్టోబర్ 7: తూర్పు జిల్లాలోని వెనుక బడిన ప్రాంతాన్ని కలుపుతూ ఆసిఫాబాద్ జిల్లాగా ఏర్పాటు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రికి ఈ ప్రాంత ప్రజలు రుణపడి ఉంటారని వాంకిడి ఎంపిపి దుర్గం ఆర్తిక అన్నారు.శుక్రవారం వాంకిడి మండలంలోని కుంరం భీం విగ్రహానికి తెలంగాణ యూత్ ఆద్వర్యంలో నిర్వహించిన పాలాభిశేకం కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా పాల్గొని ఆమె మాట్లాడారు.కుంరం భీం జిల్లాగా ఆసిఫాబాద్‌కు నామకరణం చేయడంతోపాటు ఈ ప్రాంత అభివృద్దికి నిధులు ఇవ్వాలని ఆమె పేర్కొన్నారు. జిల్లా ఏర్పాటుతో ఈ ప్రాంతాభివృద్దిని ఇక్కడి నేతల భుజస్కందాలపై ఉంచారని,దీంతో ఈ ప్రాంతంలోని నాయకులంత కలసికట్టుగా అభివృద్దికి పాటుపడనున్నట్లు ఆమె పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఖమాన గ్రామపంచాయతీ సర్పంచ్ పెందూర్ ప్రకాష్,వాంకిడి కో- ఆప్సెన్ సభ్యులు ఎండి షఫిక్,మాజి ఎంపిటిసి,తెలంగాణ యూత్ మండల అధ్యక్షులు దనవల్‌కార్ కమలేష్,(బంటి)కార్యదర్శి పవన్‌సాయి,టిఆర్‌ఎస్ నాయకులు శివదాస్,రాజేశ్వర్‌తదితరులు పాల్గొన్నారు.