అదిలాబాద్

అగ్ర నేతలకు వెలుగు ఎక్కడ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆసిఫాబాద్, అక్టోబర్ 7: రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఉవ్విళ్లూరుతున్న పలువురు అగ్ర నేతలకు జిల్లాల పునర్విభజన మింగుడు పడకుండా మారింది. నిన్న మొన్నటి వరకు ఆదిలాబాద్‌లోని పది నియోజక వర్గాల్లో బలమైన కేడర్ కలిగి ఉండి రాజకీయాలను శాసిస్తూ వచ్చిన ప్రధాన పార్టీలకు చెందిన కొంత మంది నేతల ప్రాభవం ఇప్పుడు మసక బారే పరిస్ధితి ఏర్పడింది. ఈనేతలు మెజారిటీ ఎమ్మెల్యేలను తమ గుప్పిట్లో ఉంచుకొని చక్రం తిప్పుతూ వచ్చారు. తెలుగుదేశం అధికారంలో ఉన్న పది సంవత్సరాల్లో జిల్లా, రాష్ట్ర రాజకీయాల్లో మాజీ కేంద్రమంత్రి వేణుగోపాలాచారి హవా కొనసాగగా, ఆ తరువాత అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ రాజకీయాలను మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్ రావు, మాజీ ఎంపి వివేక్‌లు శాసించారు.
తెలుగుదేశం, కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో వేణుగోపాలాచారి, ప్రేంసాగర్ అనుమతి లేనిదే చీమకుడా చిటుక్కు మనే పరిస్థితి లేక పోయింది. ప్రస్తుతం మన రాష్ట్రంలో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఇంద్రకరణ్ రెడ్డికి సైతం అన్ని నియోజక వర్గాల్లో బలమైన కేడర్, అనుచర గణం ఉంది. ఉమ్మడి జిల్లాలో ఇంత బలమైన కేడర్ కలిగి ఉన్న ఈ ముగ్గురు అగ్రనేతలు జిల్లాల పునర్విభజన తరువాత రాజకీయంగా బలహీన పడనున్నారనే వాదనలున్నాయి. ఎందుకంటే పది నియోజక వర్గాలతో కూడిన జిల్లాలో హవా చలాయించిన ఈఅగ్రనేతల ఆధిపత్యం మున్ముందు రెండు నియోజక వర్గాలకే పరిమితం కానుంది. నిన్న మొన్నటి వరకు జిల్లా నలుమూలలకు చెందిన తన అనుచర వర్గానికి అండగా నిలిచిన మంత్రి ఐకె మున్ముందు పక్క జిల్లాల నేతల విషయాల్లో ఇంతగా జోక్యం చేసుకోక పోవచ్చనే అభిప్రాయాలున్నాయి.
వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి ఆదిలాబాద్ జిల్లాలో అత్యధిక ఎమ్మెల్యే స్థానాలను గెలిపించి కాంగ్రెస్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిద్దామని భావించిన మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్‌కు జిల్లా పునర్విభజన ఒకింత నిరాశే మిగిల్చిందని చెప్పవచ్చు. కాబోయే మంచిర్యాల జిల్లా కేంద్రంగా రాజకీయాలు నెరుపుతున్న సాగర్ రావు పక్క జిల్లాల నియోజక వర్గ రాజకీయాలపై ఇంతకు ముందటి లాగా దృష్టి పెట్టక పోవచ్చని తెలుస్తోంది. ఆదిలాబాద్ రెండుగా విభజిస్తే మంచిర్యాలను శాసిద్దామని భావించి తెరాసలో చేరిన మాజీ ఎంపి వివేక్‌కు సైతం ఇదే పరిస్థితి ఎదురవుతోంది. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో అంత చురుకుగా లేక పోయినా అవకాశం కోసం వేచి చూస్తున్న మాజీ కేంద్రమంత్రి వేణుగోపాలాచారికి సైతం జిల్లాల పునర్విభజన మింగుడు పడని అంశంగానే చెప్పవచ్చు. చిన్న జిల్లాలతో సత్వర అభివృధ్ది సాధ్యపడుతుందనే అంశంలో ఏకీభవిస్తున్న అధికార పార్టీ నేతలను, జిల్లాల పునర్విభజన రాజకీయంగా బలహీన పరిచిందనే చెప్పవచ్చు. పది నియోజక వర్గాల్లో ఉన్న పట్టు కారణంగా రాష్ట్ర రాజకీయాలను శాసించిన ఈనేతలు ఇక ముందు ఒకటి లేదా రెండు నియోజక వర్గాలకే పరిమితం కానున్నారు. దీంతో పక్క జిల్లాల్లోని ఇలాంటి నేతల కేడర్ ఉనికి కోసం స్థానిక నేతల పంచన చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయి. చిన్న జిల్లాల ఏర్పాటు వల్ల అధికారంలో ఉన్న ప్రభుత్వాలను ఇరుకున పెట్టడం లేదా శాసించే పరిస్థిత్లో ఇక ముందు ఏ నేత ఉండబోడనేది స్పష్టమవుతోంది. ఇదే ముఖ్యమంత్రి వ్యూహంలో భాగమనే వాదనలూ లేక పోలేదు.