అదిలాబాద్

నేటి నుంచి విహెచ్‌పి జనజాగరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉట్నూరు,నవంబర్ 8: నేటి నుంచి విశ్వహిం దూ పరిషత్ అద్వర్యంలో గ్రామగ్రామాన జనజాగరణ కార్యక్రమం చేపడుతున్నట్లు విశ్వహిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి బోడిగామ రాములు తెలిపారు. మంగళవారం జనజాగరణకు సంబంధించిన కరపత్రాలు, గోడప్రతుల ను విహెచ్‌పి నాయకులు విడుదల చేశారు. ఈ సంధర్భంగా బోడిగామ రాములు మాట్లాడు తూ దేశవ్యాప్తంగా హిందూ ప్రజలను చైతన్యవంతనం చేసేందుకు ఈ కార్యక్రమం చేపడుతున్నామని అన్నారు. రాబో యే రోజుల్లో హిందూ వ్యతిరేక శక్తులను అడ్డుకునేందుకు, వారికి సమాధానం చెప్పేందుకు విహెచ్‌పి ప్రజలను స న్నద్దం చేస్తుందన్నారు. రాబోయే రోజుల్లో హిం దూవుల ఆశయాలను నెరవేర్చే సాధనలో ముందుకు వెళ్తున్నామని అన్నారు.

మధ్యాహ్న భోజనం కోసం
విద్యార్థుల నిరసన
ఆసిఫాబాద్ రూరల్, నవంబర్ : మధ్యాహ్న భోజనం కోసం జనకాపూర్ జెడ్పీ పాఠశాల విద్యార్థులు మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. జనాకాపూర్ పాఠశాలలో భోజనం బాగాలేదని ఇటీవల విద్యార్థులు పేర్కొనడం జరిగింది. దీంతో అధికారులు సమీపంలోని బిసి వసతి గృహంలో ఈపాఠశాల విద్యార్థులకు భోజనం అందివ్వాలని అధికారులు ఆదేశించారు. ఈమేరకు సోమవారం ఒక్క రోజు విద్యార్థులు బిసి హాస్టల్‌లో భోజనం చేశారు. తిరిగి మంగళవారం నిర్వాహకులు రాలేదంటూ మధ్యాహ్న భోజనం వండలేదు. దీంతో విద్యార్థులు పల్లాలు చేతబట్టుకొని కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళణకు దిగారు. ఈవిషయం తెలుసుకొని బయటికి వచ్చిన కలెక్టర్ విద్యార్థుల సమస్యను అడిగి తెలుసుకున్నారు. సమయం మించి పోయినందున వెంటనే భోజనం తయారు చేయాలని బిసి హాస్టల్ వార్డన్‌ను ఆదేశించారు. అలాగే ఎప్పటిలాగే పాఠశాలలోనే భోజనం వండించేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ చంపాలాల్ హామీ ఇవ్వడంతో విద్యార్థులు శాంతించారు.