అదిలాబాద్

గిట్టుబాటు ధర కోసం ఉద్యమాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, నవంబర్ 13: రైతులు పండించిన పంట ఉత్పత్తులకు మార్కెట్‌లో గిట్టుబాటు ధర కల్పించకుండా వ్యాపారులకు అండగా ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని, వ్యవసాయ రంగాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విస్మరించాయని, ఇందుకోసం సంఘటిత ఉద్యమాలే శరణ్యమని భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆర్‌అండ్‌బి అతిథిగృహం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సిపిఐ జిల్లా మహాసభలకు ఆయన పాల్గొని ప్రసంగించారు. దేశంలో వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టేస్తున్నారని, రైతులు, రైతు కూలీలకు సరైన భద్రత లేకుండాపోతుందని అన్నారు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను ఏర్పాటుచేసేందుకు ప్రభుత్వాలు ముందుకు రావాలని సూచించారు. రైతులకు మార్కెట్‌లో గిట్టుబాటు ధర లభించకా తీవ్రంగా నష్టపోతున్నా పాలక ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. ముఖ్యంగా పత్తికి క్వింటాలుకు రూ.6వేల, సోయాబిన్‌కు రూ.4వేలు ధర కల్పించి ఆదుకోవాలని, ఇందుకోసం సిపిఐ అధ్వర్యంలో రైతులను సంఘటితపర్చి ఉద్యమాలకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాసే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలపై మండల స్థాయి నుండి ఉద్యమాలు చేపట్టాలని సూచించారు. సమరశీల పోరాటాల్లో ముందునుండి పోరాటాలు సాగించిన చరిత్ర సిపిఐకే ఉందని, తెలంగాణ సాయుధ పోరాటంలో సాగించిన పోరాట స్ఫూర్తిని నవతెలంగాణ నిర్మాణం కోసం చాటిచెప్పాలని పిలుపునిచ్చారు. ఎరువులు, విత్తనాల ధరలు పెరిగిపోతుంటే మరోవైపు నకిలీ విత్తనాల బెడద రైతులను నట్టేటముంచుతోందని ఆయన విమర్శించారు. చిన్న జిల్లాల ఏర్పాటుతో పాటు పరిశ్రమలు, ఉపాధి అంశాలపై ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు గుండా మల్లేష్ మాట్లాడుతూ సిపిఐ పార్టీని గ్రామస్థాయి నుండి బలోపేతం చేస్తూ మండలాల్లో, జిల్లాల్లో ఉద్యమ శక్తిగా రూపుదాల్చేల ప్రణాళికలు సిద్ధం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. త్వరలోనే ప్రజా వ్యతిరేక విధానాలపై అందోళన కార్యక్రమాలు చేపడుతామని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కలవేణి శంకర్, రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యురాలు కాశ్యం పద్మ, బాసిరెడ్డి సీతారామయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎస్.విలాస్, రాష్ట్ర నాయకురాలు ముడుపు నళినిరెడ్డి, రైతు సంఘం నాయకులు ముడుపు ప్రభాకర్ రెడ్డి, కుమార స్వామి, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.