అదిలాబాద్

డిజిటల్ పాఠాలతో నాణ్యమైన విద్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్మల్,నవంబర్ 20: ప్రపంచమంతా డిజిటల్ మయమైందని, నూతన సాంకేతిక పరిజ్ఞానంతో మరింత అభివృద్ది చెందే అవకాశం ఉందని, డిజిటల్ పాఠాలు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగకరమని రాష్ట్ర దేవాదాయ, న్యాయ, గృహనిర్మాణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. ఆదివారం సారంగాపూర్ మండలంలోని జామ్ కస్తుర్భాగాంధీ బాలికల గురుకుల విద్యాలయంలో డిజిటల్ పాఠాలను మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, నిర్మల్ జిల్లా కలెక్టర్ ఇలంబరిదితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలోభాగంగా తొలి విడతలో జిల్లాలోని 36 పాఠశాలల్లో డిజిటల్ పాఠాలను ప్రారంభించడం జరిగిందన్నారు. రాబోయే రోజుల్లో అన్ని పాఠశాలల్లో డిజిటల్ బోధనలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. విద్యార్థులను మరింత ఆకట్టుకునేలా డిజిటల్ పాఠాలు ఉన్నాయన్నారు. సాంప్రదాయ విద్యకు భిన్నంగా విద్యార్థులు ఈ విధానం ద్వారా పాఠాలపై సంపూర్ణంగా అవగాహన కలిగి ఉంటారన్నారు. సాంకేతిక విద్యను అందిపుచ్చుకుని మరింత ప్రగతి సాధించాలని విద్యార్థినిలను కోరారు. బాల్యదశలోనే లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాకారానికి నిరంతరంగా శ్రమించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అహర్నిషలు శ్రమిస్తున్నారన్నారు. అనంతరం మంత్రి చించోలి(బి) గ్రామంలో 3 లక్షల రూపాయలతో నిర్మించనున్న విశ్వబ్రాహ్మణ సంఘం భవనానికి శంకుస్థాపన చేశారు. ఆయా కార్యక్రమాల్లో జాయింట్ కలెక్టర్ సి.హెచ్.శివలింగయ్య, జిల్లా విద్యాధికారిణి టి.ప్రణీత, మార్కెట్ కమిటి ఛైర్మెన్ రాజ్ మహ్మద్, దేవెంధర్‌రెడ్డి, ఎంపిపి షెమంతాబాయి పవార్, తహసిల్దార్ శ్యాంసుందర్, ఎంపిడివొ గంగాధర్, ఎం ఈవొ గణేష్, కస్తుర్భాగాంధీ బాలికల విద్యాలయం ప్రత్యేకాధికారిణి అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు.