అదిలాబాద్

విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్,నవంబర్ 20: ఖైదీలకు విజ్ఞానాన్ని పెంపొందించడానికి అవసరమైన పుస్తకాలను అందజేసేందుకు కృషి చేస్తామని జిల్లా కేంద్ర గ్రంథాలయ పర్సన్ ఇంచార్జి, సంయుక్త కలెక్టర్ కృష్ణారెడ్డి అన్నారు. 49వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా ఆదివారం సంయుక్త కలెక్టర్, జిల్లా కేంద్ర గ్రంథాలయ పర్సన్ ఇంచార్జి జిల్లాలోని జైలును సందర్శించారు. ఈ సంధర్భంగా వారు మాట్లాడుతూ జైలులోని ఖైదీలకు అవసరమైన పుస్తకాలు, దిన పత్రికలు వివరాలు తెలియజేసినట్లయితే జిల్లా కేంద్ర గ్రంథాలయం నుండి అందిస్తామని, వాటిని ఖైదీలు వినియోగించుకొని శిక్షకాలంలో సమయాన్ని వృథాచేకుండా విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలన్నారు. శిక్షణ అనంతరం బయటకు వెళ్ళి సమాజ సేవలకు అవసరమైన జ్ఞానాన్ని పొందాలని ఖైదీలకు సంయుక్త కలెక్టర్ సూచించారు. జిల్లా కేంద్ర కారగారంలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలనుద్దేశించి ఆయన మాట్లాడుతూ సమస్యల నుండి బయట పడడానికి పుస్తకాలు, దిన పత్రికలు చదవడం ద్వారా పరివర్ధన చెందగల్గుతారని, అందుకు పుస్తక పఠనం అలవాటు చేసుకోవాలన్నారు. జిల్లా జైలులో ఖైదీలకు అందిస్తున్న సేవలు, పరిసరాల పరిశుభ్రతతో పాటు భోజన సౌకర్యాలు ఎంతో బాగున్నాయని జిల్లా జైలు సూపరింటెండెంట్ వై.మల్లారెడ్డి పనితీరును అభినందించారు. జిల్లా జైలు సూపరింటెండెంట్ మాట్లాడుతూ జిల్లా జైలులో 136 మంది నేరస్తులు ఉన్నారని, వీరిలో 129 మంది పురుషులు, 7 మంది మహిళలు ఉన్నారని అన్నారు. 21 మంది పురుషులు సాధారణ కన్విక్ట్ ఖైదీలుగా, 107 మంది సాధారణ రిమైండ్ ఖైదీలుగా, ఒక్కరు నక్సలైట్ రిమైండ్ ఖైదీగా శిక్షలు అనుభవిస్తున్నాని, చదువుకున్న ఖైదీలకు వారికి అవసరమైన పుస్తకాలు జైలులోని గ్రంథాలయం ద్వారా అందుబాటులో ఉంచడం జరుగుతుందని అన్నారు. చదువురాని నిరక్షరాస్యత ఖైదీలకు రాయడం, చదవడం నేర్పించి, శిక్ష అనంతరం బటయకి వెళ్లేనాటికి వారు సంతకాలు నేర్చుకొని వెళ్తున్నారని వివరించారు.

ఫీజు రీయంబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయాలి
ఆదిలాబాద్ టౌన్,నవంబర్ 20: పెండింగ్‌లో ఉన్న ఫీజురియంబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం గుడిహత్నూర్‌లో ఎస్‌ఎఫ్‌ఐ నాయులు భిక్షాటన చేసి నిరసన తెలిపారు. ఈ సంధర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి కిరణ్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 201516 ఫీజు బకాయిలు రూ.3,200 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని, ఈ సంవత్సరం 14లక్షల మంది విద్యార్థులు స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తు చేసుకున్నారని అన్నారు. ఇప్పటి వరకు నిధులు మంజూరి చేయకపోవడంతో పేద విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
ప్రైవేట్ కళాశాలల్లో విద్యార్థులను ఫీజులు కట్టకపోవడంతో తరగతి గదులకు రానివ్వడం లేదని అన్నారు. వెంటనే ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్, ఫీజురియంబర్స్‌మెంట్ నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

సామాజిక న్యాయం కోసం పాదయాత్ర
సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లేశం
ఉట్నూరు,నవంబర్ 20: సామాజిక న్యాయం, సమాజ అభివృద్ది అనే అంశంతో సి ఐటియు అధ్వర్యంలో పాదయాత్ర చేపడుతున్నామని సి ఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లేష్ అన్నారు. ఆదివారం స్థానికంగా పాదయాత్రపై మిగితా కార్మిక సంఘాలతో సమావేశం నిర్వహించారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక తెలంగాణ అనే అంశంతో తెలంగాణ సాధించుకోగా, ఇప్పటి వరకు సామాజిక న్యాయం, సమాజ అభివృద్ది జరగడం లేదన్నారు. దీనిపై ఇంద్రవెల్లి, ఉట్నూరు మండలాల్లో డిసెంబర్ 15, 16 తేదీల్లో పాదయాత్ర నిర్వహిస్తున్నామని అన్నారు. వచ్చిన తెలంగాణలో ప్రజలు కష్టాల్లో కాలం గడుపుతున్నారని, వారిని ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. జిల్లాల విభజన, మరియు ఇతర కార్యక్రమాలు అంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న ప్రభుత్వం ప్రజల సంక్షేమం వైపు దృష్టిసారించడం లేదన్నారు. ఇప్పటికే రెండున్న ఏళ్లు గడిచిపోయాయని, ఇప్పటి వరకు ఏ సంక్షేమ పథకం కూడా సరిగ్గా అమలు చేయలేదన్నారు. వీటన్నింటిపై చేపడుతున్న పాదయాత్రలో ప్రజలు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.