అదిలాబాద్

ప్రజా ఫిర్యాదులపై అధికారులు దృష్టిపెట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్మల్, డిసెంబర్ 5: ప్రజా ఫిర్యాదుల విభాగంలో వచ్చిన దరఖాస్తులపై అధికారులు ప్రత్యేక దృష్టిసారించి వాటి పరిష్కారానికి కృషిచేయాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ ఇలంబరిది అన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో కలెక్టర్ ఇలంబరిది ఆధ్వర్యంలో ప్రజా ఫిర్యాదుల విభాగం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజాఫిర్యాదుల విభాగానికి జిల్లాలోని, ప్రతీ మండలంలోని, మారుమూల నుండి ప్రజలు తమ సమస్యలను దరఖాస్తుల ద్వారా విన్నవించుకుంటారని, దరఖాస్తుదారులకు న్యాయం జరిగేలా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. భూ సంబంధ కేసులు, పెన్షన్, ఇళ్ల నిర్మాణంకు సంబంధించి అధికంగా ఆర్జీలు వస్తున్నాయని, వాటిని దృష్టిలో ఉంచుకుని ఆర్జీదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటుచేయడం జరిగిందని ఆయన అన్నారు. సారంగాపూర్ మండలం కౌట్లబి గ్రామానికి చెందిన భీమన్న భూ సంబంధ కేసు కొరకు నిర్మల్ మండలం చిట్యాల గ్రామానికి చెందిన ఎస్‌డి సహెదబేగం అంగన్‌వాడీ టీచర్ ఉద్యోగం కోసం, కడెం మండలం పెద్దూర్ గ్రామానికి చెందిన ఎ.లలిత రేషన్ బియ్యం ఇప్పించడానికి, లోకేశ్వరంలోని అవర్గకు చెందిన సి.లక్ష్మి ఇళ్లు మంజూరీకోసం, నిర్మల్ మండలం అనాధ వృద్దాశ్రమ ఛైర్మెన్ సుధాకర్ ఆశ్రమం కొరకు భూమి ఇప్పించాలని, ఖానాపూర్‌కు చెందిన కె.రాధ తన భర్త తప్పిపోయాడని ఆచూకీ కొరకు, లోకేశ్వరం మండలం గడ్‌చాంద గ్రామానికి చెందిన లక్ష్మి తమ కుమారుడు ప్రమాదంలో మృతిచెందాడని, ఆపద్భందు కింద నిధులు మంజూరుచేయించాలని, లక్ష్మణచాంద బోరిగాం గ్రామంకు చెందిన సుశీల కళ్యాణలక్ష్మి డబ్బులు ఇప్పించాలని ఆర్జీలు పెట్టుకున్నారు. దాదాపు 85 వరకు ఆర్జీలు రావడం జరిగిందని తెలిపారు. పై ఆర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి వాటి పరిష్కారానికి అధికారులు కృషిచేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శివలింగయ్య, పంచాయతీ రాజ్ ఈ ఈ మదుసుదన్, పంచాయతీశాఖ అధికారి రవిచంద్ర, ఫారెస్ట్ అధికారి శ్రీనివాస్, సర్వేయర్ ఎస్‌డి అజీజ్, ఎక్సైజ్ అధికారి నాగేందర్‌రెడ్డి, పలుశాఖల అధికారులు పాల్గొన్నారు.