అదిలాబాద్

అవినీతి జాడ్యాన్ని పెకిలిద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, డిసెంబర్ 9: దేశాన్ని పట్టిపీడిస్తున్న అవినీతి వ్యవస్థను కూకటివేళ్ళతో పెకిలించేలా ప్రతి ఒక్కరు అవినీతిరహిత సమాజం, దేశాభివృద్దికోసం భాగస్వాములుకావాలని కలెక్టర్ బుద్దప్రకాష్ జ్యోతి పిలుపునిచ్చారు. శుక్రవారం జడ్పీ సమావేశ మందిరంలో జిల్లా అవినీతి నిరోధక శాఖ అధ్వర్యంలో అవినీతి వ్యతిరేక వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ బుద్దప్రకాష్ జ్యోతి మాట్లాడుతూ అడవిలోని పెద్దపులి ఆకలివేసినప్పుడు మాత్రమే జంతువులను వేటాడి తనకు అవసరమైనంతమేరకు మాత్రమే మాంసం తిని మిగితాది వదిలేసి వెళ్ళిపోతుందని, కాని ప్రజాస్వామ్యంలో మనుషులు మాత్రం తనకు, తన కుటుంబ సభ్యులకోసం సంపాదించాలనే తపనతో అవినీతిని ప్రోత్సహించి ఆదాయానికిమించి ఆస్తులు సంపాదిస్తున్నారన్నారు. మహాత్మాగాంధీ ఆశయాలకనుగుణంగా ప్రజాస్వామ్యంలో మనుషులు కూడా అవసరమైనంత మేరకు సంపాదించాలనే ఆశయం పెట్టుకొని అవినీతి నిర్మూలించడంలో తనవంతు బాధ్యత పోషిస్తూ అవినీతి రహిత సమాజ స్థాపనకు కృషి చేయాలన్నారు. జిల్లా ఎస్పీ మిట్ట శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతిఒక్కరు చట్టం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని, ప్రధానంగా మహిళలు చట్టాలపై అవగాహన పొంది వారి బాధ్యతలు తెలుసుకోవాలన్నారు. ప్రజలు, ఉద్యోగులు అవినీతికి దూరంగా ఉంలని, ధైర్యంగా ముందుకు వచ్చి అవినీతికి పాల్పడే వారిపై ఫిర్యాదు చేయాలని, అదే విధంగా ఏ అధికారికి కూడా లంచాలు ఇవ్వవద్దని, అవినీతిని నిర్మూలించడానికి ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని, ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పోలీసు శాఖ ఉద్యోగులు అవినీతికి దూరంగా ఉంటూ దేశాభివృద్దికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా అవినీతి నిరోధక శాఖ డిఎస్పీ పాపలాల్ మాట్లాడుతూ ఐక్యరాజ్య సమితి తీర్మానం మేరకు 2003 అక్టోబర్‌లో దేశవ్యాప్తంగా అవినీతి నిరోధక శాఖ అధ్వర్యంలో అవినీతి వ్యతిరేక వారోత్సవాలు ప్రారంభించబడ్డాయని, అందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు డిసెంబర్ 3 నుండి 9 వరకు అవినీతి నిరోధక వ్యతిరేక వారోత్సవాలు జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా అవినీతి రహిత సమాజం కోసం పెద్ద ఎత్తున అవగాహన సదస్సులు నిర్వహించామని అన్నారు. ప్రభుత్వ శాఖల ఉద్యోగులు, ప్రజలు ఆదాయానికి మించి ఆస్తులున్నట్లయితే వారిని గుర్తించి అవినీతి నిరోధక శాఖ అధ్వర్యంలో దాడులు చేపట్టి కేసులు నమోదు చేసి, ఏసిబి కోర్టు ద్వారా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. అవినీతిని నిర్మూలించడానికి ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఎవరైన లంచం కోసం డిమాండ్ చేసినట్లయితే వెంటనే టోల్‌ఫ్రీ నెం.1064 ద్వారా తెలియజేయాలని, సమాచారం అందించిన అభ్యర్థుల పేర్లను గోప్యంగా ఉంచుతామని, లంచాల కోసం పాటుపడే వారి వివరాలు అందజేయాలని సూచించారు. జిల్లా పరిషత్ సి ఈవో జితేందర్ రెడ్డి మాట్లాడుతూ అవినీతి నిర్మూలతోనే దేశం అభివృద్ది చెందుతుందని, సమాజంలోని ప్రతి ఒక్కరిలో ప్రవర్తనతోనే మార్పులు వస్తాయని అన్నారు. ప్రజాస్వామ్యంలో అవినీతి రహిత సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని పేర్కొన్నారు. అనంతరం అవినీతి వ్యతిరేక వారోత్సవాల సంధర్భంగా వివిధ పాఠశాలల విద్యార్థినీ విద్యార్థులకు వ్యాస రచన పోటీలు నిర్వహించగా ప్రతమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో గెలుపొందిన వారికి కలెక్టర్ చేతుల మీదుగా ధృవీకరణ పత్రాలు పంపిణీ చేశారు. ఈ సమావేశంలో అవినీతి నిరోధక శాఖ ఇన్స్‌పెక్టర్లు వేణుగోపాల్, కాశయ్య, జిల్లా విద్యాశాఖాధికారి లింగయ్య, జిల్లా ట్రేజరి అధికారి నాగరాజు, జిల్లా గెజిటెడ్ ఉద్యోగుల సంఘం కార్యదర్శి రాజేశ్వర్ దేశ్‌పాండే, టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు ఎస్.అశోక్, వివిధ శాఖల అధికారులు, అవినీతి నిరోధక శాఖ ఉద్యోగులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

నగదు రహిత లావాదేవీలే మేలు
* మంచిర్యాల కలెక్టర్ కర్ణన్
మంచిర్యాల, డిసెంబర్ 9: నగదు రహిత ఆర్థిక లావాదేవిలపై రైతులు అవగాహన పెంచుకోవాలని కలెక్టర్ కర్ణన్ సూచించారు. శుక్రవారం చెన్నూర్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యాడ్‌ను సందర్శించి యాడ్‌లో అందుతున్న సేవలపై రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వ్యవసాయ మార్కెట్ యాడ్‌లో నగదు రహితపై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రైతులను ఉద్దేశ్యించి మాట్లాడారు. నగదు రహిత ఆర్థిక లావాదేవిలే భవిష్యత్‌లో జరగనునందున రైతులు కష్టమైన ఖచ్ఛితంగా నగదు రహిత ఆర్థిక లావాదేవిలను ఉపయోగించడం నేర్చుకోవాలని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లు రద్దు చేయడం వల్ల రైతులు, వ్యాపారులు, కార్మికులు, కూలీలు ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, సామన్య ప్రజానీకానికి డిసెంబర్ 31 వరకు కొంచెం ఇబ్బందిగానే ఉంటుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ముందుగానే 80 శాతం సామన్య ప్రజలకు ఏ టీ ఎం కార్డులు ఉన్నందున డబ్బులు డ్రా చేయడమే కాకుండా స్వైపింగ్ మిషన్ ద్వారా అన్‌లైన్‌లో లావాదేవిలను నిర్వహించుకోవచ్చునని తెలిపారు. ఈ అన్‌లైన్ లావాదేవిలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం వ్యవసాయ శాఖ అధికారులు మాట్లాడుతూ రబీ కాలంలో ఆరుతాడి పంటలను వేసుకొని తక్కువ నీటితో ఎక్కువ దిగుబడిని సాధించాలని సూచించారు. ఆరితాడు పంటలలో పెసరు, మినుము, నువ్వు తదితర పంటల విత్తనాలను అందుబాటులో ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ ఏడీ గజానన్, వ్యవసాయ శాఖ అధికారులు, బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు.