అదిలాబాద్

నిర్మల్‌లో పాలన అధ్వానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచిర్యాల, డిసెంబర్ 9: మున్సిపల్ పాలక వర్గం పాలన అధ్వానంగా ఉందని అభివృద్ది పేరుతో నిధులు దుర్వినియోగం చేస్తున్నారని అధికార ప్రతిపక్ష పార్టీల కౌన్సిలర్లు మండి పడ్డారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయం ఆవరణంలోని ఐకేపి భవనం నిర్వహించిన అత్యవసర సమావేశం చైర్‌పర్సన్ వసుంధర అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఏజెండాలోని అంశాలను చదివి వినిపించగా పాలక వర్గం సభ్యులంతా అనవసరమని తీర్మాణాలను చేపట్టడం సరికాదని అన్నారు. ఎల్ ఈడి బల్బుల ఏర్పాటు కొరకు నిర్ణయం తీసుకోగా కౌన్సిలర్ల తీర్మాణం అవసరమని చైర్ పర్సన్ వసుంధర పేర్కొన్నారు. ప్రభుత్వ నిధులతో ఎల్ ఈ డీ బల్బులను ఏర్పాటు చేయాలని ఎల్ ఈడీ బల్బుల వల్ల ప్రయోజనం ఏమిటని కౌన్సిలర్లు బొట్ల సత్యనారాయణ, పూదరి ప్రభాకర్‌లు ప్రశ్నించారు. వీటిపై పూర్తి సమాచారం ఇవ్వాలని తెలిపారు. పట్టణంలోని డివైండర్లలో మొక్కలు నాటేందుకు 6 లక్షల వ్యయం అవసరముందని ఏజెండాలో పొందుపరచగా కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ శ్రీపతి శ్రీనివాస్ అభ్యంతరం తెలిపారు. హరితహారం పేరుతో గతంలో పట్టణంలోని అన్ని ప్రాంతాలలో మొక్కలు నాటినప్పటికీ డివైండర్లపై లక్షలు వెచ్చించి మొక్కలు నాటడం సమంజసం కాదన్నారు. అభివృద్ది విషయంలో పాలకవర్గం అనుసరిస్తున్నా విధానాలపై కౌన్సిలర్లు విరుచుకుపడ్డారు. పట్టణంలో టెలికాం శాఖ ఆధ్వర్యంలో విచ్చలవిడిగా రోడ్లను త్రవ్వుతున్నారని వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నాల్గవ కౌన్సిలర్ షఫీ ప్రశ్నించారు. రోడ్లు త్రవ్వడం వల్ల పట్టణ ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎజెండాలో పొందుపరిచిన అంశాలపై కౌన్సిలర్లు తీర్మాణం చేశారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నల్ల శంకర్, కమీషనర్ వెంకన్న, కౌన్సిలర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

నెలాఖరులోగా సెటాప్ బాక్సులు
* జిల్లా జాయింట్ కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య
నిర్మల్, డిసెంబర్ 9: జిల్లాలో డిష్ కనెక్షన్ ఉన్న వారందరికి ఈ నెల 31వ తేదిలోగా డిజిటల్ సెటాప్ బాక్సులను అమర్చాలని, లేకుంటే చర్యలు తీసుకుంటామని జిల్లా జాయింట్ కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య, ఎంఎస్‌వొలు, కేబుల్ ఆపరేటర్లను హెచ్చరించారు. శుక్రవారం నిర్మల్‌లోని జాయింట్ కలెక్టర్ చాంబర్‌లో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన కేబుల్ ఆపరేటర్లు, ఎంఎస్‌వొలతో డిజిటల్ సెటాప్ బాక్సుల ఏర్పాటుపై జాయంట్ కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఈనెల 31లోగా ఛానళ్ల డిజిటలైజేషన్ ప్రక్రియను పూర్తిచేయాలని ఆదేశించిందన్నారు. డిష్ కేబుల్ ద్వారా ప్రసారమవుతున్న వివిధ చానల్స్ ప్రసారాలను ఖచ్చితంగా ప్రభుత్వం నిర్దేశించిన తేదీలోగా సెటాప్ బాక్సులు అమర్చి డిజిటలైజేషన్‌ను పూర్తిచేయాలని కేబుల్ ఆపరేటర్లు, ఎం ఎస్‌వొలను ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కార్యాలయ సూపరిండెంట్ వినోద్‌కుమార్, ఎం ఎస్‌వొలు, బండారి ప్రకాష్, కడెం, ఖానాపూర్, భైంసా, నిర్మల్‌లకు చెందిన కేబుల్ ఆపరేటర్లు పాల్గొన్నారు.