అదిలాబాద్

పట్టణాన్ని అభివృద్ధి చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్ టౌన్, డిసెంబర్ 9: మున్సిపాలిటీలోని 36 వార్డుల్లో దశలవారీగా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ అన్ని రంగాల్లో అభివృద్ది పర్చేందుకు కృషిచేయడం జరుగుతుందని చైర్‌పర్సన్ రంగినేని మనీషా అన్నారు. శుక్రవారం పట్టణంలోని 21, 3 వార్డుల్లో సిసి రోడ్డు, మురికి కాలువల పనులకు చైర్‌పర్సన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మనీషా మాట్లాడుతూ సిసి రోడ్డు నిర్మాణానికి రూ.2.5లక్షలు, మురికి కాలువల నిర్మాణానికి రూ.5లక్షల నిధులు కేటాయించడం జరిగిందన్నారు. పట్టణంలోని అన్ని వార్డులో దళవారీగా అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టడం రుగుతుందన్నారు. పట్టణవాసుల తాగునీటి కష్టాలను దూరం చేసేందుకు రెండేళ్ళల్లో ప్రతి ఇంటికి కుళాయి ద్వారా శుద్దజలం అందించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ మంగతయారు, వైస్ చైర్మెన్ ఫారుఖ్ ఆహ్మాద్, కౌన్సిలర్లు అందె శ్రీదేవి, ఆవుల వెంకన్న, బండారి సతీష్‌తో పాటు పలువురు టీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.

వైభవంగా సాయిబాబా హారతి
* హాజరైన మంత్రి, కలెక్టర్
నిర్మల్, డిసెంబర్ 9: పట్టణానికి చెందిన ప్రముఖ కాంట్రాక్టర్, సాయిదీక్షా సేవాసమితి జిల్లా అధ్యక్షుడు లక్కడి జగన్‌మోహన్‌రెడ్డి నివాసంలో శుక్రవారం సాయిబాబా హారతి, అయ్యప్ప పూజా మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. నిర్మల్‌తోపాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన సాయిబాబా దీక్షాపరులు, అయ్యప్ప స్వాములు వందలాది సంఖ్యలోపాల్గొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో గృహనిర్మాణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, నిర్మల్ జిల్లా కలెక్టర్ ఇలంబరితి, జెసి శివలింగయ్య, డిఎస్పీ మనోహర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మెన్ అప్పాల గణేష్ చక్రవర్తి, మున్సిపల్ కమీషనర్ త్రయంబకేశ్వర్‌రావు, డిఈ సంతోష్‌బాబు, ఆర్‌అండ్‌బి డిఇ బాపురెడ్డి, పిఆర్ ఈఈ మధుసూదన్‌రావ్, డిఈ తుకారాం రాథోడ్, ఎపీడబ్యు ఐడీసి అధికారి మధన్, ట్రాన్స్‌కో ఏ ఈ ప్రభాకర్, నాయకులు రావుల రాంనాథ్, డాక్టర్ కృష్ణంరాజు, వై. సాయన్న, ఎం శంకర్, ప్రముఖ వ్యాపారులు పొలిశెట్టి కిషన్, వడూరి విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు.