అదిలాబాద్

భర్త చేతిలో భార్య దారుణ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెజ్జూర్, డిసెంబర్ 9: భర్త చేతిలో భార్య దారుణహత్యకు గరైన సంఘటన బెజ్జూర్ మండలంలో శుక్రవారం సంచలనం సృష్టించింది. ఈ సంఘటనకు సంబంధింన వివరాలు కౌటాల సిఐ అచ్చేశ్వర్ రావు కథనం ప్రకారం ఇలా ఉన్నాయి. మండలంలోని పాపన్‌పేట గ్రామానికి చెందిన ఉబిడె శకుంతల (28)ను ఆమె భర్త సురేష్ గురువారం రాత్రి గొంతుకోసి హత్యచేసినట్లు సిఐ తెలిపారు. గతేడాది శకుంతల, సురేష్‌లకు బెజ్జూర్ రంగనాయకుల ఆలయంలో ప్రేమవివాహం జరిగింది. వివాహ సమయంలో వరకట్నం క్రింద సురేష్‌కు రూ.2లక్షలను శకుంతల తల్లిదండ్రులు ఇచ్చారు. కట్నం సొమ్ము విషయమై ఆగస్టులో కుల పంచాయితీ నిర్వహించగా డబ్బులు ఖర్చు అయిపోయాయని, కూలీపనిచేసి డబ్బులను సంపాందించి డిపాజిట్ చేస్తానని పెద్దమనుషుల సమక్షంలో ఒప్పుకున్నారు. కాగా, గురువారం రాత్రి సురేష్ స్వగ్రామం పాపన్‌పేట వచ్చి సమీపంలో నిర్జన ప్రదేశానికి శకుంతలను తీసుకువెళ్లి కత్తితో గొంతుకోసి హత్య చేశాడన్నారు. కాగా, శుక్రవారం ఉదయం బహిర్బూమికి వెళ్ళిన గ్రామస్థులకు శకుంతల శవమై కనిపించడంతో పోలీసులకు, తల్లిదండ్రులకు గ్రామస్థులు సమాచారమందించారు. తన కూతురును సురేష్ తరచుగా వేధిస్తుండేవాడని తల్లిదండ్రులు బాయక్క, ముత్తయ్య భోరున విలపించారు. కాగా, కుటింబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నట్లు ఇన్‌చార్జి ఎస్సై పురుషోత్తం తెలిపారు.