అదిలాబాద్

ప్రజా సంక్షేమాన్ని విస్మరిస్తున్న టి ఆర్ ఎస్‌ప్రభుత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడెం, డిసెంబర్ 15: రాష్ట్రంలో అధికారంలో కొనసాగుతున్న తెలంగాణ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని తెలుగుదేశం పార్టీ ఆదిలాబాద్ మాజీ ఎంపి రాథోడ్ రమేష్ అన్నారు. గురువారం దస్తురాబాద్ మండలంలోని గొడిసిర్యాల గ్రామంలో టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో అవినీతిపాలన కొనసాగుతుందని ఆయన ఆరోపించారు. సంక్షేమ పథకాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. తెలంగాణలో అభివృద్దిచేసిన ఘతన ఏపి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుదేనని ఆయన తెలిపారు. ఉద్యమ పార్టీని గద్దెనెక్కిన టి ఆర్ ఎస్ సర్కార్ ప్రజలను తీవ్ర వంచనకు గురిచేస్తుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు పూర్తిగా కమీషన్ల పథకాలుగా తయారయ్యాయని ఆయన ఆరోపించారు. పేదలను, రైతులను, విద్యార్థులను పట్టించుకునే నాథుడే కరువయ్యారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. రానున్న రోజుల్లో ప్రజలు ప్రభుత్వానికి గట్టిబుద్ది చెబుతారని ఆయన పేర్కొన్నారు. అనంతరం గోండుగూడెం గ్రామాలతో మాట్లాడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. గిరిజనుల సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కోల శ్రీనివాస్, తాటి సంజీవ్‌పటేల్, పి.శ్రీనివాస్‌రెడ్డి, దీటి సత్యం, జీవన్‌నాయక్, మోహన్‌నాయక్, రాజమల్లు, శివయ్య, గంగాధర్, రాజేశ్వర్, శ్రీకాంత్‌యాదవ్, శ్రీ్ధర్‌బాబు, జనార్ధన్, తలారి లక్ష్మణ్, విలాస్‌యాదవ్, రాజాగౌడ్, గ్రామస్తులు పాల్గొన్నారు.

నగదు చెల్లింపుల కోసం రోడ్డెక్కిన కార్మికులు
* నిర్మల్‌లోలో భారీ ర్యాలీ, ధర్నా
* ఆన్‌లైన్ విధానాన్ని రద్దుచేయాలని డిమాండ్
* బీడి పింఛన్లను నగదులో చెల్లించాలని కలెక్టర్‌కు వినతి
నిర్మల్, డిసెంబర్ 15: పెద్దగా చదువులులేని బీడి కార్మికులకు నెలసరి అందుతున్న పింఛన్లను ఆన్‌లైన్ చెల్లింపులతో బ్యాంకుల ద్వారా తీసుకోవడం తీవ్ర ఇబ్బందిగా మారిందని, దీనిని రద్దుచేసి నగదురూపంలోనే కార్మికులకు పింఛన్లను అందజేయాలని తెలంగాణ ప్రగతిశీల బీడి వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బక్కన్న, రాజన్నలు డిమాండ్‌చేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని మున్సిపల్ ఫంక్షన్‌హాల్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు వేలాది మంది బీడి కార్మికులు ర్యాలీగా వచ్చి ధర్నా చేశారు. కలెక్టర్ కార్యాలయం ముందు బైఠాయించి తమ నిరసనను తెలియజేశారు. ఈ సందర్భంగా ఆన్‌లైన్ విధానాన్ని రద్దుచేయాలని కోరుతూ కార్మికులు నినాదాలుచేశారు. అనంతరం కలెక్టరేట్ కార్యాలయంలో వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బీడి వర్కర్స్ యూనియన్ నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెద్దనోట్లను రద్దుచేయడం వల్ల బ్యాంకుల వద్ద, ఎటి ఎంల వద్ద జనం బారులు తీరుతున్నారన్నారు. వృద్దులు క్యూలైన్‌లలో నిలబడ లేక అనారోగ్యానికి గురవుతున్నారని, అయినా తప్పనిసరి పరిస్థితుల్లో డబ్బుల కోసం ప్రతీరోజు బ్యాంకుల చుట్టూ తిరగక తప్పడం లేదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బీడి కార్మికులందరికి ఆన్‌లైన్ ద్వారా నెలసరి వేతనాలు చెల్లించాలని కేంద్ర కార్మిక శాఖ ఉత్తర్వులు జారీచేయడం దారుణమన్నారు. నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో దాదాపు లక్ష 30 వేల మంది బీడి కార్మికులున్నారని, ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 7 లక్షల మంది, దేశవ్యాప్తంగా 60 లక్షల మంది బీడి కార్మికులున్నారన్నారు. వీరిలో 98 శాతం మంది మహిళలు, 70 శాతానికి పైగా నిరక్షరాస్యులన్నారు. ఇంత పెద్ద ఎత్తున కేంద్రీకరించబడిన బీడి పరిశ్రమలోని కార్మికులు ఆన్‌లైన్ పేమెంట్ విధానం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇప్పటికే ప్రావిడెంట్ ఫండ్ ఫారం నంబర్ 9లో బీడి కార్మికుల ఇంటిపేరు, కార్మికురాలి పేరు, తండ్రి, భర్త పేర్లలో అనేక తప్పులు ఉన్నాయన్నారు. వీటిని సరిచేయకుండా ఏ పేరుతో బ్యాంకులో ఖాతా తెరవాలో తెలియక బీడి కార్మికులు అయోమయానికి లోనవుతున్నారన్నారు. గ్రామాల్లో వంద సంఖ్యలో ఉన్న బీడి కార్మికులు ప్రతీనెల వేతనాలను బ్యాంకులోకి వెళ్లి తీసుకోవాలంటే ఇతరులపై ఆధారపడాల్సిందేనన్నారు. ఏటి ఎం కార్డు ద్వారా డబ్బులు తీసుకోవడానికి చదువురాని కార్మికులు మోసపోయే అవకాశం ఉందన్నారు. అసలే అరకొర పనిదినాలతో నెట్టుకొస్తున్న బీడి కార్మికులకు ప్రతీనెల బ్యాంకుల చుట్టూ తిరగాల్సి రావడం వల్ల ఆర్థికంగా మరింత ఇబ్బందులు తప్పవన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి పిఎఫ్‌లో ఉన్న తప్పులను సవరించాలని, ప్రతీ గ్రామానికి బ్యాంకుల శాఖలను ఎటి ఎంలను ఏర్పాటుచేయాలన్నారు. అప్పటి వరకు బీడి కార్మికులందరికి నగదురూపంలోనే నెలసరి వేతనాలను చెల్లించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించాలని విజ్ఞప్తిచేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ఐ ఎఫ్‌టియు నాయకులు రాంలక్ష్మణ్, ఎండి గఫూర్, ఎస్.గంగన్న, కె.లక్ష్మి, బోతెకర్ సుమేగ్, బీడి కార్మిక సంఘం నాయకురాల్లు హరిత, విజయ, భీమక్క,పోసాని, కె.హన్మాగౌడ్, వేలాది సంఖ్యలో బీడి కార్మికులు పాల్గొన్నారు.