అదిలాబాద్

చేనేత పరిశ్రమకు పూర్వవైభవం తెద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆసిఫాబాద్, జనవరి 16: చేనేత వస్త్ర పరిశ్రమకు పూర్వవైభవం తీసుకొచ్చే విధంగా కృషి చేయాలని, ఇందుకోసం ప్రతి సోమవారం నిర్వహించే ప్రజాఫిర్యాదుల విభాగానికి అధికారులు చేనేత వస్త్రాలు ధరించి హాజరు కావాలని కుమ్రం భీం జిల్లా కలెక్టర్ చంపాలాల్ సూచించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ భవనంలో జరిగిన ప్రజాఫిర్యాదుల విభాగంలో పాల్గొన్న కలెక్టర్ జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు 30శాతం సబ్సిడీపై లభించే చేనేత వస్త్రాలను కొనుగోలు చేయడంపై ఆసక్తి చూపాలన్నారు. చేనేత లక్ష్మి పథకం కింద ఐదు మాసాల పాటు ప్రతి నెల రూ.500 కడితే అదనంగా ఇనె్సంటివ్ కల్పిస్తామని తెలిపారు. అంతకుముందు కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర ప్రదర్శన శాలను కలెక్టర్ అధికారులతో కలిసి ప్రారంభించారు.
ప్రజాఫిర్యాదుల విభాగానికి ఫిర్యాదుల వెల్లువ
ప్రజాసమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన గ్రీవెన్స్ సెల్‌కు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. జిల్లాలోని ఆయా మండలాలకు చెందిన అర్జీదారులు కలెక్టర్‌కు తమ సమస్యలను వివరించారు. బెజ్జూర్ మండలం బారెగుడకు చెందిన తాళ్లపల్లి జనార్ధన్ దళిత బస్తీకింద మూడెకరాల భూమి ఇవ్వాలని కోరారు. రోడ్డు ప్రమాదంలో అవయవం కోల్పోయిన తనకు సదరమ్ క్యాంపులో ధృవపత్రం ఇప్పించి, జీవనోపాధి కల్పించాలని కౌటాల మండలానికి చెందిన ఎం.శివకుమార్ వినతి పత్రం అందచేశారు.
చెరువునిర్మాణంలో ముంపుకు గురైన తన భూమికి నష్టపరిహారం ఇప్పించాలంటూ వాంకిడి మండలం నార్లాపూర్‌కు చెందిన అనంత్ అనే రైతు అర్జీ పెట్టుకున్నారు. సింగరేణి బొగ్గుగనిలో కోల్పోయిన తన మూడెకరాల భూమికి సంభందించిన నష్టపరిహారం ఇప్పించాలని రెబ్బెన మండలం పులికుంటకు చెందిన ధరావత్ విమల అనే మహిళ కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకున్నారు. కిరాణా దుకాణం నిర్వహించేందుకు రుణసహాయం ఇప్పించాలని వాంకిడి మండలం గోయగాంకు చెందిన సకారాం కోరారు. కమ్యునిటీ హాల్ నిర్మాణం కోసం ఇచ్చిన ఎకరం భూమికి సంభందించిన నష్టపరిహారం ఇవ్వాలని ఆసిఫాబాద్ మండలం జనకాపూర్‌కు చెందిన పీర్ మహ్మద్ కోరారు. ఇలా వందకు పైగా దరఖాస్తులు ప్రజాఫిర్యాదుల విభాగంలో అందాయి. వీరందరి సమస్యలు ఓపికతో విన్న కలెక్టర్ చంపాలాల్ వాటి పరిష్కారానికి కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే గత ప్రజాఫిర్యాదుల విభాగాల్లో అందిన అర్జీలపై శాఖల వారీగా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.ఈకార్యక్రమంలో జెసి అశోక్‌కుమార్, జిల్లాపంచాయతీ అధికారి గంగాధర్ గౌడ్, ల్యాండ్ సర్వే రికార్డుల సహాయ సంచాలకులు జనార్ధన్, డిఇఓ రఫీక్ పాల్గొన్నారు.

ప్రజావాణి అర్జీలకు ప్రత్యేక ప్రాధాన్యత
ఆదిలాబాద్ ఇన్‌చార్జి కలెక్టర్ కృష్ణారెడ్డి

ఆదిలాబాద్,జనవరి 16: ప్రతి సోమవారం నిర్వహించే డయల్ యువర్ కలెక్టర్, ప్రజావాణి ద్వారా వచ్చిన దరఖాస్తులపై అధికారులు ప్రత్యేక దృష్టిసారించి సత్వర పరిష్కారం కోసం కృషి చేయాలని ఆదిలాబాద్ ఇంచార్జి కలెక్టర్ కృష్ణారెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో డయల్ యువర్ కలెక్టర్, ప్రజావాణి కార్యక్రమాలు నిర్వహించి ప్రజల నుండి ఆర్జీలు స్వీకరించారు. ముందుగా నిర్వహించిన డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమ ద్వారా జిల్లాలోని పలు ప్రాంతాల నుండి ఐదుగురు ఆర్జీదారులు వారి వారి సమస్యలను ఫోన్‌ద్వారా జెసికి వివరించారు. నార్నూర్ మండల కేంద్రానికి చెందిన రాంనివాస్ బానోత్ ఐటిడి ఏ ద్వారా చేపల పెంపకానికి రుణం మంజూరి చేయాలని, ఆదిలాబాద్ పట్టణానికి చెందిన నెహ ఫాతిమా విద్యావాలంటరీలకు వేతనం రావడం లేదని, గుడిహత్నూర్ మండలం తోషం గ్రామానికి చెందిన జె.రాజేశ్వర్ టేకు కలప విక్రయించడానికి అనుమతి ఇవ్వాలని, నేరడిగొండ మండలం వడూర్ గ్రామానికి చెందిన పి.నరేష్ కళ్యాణలక్ష్మి నిధులు మంజూరి చేయాలని విన్నవించారు. అదే విధంగా జైనథ్, భోరజ్ గ్రామానికి చెందిన ఏ.రాకేష్ అంగన్వాడీ భవన నిర్మాణ పనులు పూర్తికాలేదని జాయింట్ కలెక్టర్‌కు వివరించారు.
అనంతరం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం ద్వారా జిల్లాలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి ఆర్జీలు స్వీకరించారు. తమ సమస్యలు పరిష్కారం అవుతాయనే నమ్మకంతో దూరభారాన్ని లెక్కచేయకుండా ప్రజలు కార్యాలయానికి వచ్చి ఆర్జీలు సమర్పించుకుంటారని, వారి నమ్మకాన్ని వమ్ముచేయకుండా సమస్యల సత్వర పరిష్కారం కోసం కృషి చేయాలన్నారు. డయల్ యువర్, ప్రజావాణి కార్యక్రమాల ద్వారా వచ్చిన ఆర్జీల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.