అదిలాబాద్

అంబేద్కర్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్మల్,జనవరి 17: ప్రపంచం గర్వించదగ్గ మహామేధావి డాక్టర్ బి ఆర్ అంబేద్కర్‌ను సమాజంలోని ప్రతీ ఒక్కరు స్ఫూర్తిగా తీసుకోవాలని రాష్ట్ర గృహనిర్మాణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం రాత్రి పట్టణంలోని దివ్యాగార్డెన్స్‌లో డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ 125వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని నిర్వహించిన సంఘం శరణం గచ్చామి అనే నాటిక కార్యక్రమానికి మంత్రి ముఖ్య అథితిగా హాజరయ్యారు. ముందుగా జిల్లా కలెక్టర్ ఇలంబరిది, ఎస్పీ విష్ణు ఎస్ వారియర్, మున్సిపల్ ఛైర్మెన్ అప్పాల గణేష్ చక్రవర్తిలతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం భారతరత్న డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సమాజంలో ప్రతీ ఒక్కరు గుర్తుంచుకోవాల్సిన మహనీయుడు డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. ప్రపంచం గర్వించదగ్గ గొప్ప మేధావని, ఆయన రచించిన భారతరాజ్యాంగం వల్లనే సమాజంలోని అన్నివర్గాలకు సమాన హక్కులు అందుతున్నాయన్నారు. భారతరత్న అంబేద్కర్ 125వ జయంతి ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్‌లో 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటుచేసేందుకు ప్రభుత్వం కృషిచేస్తోందన్నారు. అనంతరం రూ.95 వేల చెక్కును సంఘం శరణం గచ్చామి నాటిక ప్రదర్శనకు అందజేసి ప్రదర్శనను తిలకించారు. ఈ సందర్భంగా హాజరైన జిల్లా కలెక్టర్ ఇలంబరిది మాట్లాడుతూ భారతదేశం వెనుకబడి, ఎన్నో సమస్యలతో సతమతమవుతున్నప్పుడే భారతరత్న డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ఎన్నో ఉన్నత చదువులు చదవడంతోపాటు భారత రాజ్యాంగాన్ని రచించారని తెలిపారు.

రోడ్డు ప్రమాదాలపై
అవగాహన అవసరం
ఎస్పీ శ్రీనివాస్

ఆదిలాబాద్,జనవరి 17: రోడ్డు భద్రత నియమాలను సక్రమంగా పాటించినట్లయితే సమాజంలో ప్రమాదాలను నివారించవచ్చని, ట్రాఫిక్ నియమ నిబంధనలపై ప్రతి ఒక్కరికి అవగాహన పెంపొందించుకోవాలని జిల్లా ఎస్పీ ఎం.శ్రీనివాస్ అన్నారు. 28వ జాతీయ రహదారి భద్రత వారోత్సవాలను పురస్కరించుకొని ఈనెల 17 నుండి 23 వరకు జిల్లా వ్యాప్తంగా పోలీసులు వినూత్న ప్రచారంతో అవగాహన కార్యక్రమాలు చేపట్టనుండగా తొలి రోజు మంగళవారం ఆదిలాబాద్‌లో పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జిల్లా ఎస్పీ శ్రీనివాస్ స్వయంగా హెల్మెట్ ధరించి ద్విచక్రవాహనంపై పట్టణంలోని అంబేద్కర్‌చౌక్, గాంధీచౌక్ మీదుగా మోటారుసైకిల్ ర్యాలీ నిర్వహించారు. వినాయక్ చౌక్ నుండి ఆశోక్‌రోడ్డు మీదుగా సాగిన ఈ ర్యాలీ గాంధీచౌక్, అంబేద్కర్ చౌక్, శివాజీచౌక్, నేషనల్ హైవే మీదుగా కలెక్టరేట్ చౌక్, రాంనగర్, మావల వరకు కొనసాగింది. అనంతరం ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఏర్పాటు చేసిన రోడ్డు భద్రత వారోత్సవాల కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడుతూ నివారణ చర్యలపై ఏర్పాటు చేసిన వీడియోను అందరికి ప్రదర్శించారు. ఆర్‌టివో అధికారులు రూపొందించిన సీడిలను, బ్యానర్లు, కరపత్రాలను ఎస్పీ చేతుల మీదుగా ఆవిష్కరించారు. కుటుంబ రక్షణ కోసం ఇంటి యజమానులు తప్పనిసరిగా హెల్మెట్ వినియోగిస్తూ తమ పిల్లలకు కూడా హెల్మెట్ వాడకంపై అవగాహన కల్పించాలని అన్నారు. రోడ్డు ప్రయాణంలో అప్రమత్తత ఎంతో అవసరమని, ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే రోడ్డు ప్రమాదాలు కూడా తగ్గించవచ్చని అన్నారు. ట్రాఫిక్ నిబంధనలపై గత కొంతకాలంగా అవగాహన కల్పిస్తున్నామని, ఇకపై కఠిన చర్యలు తీసుకోక తప్పదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ టి.పనసారెడ్డి, ఆర్‌టీవో యంఏ మోహీమీన్, యంవిఐ డి.శ్రీనివాస్, టూటౌన్ ఎస్సై జి.రాజన్న, ఆర్ ఎస్సైలు పాల్గొన్నారు.