అదిలాబాద్

ప్రజలతోనే పోలీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆసిఫాబాద్, జనవరి 19: ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకోవాలనేదే పోలీసుల ముఖ్య ఉద్దేశమని కుమ్రం భీం జిల్లా ఎస్పీ సన్‌ప్రీత్ సింగ్ అన్నారు. ఈనెల 10న పోలీసుల అధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరంలో కంటి శస్తచ్రికిత్స కోసం ఎంపికైన 16 మంది గిరిజనులను ప్రత్యేక బస్సులో మంచిర్యాల కంటి ఆసుపత్రికి తరలించారు. పోలీసుల అధ్వర్యంలో జరిగిన ఈవైద్య శిబిరంలో పెద్ద సంఖ్యలో గిరిజనులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. కంటి చూపులేమితో బాధపడుతున్న పలువురికి ఎస్పీ కంటి అద్దాలు, ఉచిత మందులు పంపిణీ చేశారు. కంటి ఆపరేషన్లు అవసరమైన వారిని ఎంపిక చేసిన పోలీసులు గురువారం ప్రత్యేక బస్సులో మంచిర్యాలకు తరలించారు. ఈసందర్భంగా ఎస్పీ సన్‌ప్రీత్ ఆపరేషన్లకు బయలు దేరిన గిరిజనులతో మాట్లాడారు. మీ కష్ట సుఖాల్లో పోలీసులు ఎల్లవేలలా అండగా ఉంటారనే భరోసా ఇచ్చారు. హెడ్ క్వార్టర్ నుండి గిరిజనులను తీసుకెల్లే బస్సుకు ఎస్పీ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం సన్‌ప్రీత్ మాట్లాడుతూ ప్రజలతో మరింత చేరువయ్యేందుకే పోలీసులు ఇలాంటి సేవా కార్యక్రమాలు విస్త్రుతం చేసినట్లు తెలిపారు. ఎలాంటి కష్టాల్లోనైనా పోలీసులు తమ వెంట ఉన్నారనే ధైర్యం ప్రజల్లో కల్పించే ప్రయత్నం చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. ప్రజల సమస్యలే తమ సమస్యలన్నారు. గిరిజనులకు కంటి ఆపరేషన్లు చేసే వివిఆర్ ఆసుపత్రి వైద్యులతో ఎస్పీ ఫోన్‌ద్వారా చర్చించారు. ఈకార్యక్రమంలో ఆసిఫాబాద్ డిఎస్పీ భాస్కర్, ఎస్‌హెచ్‌ఓ సతీష్, వామన్ అనీల్ పాల్గొన్నారు.
హరితహారం నర్సరీలపై ప్రత్యేక ప్రణాళిక
* కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

ఆదిలాబాద్, జనవరి 19: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం నర్సరీల్లో మొక్కలు ఎండిపోకుండా నీరందించడంతో పాటు వాటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని సంబంధిత అధికారులను కలెక్టర్ బుద్దప్రకాష్ జ్యోతి ఆదేశించారు. గురువారం బజార్‌హత్నూర్, బోథ్ మండలం సోనాలలో ఏర్పాటు చేసిన నర్సరీలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సంధర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు బాధ్యతలను విస్మరించకుండా మొక్కల సంరక్షణకు ముందుండి పాటుడాలని, పల్లెల్లో హరితహారం వాతావరణ సమతులత్యపై అవగాహన పెంపోందించాలన్నారు. అదే విధంగా రోడ్డుకు ఇరువైపుల మొక్కలు ఎండిపోకుండా చూడాలని, వాటి సంరక్షణతో పాటు రాబోయే వేసవిలో నీరందించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. రైతుల అవసరాల మేరకు వ్యవసాయ భూముల్లో గట్లపైనే ఉపయోగపడే మొక్కలను పెద్ద సంఖ్యలో నర్సరీల్లో పెంచాలన్నారు. నర్సరీల తీరు బాగాలేదని, నాణ్యత లోపించిందని, పనితీరు మార్చుకోవాలని సబంధిత అధికారులకు సూచించారు. రోజువారీగా నర్సరీల నిర్వహణ పనితీరును చూడాల్సిన ఉపాధి సిబ్బంది, క్షేత్రసహాయకులు, టెక్నికల్ అసిస్టెంట్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, వీరిపై వెంటనే చర్యలు తీసుకోవాలని పిడిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌డివో పిడి రాథోడ్ రాజేశ్వర్, జడ్పీ సిఈవో జితేందర్ రెడ్డి, ఏపిడి కృష్ణారావు, ఎంపిడీవో రామకృష్ణరావు, తహసీల్దార్ రాజేందర్ సింగ్, ఏపివో శివాజీ పాల్గొన్నారు.