అదిలాబాద్

స్కీం వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇచ్చోడ,జనవరి 20: ఆయా ప్రభుత్వ పథకాల్లో పనిచేస్తున్న స్కీం వర్కర్లను వెంటనే కార్మికులుగా గుర్తించడంతో పాటు వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు మల్లేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం ఇచ్చోడలలో స్కీం వర్కర్లను కార్మికులుగా గుర్తించాలనే డిమాండ్‌తో సమ్మెకు దిగిన సంధర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం, సర్వశిక్షా అభియాన్ తదితర పథకాల్లో పనిచేస్తున్న వారు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని అన్నారు. వారికి కనీస వేతనంతో పాటు పి ఎఫ్, ఈ ఎస్ ఐ సౌకర్యాలు కూడా లేవన్నారు. ఇందులో పనిచేస్తున్న వారు బడుగు బలహీన వర్గాలకు చెందిన మహిళలే అధికసంఖ్యలో ఉన్నారని, మారుమూల గ్రామాల్లో అట్టడుగు వారైన ప్రజలకు తమ సేవలందిస్తున్న స్కీం వర్కర్లు కనీస వేతనాలకు కూడా నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్థూల జాతీయోత్పత్తిలో 5 శాతం బడ్జెట్ కేటాయించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలియజేసినప్పటికీ 45వ ఇండియన్ లేబర్ కాన్ఫిరెన్స్ స్కీం వర్కర్లను కార్మికులుగా గుర్తించి, కనీస వేతనం ఇవ్వాలని, పథకాలను ప్రైవేటీకరణ చేయవద్దని సిఫారసు చేయడం జరిగిందన్నారు. కాని కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు దీన్ని పరిగణలోకి తీసుకోకుండా బడ్జెట్‌లో 90 నుండి 60 శాతానికి తగ్గించారని, స్కీంలను కార్పొరేట్, స్వచ్చంద సంస్థలకు అప్పగిస్తున్నారని విమర్శించారు. ఇలాంటి దోరణిని కేంద్ర ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని, లేని పక్షంలో ఉద్యమాలను మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్కీం వర్కర్లు గంగమ్మ, సుభాష్, భగీర్థబాయి, లస్మన్న తదితరులు పాల్గొన్నారు.
ఉద్యోగ భద్రత కల్పించాలి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదీనంలో పనిచేస్తున్న స్కీం వర్కర్లను కార్మికులుగా గుర్తించడంతో పాటు కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ఎదుట శుక్రవారం సిఐటియు అధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సంధర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షురాలు మయూరిఖాన్ మాట్లాడుతూ ప్రభుత్వ శాఖల్లో స్కీం వర్కర్లుగా పనిచేస్తున్న వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ, ఆశా, సర్వశిక్షా అభియాన్, మధ్యాహ్న భోజనం వంటి పథకాల్లో పనిచేస్తున్న వారికి ఉద్యోగ భద్రతతో పాటు పిఎఫ్, ఈ ఎస్ ఐ వంటి సౌకర్యాలు లేకపోవడంతో వారు దుర్బరమైన జీవితం గడుపుతున్నారని అన్నారు. అంతకు ముం దు 200 మంది స్కీం వర్కర్లతో ఆదిలాబాద్ బస్టాండ్ నుండి పట్టణంలోని నేతాజీచౌక్, ఎన్టీ ఆర్ చౌక్, అంబేద్కర్ చౌక్ మీదుగా కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఆదిలాబాద్ టౌన్: అంగన్వాడీలకు కనీస వేతనం రూ.18వేలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఏఐటి యుసి అధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సంధర్భంగా ఏఐటియుసి జిల్లా గౌరవ అధ్యక్షురాలు నళిని రెడ్డి మాట్లాడుతూ అంగన్వాడీల సమస్యలు పరిష్కారం కావాలంటే కేంద్రం సత్వరమే రూ.50వేలు కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రూ.18 కోట్లు విడుదల చేస్తామని కేంద్రం ప్రకటించడం సరికాదని, ఈ నిధులతో అంగన్వాడీల సమస్యలు ఏమాత్రం పరిష్కారం కావన్నారు. చాలీ చాలని వేతనాలతో పనిచేస్తున్న అంగన్వాడీలకు ఉద్యోగభద్రత కల్పించాలన్నారు. అదనంగా మరొక్క సిలిండర్‌ను పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి నాయకులు కవిత, చంద్రకళ, రాజకుమారి, రుక్మ, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.
నార్నూర్‌లో ర్యాలీ..
నార్నూర్: మండల కేంద్రంలో శుక్రవారం సిఐటియు అధ్వర్యంలో ఆశావర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు.