అదిలాబాద్

ప్రాజెక్ట్ పనులను అడ్డుకున్న నిర్వాసితులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమిని, జనవరి 21: కనె్నపల్లి మండల పరిధిలోని ముత్తపూర్ శివారులో గత 8 సంవత్సరాల క్రితం మంజూరు అయిన కృష్ణపల్లి ప్రాజెక్ట్ పనులు రాష్ట్ర విభజనలో భాగంగా అర్థతరంగా నిలిచిపోయింది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌కు కోటి 70 లక్షలు మంజూరు చేసింది. భూ నిర్వాసితులకు నష్టపరిహారం అందకపోవడంతో నిర్వాసితులు శనివారం పనులను అడ్డుకోని నిరసన తెలిపారు. రెవెన్యూ అధికారులు ముంపుభూముల సర్వేను సరిగా నిర్వహించుక పోవడంతో లబ్దిదారులకు డబ్బులు అందలేదని ఎన్నో మార్లు కార్యాలయాల చుట్టూ తిరిగి అధికారులకు విన్నవించిన చూడిచూడనట్లు వ్యవహరించారని ఈ ప్రాజెక్ట్ ముంపు లో 102,103 సర్వే నెంబర్లలో 57 ఎకరాలు ముంపుకు గురవుతుందని ఇందులో ఉన్న లబ్దిదారులందరూ ఎస్సి, ఎస్టి, బిసి లు ఉన్న భూమిని కోల్పోతుండటంతో ఎలాంటి అధారం లేకుండా ఉన్నామని నష్టపరిహారం అందించడంలో అధికారులు ఆశ్రద్దను వీడి ముంపుకు గురవుతున్న భూనిర్వాసితులందరికి అప్పటి వరకు పనులు జరగనియ్యమని వారు తెలిపారు. ప్రాజెక్ట్ పనులను అడ్డుకున్న తీరుపై బెల్లంపల్లి ఆర్డీ ఓ వీరన్నను వివరణ కోరగా ముంపు భూములను అధికారులతో కలిసి రీ సర్వే చేయించడం జరిగిందని త్వరలోనే నిర్వాసితులందరికి పరిహారం అందించేలా చర్యలు చేపట్టామని ఎవరు అందోళన చెందాల్సిన పని లేదని ఆయన తెలిపారు.

గోరక్షణ అందరి బాధ్యత
స్వామి కమలానంద భారతి
ఇచ్చోడ,జనవరి 21: అంతరించిపోతున్న గోవులను రక్షించుకునే బాధ్యత అందరిపై ఉందని స్వామి కమలానంద భారతి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని శ్రీరామ గోశాల ప్రథమ వార్షికోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మానవ జాతికి అన్ని విధాల తోడ్పాటు అందించే గోవులను అల్ కబీర్ వంటి విదేశి సంస్థలకు విక్రయిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మానవ జాతికి ప్రత్యేక్షంగా, పరోక్షంగా ఎన్నో విధాల గోవులు సహకారం అందిస్తున్నాయని, గోవుల సంతతి తగ్గినట్లయితే దాని ప్రభావం వ్యవసాయ రంగంతో పాటు మనిషి ఆరోగ్యంపై తీవ్రంగా ఉంటుందన్నారు. గోవు పాల ద్వారా ఎన్నో రోగాలు దూరం కావడమే కాకుండా వ్యాధి నిరోదక శక్తిని పెంపొందిస్తుందన్నారు. వీటి పేడ ద్వారా వ్యవసాయ భూములు సారవంతం కావడంతో పాటు పంటల దిగుబడులు కూడా గణనీయంగా పెరుగుతాయని అన్నారు. గోమూత్రాన్ని ఔషదాల్లో కూడా వాడుతున్నారని అన్నారు. బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు బయట ప్రపంచ మోజులో పడి పశు సంపదను రక్షించుకోలేక పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు కూడా గోవుల రక్షణపై దృష్టిసారించాలని ఆయన కోరారు. గోశాలలో ఉండే ఆవులను రక్షించుకోవడానికి ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి తమ సహాయ సహకారాలను అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నారాయణ మహారాజ్‌తో పాటు గోశాల సంరక్షణ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.