అదిలాబాద్

విద్యారంగ సమస్యలను పరిష్కరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్ టౌన్, జనవరి 22: విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వేణు అన్నారు. ఆదివారం ఆదిలాబాద్ పట్టణంలో ఎఐఎస్‌ఎఫ్, ఎఐవైఎఫ్ అధ్వర్యంలో బస్సుయాత్ర నిర్వహించారు. అనంతరం ఎన్టీఆర్ చౌరస్తా వద్ద ఎఐఎస్‌ఎఫ్ జెండాను రాష్ట్ర అధ్యక్షుడు ఆవిష్కరించారు. అనంతరం ర్యాలీగా అమరవీరుల స్థూపం వద్దకు వెళ్లి నివాళులర్పించిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్ల కాలం గడుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు విద్యార్థుల సమస్యలను పరిష్కరించలేదన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వసతి గృహాల్లోని విద్యార్థులు కనీస వౌలిక సదుపాయాలకు నోచుకోవడంలేదని, ప్రభుత్వ విద్యారంగం పూర్తిగా నీరుగారిపోతుందన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రైవేట్, కార్పొరేట్ సంస్థలకు వత్తాసు పలుకుతూ విద్యను ప్రైవేట్‌పరం చేస్తుందన్నారు. కనీస నిబంధనలు పాటించని పాఠశాలలు, కళాశాలలపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో పేద విద్యార్థుల నుండి అధిక ఫీజులు వసూలు చేస్తుందన్నారు. కెజిటుపిజి ఉచిత విద్య అంటూ ఎన్నికల్లో హామీలు గుప్పించిన ప్రభుత్వం ఇప్పటి వరకు ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయమన్నారు. మరోవైపు స్కాలర్‌షిప్‌లు, ఫీజురియంబర్స్‌మెంట్ రాకపోవడంతో పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారన్నారు. విద్యను వ్యాపారం చేసేందుకు ప్రభుత్వం కుట్రలు పన్నుతుందని, దీనిలో భాగంగానే ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటుకు స్థలం కేటాయించడం జరిగిందన్నారు. దీనిని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, ప్రభుత్వం రిలయన్స్ సంస్థకు కేటాయించిన భూములను వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆదిలాబాద్‌లోనే గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే ప్రభుత్వం స్కాలర్‌షిప్, ఫీజురియంబర్స్‌మెంట్ నిధులను విడుదల చేయడంతో పాటు డిఎస్సీ నోటిఫికేషన్‌ను వెంటనే విడుదల చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎఐఎస్‌ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఆర్ ఎన్.శంకర్, నాయకులు శ్రీమణ్, ప్రేమ్, ఎఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు అనిల్‌కుమార్, రాములు యాదవ్, ఎఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి మెస్రం భాస్కర్, నాయకులు సిర్ర దేవేందర్, శంకర్, రాము, నవీన్, రంజిత్, అనిల్, లక్ష్మణ్‌తో పాటు జిల్లా నాయకులు పాల్గొన్నారు.

హిందూ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాలి
* కమలానంద భారతి స్వామి
తలమడుగు, జనవరి 22: హిందూ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క హిందువుపై ఉందని, గో సంరక్షణతో పాటు దేవాలయాల ప్రాముఖ్యతను చాటిచెప్పాలని హిందూ దేవాలయాల ప్రతిష్ఠాన పీఠం పీఠాధిపతి కమలానంద భారతి స్వామిజీ అన్నారు. ఆదివారం మండలంలోని ఝరిశేకుగూడలో నిర్వహించిన విశ్వమంగళ గ్రామ దేవాలయాల సందర్శణలో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని భక్తులకు ప్రవచనలు ప్రబోదించారు. ప్రతి ఒక్క హిందూ బంధువు దేవాలయాలను సందర్శించడంతో పాటు దేవాలయాల అభివృద్దికి తమ వంతు కృషి చేయాలన్నారు. గోరక్షణ బాధ్యత ప్రతి ఒక్క హిందువుపై ఉందని, గో సంపద వల్ల మనుషులకు పరోక్షంగా ప్రత్యక్షంగా లాభాలు ఉన్నాయని అన్నారు. గోమూత్రం వలన మనుషులకు రోగాలు దరిచేరవని, గోమూత్రాన్ని ప్రస్తుతం ఔషదాల్లో సైతం వాడుతున్నారని అన్నారు. సమాజంలో యువత హిందూ సమాజాన్ని అభివృద్దిపర్చేందుకు గ్రామాల్లోని ప్రజలకు దేవాలయాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్, జిల్లా కార్యవహా రాజుల్‌వార్ దిగంబర్, ఆర్‌ఎస్‌ఎస్ మండల ప్రముఖ్ పొట్టిపెళ్ళి శ్రీనివాస్, తలమడుగు, ఇచ్చోడ మండలాల ధర్మజాగరణ ప్రముఖ్‌లు తుంగ శంకర్, బాపురావుభీంరెడ్డి, సర్పంచ్‌లు కావేరి జనక్‌పటేల్, హన్మండ్లు, నర్సింగ్, సోమ రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.