అదిలాబాద్

ముందస్తు జాగ్రత్తలతో ఆన్‌లైన్ మోసాలకు చెక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్ రూరల్, జనవరి 22: ఆన్‌లైన్ మోసాలపై వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని, పోలీసు సిబ్బంది సైతం ప్రజలను చైతన్యపర్చేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా ఎస్పీ ఎం.శ్రీనివాస్ అన్నారు. ఆదివారం క్యాంపు కార్యాలయం నుండి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి జిల్లా పోలీసు అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. ఈ సంధర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నేటి ఆధునిక ప్రపంచంలో ఆన్‌లైన్ ద్వారా జిల్లా ప్రజలు పెద్ద మొత్తంలో వస్తువుల కొనుగోళ్లు జరుపుతున్నారని, దీంతో ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేసే ప్రజల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుందన్నారు. ఆన్‌లైన్ వ్యాపారం నిర్వహించే సంస్థలు అధికమవుతున్నాయని, ఆన్‌లైన్ వ్యాపారంలో జరిగే లోపాలను సైతం అందిబుచ్చుకొని కొన్ని ముఠాలు మోసాలకు పాల్పడుతున్నారని అన్నారు. ప్రస్తుత తరుణంలో నగదు రహిత ఆర్థిక వ్యవహారాల వైపు ప్రజలు అడుగులు వేస్తున్న సమయంలో జిల్లా ప్రజలు ఆన్‌లైన్ మోసాల బారినపడకుండా జాగృతం చేయాల్సిన బాధ్యత జిల్లా పోలీసు అధికారులపై ఉందన్నారు. జిల్లా పోలీసు అధికారులకు, సిబ్బందికి సైబర్ నేరాల పరిశోధనతో పాటు సైబర్ నేరాల నిరోధన, ముందస్తు జాగ్రత్తల విషయంలో హైదరాబాద్‌లో పోలీసు రాష్ట్ర కార్యాలయంలో సత్వర శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. జిల్లా ప్రజలు తమ పిన్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఏటిఎం నెంబర్లు ఇతరులకు తెలియపర్చకుండా జాగ్రత్త వహించాలన్నారు. ఖాతాదారులు ఏటి ఎం స్వైప్ చేస్తున్న సమయంలో పిన్ నెంబర్ వ్యాపారస్తునికి చెప్పవద్దని, స్వయంగా తెలియకుండా నమోదు చేయాలని తెలిపారు. ఖాతాదారులు స్వయం జాగ్రత్తలే మన డబ్బులకు రక్షణగా భావించాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించినప్పుడే మోసాలకు గురికావడానికి ఆస్కారం ఉందన్నారు. ఫోన్‌లైనే లావాదేవీల సమాచారం ఉన్నందున ఫోన్‌లు ఇతరులకు ఇవ్వకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు గ్రామ స్థాయిలో సభలు నిర్వహించి వినియోగదారులకు చైతన్యపర్చాలన్నారు. ప్రజా సభలో మాట్లాడే అవకాశం ఉన్నప్పుడు ఆన్‌లైన్ మోసాలపై ప్రజలకు వివరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఇన్స్‌పెక్టర్ బి.ప్రవీణ్, ఎస్సైలు అన్వర్ ఉల్ హఖ్, జి.రామన్న, హెడ్‌కానిస్టేబుల్ ఎస్.ప్రేంసింగ్, సిసి ఎం పోతరాజు తదితరులు పాల్గొన్నారు.

భంజర భూముల్లో పండ్ల సాగు
కుభీర్, జనవరి 8: దశాబ్దాల కాలంగా సాగుకునోచుకోని బంజరుభూముల్లో పండ్ల తోటల సాగుతో సత్ఫలితాలు సాధిస్తున్నాడు నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని సిరిపెల్లి గ్రామానికి చెందిన రైతు దేవరాజ్‌పాటిల్. తన వ్యవసాయభూమిలో అధికశాతం బంజరు నేలే. అయినప్పటికీ బిందుసేద్యం పద్దతిలో తెలంగాణ యాపిల్ (యాపిల్ బేర్) మామిడి రకాలు, జామ, హైబ్రీడ్ సీతాఫలం, రామఫలం అంజీర్, సపోట, బొప్పాయి, 20రకాల కొబ్బరి, బత్తాయి తదితర పండ్లతోటలువేసి అంతరపంటగా ఇతర పంటలు సాగుచేస్తూ లాభాలు గడిస్తున్నాడు. మూడేళ్లుగా రైతు దేవరాజ్‌పాటిల్ పండ్లతోటల సాగు మొదటుపెట్టగా తెలంగాణ బేర్‌గా సుప్రసిద్దమైన నేరెడి రకం ఇక్కడి వ్యవసాయ క్షేత్రంలో ప్రత్యేక ఆకర్షణగా ఉంది. రుచి సైతం పేరుకుతగ్గట్టు ఉండడంతో అనేక గ్రామాల రైతులు సిరిపెల్లి పండ్లతోటలను సందర్శించి, ఇతర చోట్ల సాగుకు ఆసక్తి చూపుతున్నారు. ఎందుకు పనికిరాని బంజరు నేలలో పండ్లతోటల పెంపకాన్ని దిగ్విజయంగా సాగుచేస్తూ సత్ఫలితాలు పొందుతున్న సదరు రైతు సహచర రైతులకు ఆదర్శంగా నిలిచాడు.
సేంద్రియ సాగుతో సస్యరక్షణ
సిరిపెల్లి పండ్లతోట సాగుతో మొదటి నుండి సేంద్రి య ఎరువులను మాత్రమే వాడుతున్నామని రైతు దేవరాజ్‌పాటిల్ పేర్కొన్నారు. పేడ, వ్యవసాయ వ్యర్థాలు, మట్టి, శెనగపిండి, బెల్లం మిశ్రమాలతో సేంద్రియ ఎరువులు, ఆవు పంచకంలో ఆముదం, ఆకుల మిశ్రమం తో కీటకనాశిని ఔషదాలను సిద్దంచేసి పిచికారి చేస్తూ సస్యరక్షణ చర్యలు చేపడుతున్నామని అన్నారు. దీంతో రసాయన క్రిమిసంహారక మందుల అవశేషాలు లేకుండా సహజసిద్దమైన పండ్లను ఉత్పత్తి చేస్తున్నట్లు సదరు రైతు దేవరాజ్‌పాటిల్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే, ప్రభుత్వం మార్కెటింగ్ సదుపాయాలు కల్పిస్తే రైతులకు మరింత అనువుగా ఉంటుందని ఆయన కోరారు.