అదిలాబాద్

ప్రజాసమస్యలపై తక్షణమే స్పందించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆసిఫాబాద్, జనవరి 23 ప్రజాసమస్యల పరిష్కారంలో ఎలాంటి అలసత్వం వహించ కూడదని కుమ్రం భీం జిల్లా కలెక్టర్ చంపాలాల్ సూచించారు. ప్రజాఫిర్యాదుల విభాగాన్ని పురస్కరించుకొని సోమవారం కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ సెల్‌లో పాల్గొని ఆయన జిల్లా నలుమూలల నుండి వచ్చిన వారి నుండి అర్జీలు స్వీకరించారు. వారి సమస్యలను ఓపికతో విన్న కలెక్టర్ వీలైనంత త్వరగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులకు సూచించారు. నక్సలైట్ చేతిలో మృతి చెందిన కుటుంబానికి చెందిన పెద్దకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించాలని లింగాపూర్ మండలం లొద్దిగుడకు చెందిన రవీందర్ కోరారు. కెరమెరి మండలం కేస్లాగుడకు చెందిన ఆత్రం యశ్వంత్‌రావుతన సాగుభూమికి త్రీఫేస్ విద్యుత్ సౌకర్యం కల్పించాలన్నారు. కుమ్రం భీం ప్రాజెక్టు నిర్మాణంలో ముంపుకు గురైన తన భూమికి సంభందించిన నష్టపరిహారం చెల్లించాలని ఆసిఫాబాద్ మండలంలోని మాణిక్‌గుడ, అడ గ్రామస్థులు కలెక్టర్‌కు వినతి పత్రం అంద చేశారు. దళిత బస్తీకింద మూడెకరాల భూమి ఇవ్వాలని కోరుతూ కెరమెరి మండలం గోయగాంకు చెందిన గ్రామస్థులు ప్రజాఫిర్యాదుల విభాగంలో దరఖాస్తు చేసుకున్నారు. జనకాపూర్‌కు చెందిన ఆయిల శారద ఉండేందుకు ఇంటిస్థలం ఇప్పించాలని కోరారు. బంబారకు చెందిన వడాయి హనుమంతు అనే వృధ్దుడు పింఛను కోసం కలెక్టర్‌ను కలిశారు. ఈసందర్భంగా జిల్లా నలుమూలల నుండి 200పైగా దరఖాస్తులు ప్రజాఫిర్యాదుల విభాగానికి వచ్చాయి. ఈగ్రీవెన్స్‌సెల్‌లో జిల్లా ట్రాన్స్‌పోర్టు అధికారి శ్యాంనాయక్, ముఖ్యప్రణాళికా అధికారి కృష్ణయ్య, జిల్లా విధ్యాధికారి రఫీక్, స్ర్తి శిశుసంక్షేమాధికారి సావిత్రి, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

బాధిత హోంగార్డు కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత
ఆదిలాబాద్ రూరల్,జనవరి 23: గత ఏడాది డిసెంబర్ 20వ తేదీన కుటుంబ కలహాలతో మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్న దారట్ల శ్రీకాంత్ కుటుంబ సభ్యులకు జిల్లా ఎస్పీ ఎం.శ్రీనివాస్ రూ.98వేల విలువగల చెక్కును అందజేశారు. శ్రీకాంత్ కుటుంబంలోని వృద్ద తల్లిదండ్రులను ఆదుకోవాలనే ఉద్దేశంతో జిల్లా హోంగార్డులు ఒక రోజు వేతనాన్ని విరాళంగా ఇవ్వాలని ఎస్పీ సూచించగా, హోంగార్డుల యూనిట్ సభ్యులు సి.లక్ష్మణ్, హైదరఖాన్, భూమన్న, సలీం, సభావత్ హుస్సేన్‌లు హోంగార్డులతో చర్చించి 245 హోంగార్డుల ఒక రోజు వేతనం కింద రూ.98వేలు సమకూర్చడం జరిగిందన్నారు. ఈ సంధర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా హోంగార్డుల్లో ఐక్యమత్యం ఉందని, సహా ఉద్యోగి మరణించడంతో ఆదుకోవాలనే సంకల్పం కల్గినందుకు వారిని అభినందిస్తున్నట్లు తెలిపారు. శ్రీకాంత్ కుటుంబాన్ని ప్రభుత్వపరంగా అన్ని విధాల ఆదుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐబి జెమ్స్, ఆర్ ఎస్సై బి.పెద్దయ్య, కార్యాలయం అధికారులు యం డి అయ్యూబ్, హైదర్‌ఖాన్, సి.లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.