అదిలాబాద్

జిల్లా అభివృద్ధికి అందరి సహకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచిర్యాల, జనవరి 26: ప్రభుత్వం అందించే ప్రతి సంక్షేమ అభివృద్ధి ఫలాలను పేద వారికి అందాలంటే ప్రజా ప్రతినిధులు, అధికారుల సహాకారంతోనే జిల్లాను అన్నిరంగాలలో అభివృద్ది పథంలో ముందుకు తీసుకెళ్లడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కర్ణన్ అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా గురువారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన పరేడ్‌గ్రౌండ్‌లో జాతీయ పతకాన్ని అవిష్కరించి పోలీసులనుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతు ప్రజా ప్రతినిధుల సహాకారంతో జిల్లాను అభివృద్ధిపథంలో నడిపిస్తానన్నారు. జిల్లాలో ఉన్న సహజ వనరులు ప్రభుత్వ నిధులను సద్వినియోగం చేసుకోని ప్రతిపేద వానికి అభివృద్ధి ఫలాలను అందేలా చూడాలన్నారు. జిల్లాలోని బీడు భూములను సస్యశామాలంగా చేయుటకు భారీ, మధ్యతరహా, చిన్న తరహా నీటిపారుదల వనరుల ద్వారా లక్షా 65 వేల 387 ఎకరాలకు సాగు నీరు అందిస్తున్నామని తెలిపారు. అంబేద్కర్ ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్ట్ ద్వారా కనె్నపల్లి, నెనె్నల, వేమనపల్లి మండలాల్లో 20500 ఎకరాలకు సాగు నీరు అందించడానికి సన్నాహాలు జరుగుతున్నాయని తెలిపారు. మిషన్ కాకతీయ మొదటి , రెండో దశలో 96 కోట్ల 18 లక్షల వ్యయంతో 304 చెరువులను పునరుద్దరణ పనులు చేపట్టగా 46కోట్ల 67లక్షల వ్యయంతో 203 చెరువుల పునరుద్ధరణ పూర్తి చేసి 19865 ఎకరాలను స్థిరికరించడం జరిగిందని తెలిపారు. మూడో దశ మిషన్ కాకతీయ ద్వారా జిల్లాలో 48 కోట్ల రూపాయలతో 147 చెరువులను పునరుద్దరించుటకు ప్రతిపాదనలు సిద్దం చేసామన్నారు. అదేవిధంగా ఉపాధి హామీ పథకం కింద జిల్లాలో 1,20,578 జాబ్ కార్డులు జారీ చేయగా ఈ ఆర్థిక సంవత్సరంలో 65,320 కుటుంబాలకు 48.56 లక్షలు కూలీ వేతనం చెల్లించడం జరిగిందన్నారు. స్వచ్ఛ భారత్ నిర్మాణంలో భాగంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంతాలలో 4574 మరుగు దొడ్లు పట్టణ ప్రాంతంలో 5154 మరుగుదొడ్లు నిర్మించడం జరిగిందని తెలిపారు. మిషన్ భగీరథ ద్వారా జిల్లాలోని మూడు మున్సిపాలిటీతో పాటు 18 మండలాలలోని గ్రామాలకు శ్రీపాద ఎల్లంపల్లి, నిర్మల్ జిల్లాలోని కడెం, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని అడ జలశయాల ద్వారా 2018లోగా నల్ల ద్వారా శుద్ధి నీరు అందించేందుకు పనులు జరుగుతున్నాయని తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సాధరణ సేవలతో పాటు ప్రత్యేక వైద్య నిపుణులచే అత్యవసర ప్రసూతి శస్త్ర చికిత్సలు చేయడంతో పాటు ఇండియన్ రెడ్ క్రాస్ సోసైటీ ద్వారా 460 మంది తలసేమియా వ్యాధి గ్రస్తులకు రక్త మార్పిడి చేయడం జరుగుతుందని, రైతులకు 9గంటల విద్యుత్‌ను సామర్థ్యంగా అందిస్తున్నామన్నారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించడానికి త్రి ఆర్స్ కార్యక్రమం, డిజిటల్ తరగతుల నిర్వాహాణ పదోవ ఉత్తమ ఫలితాల సాదనకు ప్రత్యేక తరగతులు, హాస్టల్‌లో సన్నబియ్యం, సాక్షర భారతి, అంగన్‌వాడి, అమ్మనాన్నకు చదువు అనే కార్యక్రమాలు అమలు చేయడం జరుగుతుంది. అదే విధంగా ఎస్సి, ఎస్టి, బిసి సంక్షేమ వసతి గృహాలలో 7979 మంది విద్యార్థిని, విద్యార్థులకు సాంఘీక, సంక్షేమ గురుకుల విద్యా సంస్థలలో చదువుతున్న 3210మంది హైస్కూల్, ఇంటర్మీడియేట్, డిగ్రీ విద్యార్థిని, విద్యార్థులకు ఉచిత విద్యతో పాటు భోజన వసతి కూడా కల్పించడంజరుగుతుందన్నారు. పరిశ్రమల శాఖ ద్వారా 3.89 లక్షల వ్యయంతో 51 మందికి ఉపాధి కల్పిస్తున్నామని తెలిపారు. 44 శాతం అడవుల గల జిల్లా దట్టమైన అడవులు, కవ్వాల్ పులుల అభయా అరణ్యం, శివారం మొసళ్ల సంరక్షణ కేంద్రం, ప్రాణహిత చుక్క జింక్కల సంరక్షణ కేంద్రం, తదితర అన్నింటిని సంరక్షిస్తు మొక్కల పెంపకాన్నిచేపట్టడం జరుగుతుందన్నారు. ప్రతి గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించేందుకు జిల్లాలో 4.16 కోట్ల వ్యయంతో 289 కిలో మీటర్ల రహాదారుల అభివృద్ది, నదులు, వాగులపై వంతెనల నిర్మాణాలకు ,తదితర 68 పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. అదే విధంగా, పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ది, మెప్మాతో పాటు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను డిజిటల్ లావాదేవీలు చేపట్టడం జరుగుతుందన్నారు. వివిధ ప్రభుత్వ శాఖాలచే 25శకటాలను ప్రదర్శించారు. పాఠశాల విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఉత్తమ సేవలు అందించిన అధికారులకు, సిబ్బంది ప్రశంసా పత్రాలను అందించారు. వివిధ ప్రభుత్వ శాఖాలచే ఏర్పాటు చేసిన స్టాల్‌లను సందర్శించారు. ఉత్తమ శకటంగా జిల్లా మొదటి బహుమతి సంక్షేమ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, రెండో బహుమతి విద్యాశాఖ, మూడో బహుమతి అటవీ శాఖ, ప్రత్యేక బహుమతిగా సింగరేణి శకటం ఎంపికయ్యాయి. విద్యార్థులు ప్రదర్శించిన సంస్కృతిక కార్యక్రమాలలో మొదటి బహుమతి జడ్పీఎస్ సబ్బపల్లి, రెండో బహుమతి తెలంగాణ మైనార్టీ రెసిడెన్సియల్ స్కూల్, మూడోబహుమతి జిల్లాపరిషత్ బాలుర పాఠశాల, మంచిర్యాల ప్రత్యేక బహుమతిగా సాయి అంధుల విద్యార్థులకు ఎంపిక చేసి అతిథుల చేతులమీదుగా బహుమతులను అందజేసారు. స్వాతంత్య్ర సమరయోధులైన రేగళ్ల లక్ష్మణ్ రావు, మోటూరి నారాయణ, సువ్వబాయిలను కలెక్టర్, జాయింట్ కలెక్టర్ సుధాకర్ రావు, డిసిపి జాన్‌వెస్లీ, ఎమ్మెల్యేలు దివాకర్‌రావు, చిన్నయ్యలు సన్మానించారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి నిజాం ఉద్దీన్, డిఆర్‌వో వీరబ్రహ్మయ్య, ఎల్లంపల్లి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ప్రియాంక, ఆర్డీవో ప్రతాప్‌కుమార్, వీరన్న, మున్సిపల్ చైర్‌పర్సన్ వసుంధర, జడ్పీటిసి ఆశాలత, ఎంపిపి బేర సత్యనారాయణ, వివిధ శాఖాల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.