అదిలాబాద్

కాంట్రాక్ట్ కార్మికులకు పెండింగ్ వేతనాలను చెల్లించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీరాంపూర్ రూరల్, ఫిబ్రవరి 15: సింగరేణిలో దశబ్దాల కాలంగా పని చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం అమలు చేయడంలో యజమాన్యం విఫలమైందని పెండింగ్‌లో ఉన్న వేతనాలను తక్షిణమే చెల్లించాలని సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాద్యక్షులు డి బ్రహ్మనందం డిమాండ్ చేసారు. బుధవారం ఆయన మాట్లాడుతూ సింగరేణిలో పర్మినెంట్ కార్మికులతో పాటుగా కాంట్రాక్ట్ కార్మికులు విధులు నిర్వహిస్తున్నారని ఫారెస్ట్ విభాగం విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు ప్రతి నెల 1 నుంచి 10వ తేదీలోగా చెల్లించాల్సిన వేతన సర్క్యులర్‌ను సింగరేణి యజమాన్యం తుంగలో తొక్కిందన్నారు. కాంట్రాక్ట్ కార్మికులకు రెండు, మూడు నెలల నుంచి వేతనాలు చెల్లించకుండా కార్మికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రతి నెల వేతనాలు అందకపోవడంతో నిత్యావసర సరుకులు కిరాణ, రేషన్ షాప్, స్కూల్ ఫీజులు కట్టలేని పరిస్థితులు నెలకొన్నయన్నారు. నవజీవన్ పార్కు, జీ ఎం ఆఫీస్, పీ ఓ ఆఫీస్, చైతన్య పార్కు, బంగ్లాస్ ఏరియా, నందనవనంపార్కులలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు మూడు నెలల వేతనం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేసారు. లేని పక్షంలో కాంట్రాక్ట్ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో అందోళన కార్యక్రమాలు చేపడుతామన్నారు.

సేవాలాల్ జయంతి సందర్భంగా 20న సెలవు

ఆదిలాబాద్, ఫిబ్రవరి 15: బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ 278వ జయంతిని పురస్కరించుకొని ఈనెల 20న ఆధికారికంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఆ రోజు ప్రభుత్వ సంస్థలు, పాఠశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ బుద్ద ప్రకాష్ జ్యోతి తెలిపారు. ఈమేరకు బుధవారం కలెక్టర్ సమావేశ మందిరంలో సేవాలాల్ జయంతి వేడుకలపై సమీక్ష ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్‌లోని రాంలీలా మైదానంలో సంత్ సేవాలాల్ జయంతి వేడుకలు ఉంటాయని, వివిధ ప్రాంతాల నుండి వచ్చే భక్తుల కోసం తాగునీరు, భోజన వసతి కల్పించడం జరుగుతుందన్నారు. బోథ్, ఆదిలాబాద్ నియోజకవర్గాల నుండి తరలివచ్చే ప్రజల కోసం అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు సైతం ఆరోజు సెలవు ఉంటుందని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో డి ఆర్‌వో శంకర్, ట్రైబల్ వెల్ఫేర్ డిడి రాంమూర్తి, ఉట్నూరు ఏపివో నాగోరావు, డి ఆర్‌డివో పిడి రాజేశ్వర్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.

క్లూస్‌టీమ్‌ను ప్రారంభించిన ఎస్పీ
నిర్మల్, ఫిబ్రవరి 15: నిర్మల్ జిల్లాకు నూతనంగా వచ్చిన క్లూజ్‌టీమ్‌ను బుధవారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ క్లూజ్‌టీమ్ ద్వారా ఎక్కడైన నేరాలు జరిగిన ప్రాంతంలో వెంటనే వేలుముద్రలు సేకరించి నేరస్థులను పట్టుకునే అవకాశం ఉంటుందన్నారు. నేరాలు ఎలా జరిగాయి, ఎవరు చేశారని అనే విషయం క్లూజ్‌టీమ్ వల్ల తొందరగా తేలే అవకాశముందన్నారు. ఈ కార్యక్రమంలో డి ఎస్పీ మనోహర్‌రెడ్డి, డిసి ఆర్‌బి సి ఐ బాలరాజు, పట్టణ సి ఐ జీవన్‌రెడ్డి, ముధోల్ సి ఐ రఘుపతి, ఎస్‌బి ఎస్ ఐ ఎం ఎ కరీం, తదితరులు పాల్గొన్నారు.

సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే
ఉట్నూరు, ఫిబ్రవరి 15: బంజారాల ఆది గురువు సంత్ సేవాలాల్ జయంతి వేడుకలు బుధవారం గ్రామ గ్రామాన ఘనంగా జరిగాయి. ఏజెన్సీ ప్రాంతంలోని లంబాడా గ్రామాల్లో ప్రత్యేకంగా లంబాడా గిరిజనులు పూజలు నిర్వహించారు. స్థానిక పట్టణంలో అధికారికంగా జయంతి వేడుకలు నిర్వహించగా, ఎమ్మెల్యే రేఖానాయక్, ఎంపిపి విమల రాథోడ్, జడ్పీటీసీ జగజీవన్, పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ సంధర్భంగా ధర్మధ్వజాన్ని ఎగరవేసి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే రేఖానాయక్ మాట్లాడుతూ సమైక్యాంధ్ర పాలనలో రాష్ట్రంలోని అన్ని పండగలను విస్మరించి, తీవ్ర అన్యాయం చేశారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కెసి ఆర్ నాయకత్వంలో కుల మతాలకు అతీతంగా అన్ని పండలకు సమ ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వ పరంగా ఘనంగా నిర్వహిస్తుందన్నారు. ముఖ్యంగా సేవాలాల్ జయంతి, కుమురంభీం వర్ధంతి, నాగోబా జాతర, బోనాల పండగ, బతుకమ్మ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని అధికారికంగా నిర్వహిస్తుందన్నారు. ప్రత్యేక రాష్ట్రంలో ప్రజలు సుఖసంతోషాలతో ఉన్నారని, ప్రభుత్వ పథకాల పట్ల సంతృప్తిగా ఉన్నారని అన్నారు. బంగారు తెలంగాణకు బాటలు వేయడానికి ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ ముందుకు వెళ్తున్నామని అన్నారు. ప్రజలందరూ కలిసి వస్తే మున్ముందు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రత్యేక కార్యక్రమాల ద్వారా సంక్షేమ అభివృద్ది ఫలాలను అందిస్తామని అన్నారు. అనంతరం పలువురు వక్తలు సేవాలాల్ మహారాజ్ సేవలపై తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో విద్యాసాగర్, డిడి రాంమూర్తి, ఏపివో జనరల్ నాగోరావు, బంజార నాయకులు గంగారాం నాయక్‌తో పాటు సర్పంచ్‌లు బొంత అశారెడ్డి, మర్సుకోల తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

బాసరలో భక్తజన సందోహం
బాసర, ఫిబ్రవరి 15: బాసర అమ్మవారి సన్నిధిలో బుధవారం భక్తజన సందోహం నెలకొంది. సరస్వతి దేవి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఉదయం 11 గంటల వరకు ముహూర్త వరం ఉండడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. ఉదయం నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు అక్షరాభ్యాస క్యూలైన్, దర్శన క్యూలైన్ భక్తులతో కిటకిటలాడాయి. అక్షరస్వీకార పూజలకు ఒక్కోబ్యాచ్‌కు 2 గంటల సమయం పట్టడంతో క్యూలైన్‌లో భక్తులు, చిన్నారులు ఇబ్బందులకు గురయ్యారు. బుధవారం ఒక్కరోజే అమ్మవారి సన్నిధిలో 1110 మంది చిన్నారులకు ఆలయ అర్చకులు అక్షరాభ్యాస పూజలు జరిపించారు. అక్షరాభ్యాస పూజలు, లడ్డూ ప్రసాదాల విక్రయాల ద్వారా ఆలయానికి రూ. 7 లక్షల వరకు ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు.
ఆలయంలో ప్రముఖుల పూజలు.....
బాసర అమ్మవారి సన్నిధిలో బుధవారం అభిషేక సేవలో జిల్లా ఫ్యామిలీ కోర్డు జడ్జి అరుణసారిక పాల్గొని ప్రత్యేక పూజలుచేశారు. ఆలయానికి చేరుకున్న వీరిని అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి సన్నిధిలో ప్రత్యేకంగా కుంకుమార్చన పూజలు జరిపించి ఆశీర్వదించారు. ఆలయ ఈవొ ఎం.వెంకటేశ్వర్లు న్యాయమూర్తిని సత్కరించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. మంచిర్యాల జాయింట్ కలెక్టర్ సుధాకర్‌రావు సరస్వతి దేవిని దర్శించుకుని పూజలుచేశారు. ఆలయం తరపున ఆలయ సూపరిండెంట్ సాయిలు గిరిధర్ శాలువతో సత్కరించి అమ్మవారి ప్రసాదాలను అందజేశారు.

వారసత్వ ఉద్యోగాలు సాధించి తీరుతాం
* దరఖాస్తు చేసుకున్న ప్రతి కార్మికునికి వారసత్వం కల్పిస్తాం
* టిబిజికెఎస్ అధ్యక్షుడు వెంకటరావు
శ్రీరాంపూర్ రూరల్, ఫిబ్రవరి 15: సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలను ఖచ్చితంగా సాధించితీరుతామని టిబిజికెఎస్ రాష్ట్ర అధ్యక్షులు బి వెంకటరావు ధీమా వ్యక్తం చేశారు. బుధవారం శ్రీరాంపూర్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్లు సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణి పిల్లలకు రాజ్యాంగం కల్పించిన హక్కులలో భాగంగా వారసత్వ ఉద్యోగాలను నిలుపుదల చేయాలని నిరుద్యోగి అయిన సతీష్ హైకోర్టుకు వెళ్లి ప్లింగ్ వేసిన వెంటనే టిబిజికే ఎస్ గుర్తింపు కార్మిక సంఘంగా మొట్ట మొదటి సారిగా హైకోర్టులో ఇంప్లిడ్ వేసామని అనంతరం ఇతర కార్మిక సంఘాలు ఇంప్లిడ్ అయ్యాయన్నారు. సర్క్యులర్ ప్రకారం జనవరి 1నుంచి మార్చి 31 వరకు దరఖాస్తు చేసుకున్న ప్రతి కార్మికునికి వారసత్వ ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఏప్రిల్ మొదటి వారంలో వారసత్వం ప్రక్రియ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. కొడుకు అండర్‌గ్రౌండ్ ఫిట్ అయిన వెంటనే తండ్రిని అన్‌ఫిట్ చేసి పంపించడం జరుగుతుందని పేర్కొన్నారు. వారసత్వంపై హైకోర్టులో కేసుపై కార్మికులు ఆధైర్య పడాల్సిన అవసరం లేదని, కొన్ని కార్మిక సంఘాలు పని కట్టుకోని టి బిజికే ఎస్‌పై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ఈ విధానాన్ని మానుకోవాలన్నారు. మెడికల్ అన్‌ఫిట్‌లో పైరవీలు, దొంగ సర్ట్ఫికేట్స్ సృష్టించి పబ్బాం గడుపుకున్న కార్మిక సంఘాలు టిబిజికే ఎస్‌ను విమర్శించే అర్హత లేదన్నారు. త్వరలోనే నిజానిజాలు బయటపెడతామన్నారు. నిరాధారణమైన విమర్శలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. గుర్తింపు కార్మిక సంఘం కాల పరిమితి ముగిసినందున కార్మికుల సభ్యత్వ రుసుం నిలుపుదల చేయాలి అన్నడం విడ్డురం అన్నారు. ఏ ఐ టియూసి గుర్తింపు సంఘంగా ఉన్నప్పుడే హైకోర్టు నుంచి ఎన్నికలు నిర్వహించేంత వరకు సభ్యత్వ రుసుం చెల్లించేలా సర్క్యులర్ తీసుకోచ్చారని పేర్కొన్నారు. మెడికల్ అన్‌ఫిట్, డెత్ కేసులలో వయో పరిమితిని సడలించేందుకు యజమాన్యంతో చర్చిస్తామన్నారు. సింగరేణిలో ట్రైపార్టేడ్, స్ట్రెర్చర్, జేసిసి సమావేశాలు నిర్వహించాలని అన్నారు. ఈసమావేశంలో టిబిజికే ఎస్ కేంద్ర నాయకులు ఏనుగు రవీందర్ రెడ్డి, బంటు సారయ్య, రాఘవ రెడ్డి, ఎన్నికల కమిటీ సభ్యులు బండి రమేష్, అమృత రావు, లెక్కల విజయ్, నీలం సదయ్య, గణపతి రెడ్డి, అన్ని గనుల ఫిట్ కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.

వర్షం తాకిడికి పాడవుతున్న చికిలి ప్రాజెక్టు ప్రధాన కాల్వ
* మూడవ విడత మిషన్ కాకతీయలో చేర్చి పనులు చేయాలని రైతుల డిమాండ్
* ప్రతి ఏడు వృధాగా పోతున్న నీరు,* లబోదిబో మంటున్న రైతులు
వాంకిడి, ఫిబ్రవరి 15: మండలంలో ప్రతి సంవత్సరం కురిసే భారీ వర్షాల తాకిడికి వాంకిడి మండలంలోని చికిలి ప్రాజెక్టు ప్రధాన కాల్వ ప్రతి సారి పాడవుతుంది.దీంతో ఆయకట్టు రైతులకు రభి పంటలకు నీరందక రైతులు లబోదిబోమంటున్నారు.అయినా అధికారులు ఈ విషయాన్ని పట్టించుకోవడంలేదని వాపోతున్నారు. ఈ ప్రాజెక్టు ప్రధాన కాల్వను సిసితో నిర్మించాలని మండల రైతులు కోరుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదని వారంటున్నారు.చెరువు నీటిని నమ్ముకొని పొలాలను చదను చేయించుకొన్నా నీరు అందకపోవడంతో లాభం లేకపోయిందని పేర్కొంటున్నారు. కాల్వలు సరిగ్గా లేకపోవడంతో ప్రాజెక్టు నీరు పూర్తిగా పక్కనే గల ఓర్రేలోకి చేరి వృధాగా పోతున్నాయని వారంటున్నారు.గత సంవత్సరం ఈ కాల్వ నుండి వచ్చే నీటి ద్వారా జొన్న,మొక్కజొన్న పంటలతోపాటు ఇతర కూరగాయల పంటలు పండించినట్లు పేర్కొంటున్నారు.అయితే ప్రధాన కాల్వకు తరుచు గండి పడుతుండంతో ఈ సంవత్సరం నీరందదని పంటలు వేయడానికి సాహాసం చేయడంలేదని వారంటున్నారు. చెరువులో పుష్కలంగా నీరున్నా పంటలకు పెట్టుకోలేని పరిస్ధితి మాదని వారు లబొదిబొమంటున్నారు. ప్రతి ఏడు మండలంలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టు ప్రధాన కాల్వలో భారీగా నీరు చేరి కాల్వపై నిర్మించిన కాజ్‌వే వద్ద కాల్వ తెగిపోతుందని,దాన్ని మరమ్మత్తులు చేసినా ఆగడంలేదని, పత్తికి మందు కొట్టుకోవాలన్నా ఎడ్ల బండ్లపై నీటిని తెచ్చుకొని పైమందులు కొట్టుకోవలసి వస్తుందని వారంటున్నారు. ప్రధాన కాల్వను సిసితో నిర్మిస్తే ఆయకట్టు చివరి వరకు నీరు పారుతుందని, అయితే ప్రధాన కాల్వ మట్టితోనే నిర్మించి ఉండడంతో కాల్వ దెబ్బతిని ప్రధాన కాల్వలో నీరు రావడం లేదని ఆయకట్టు రైతులు వాపోతున్నారు. గత సంవత్సరం ఈ గండిని అధికారులెవరూ పూడ్చకపోవడంతోపాటు ఇటువైపు తొంగిచూసిన వారెవరూ లేకపోవడంతో ఈ కాల్వ కిందున్న ఆయకట్టు రైతులే తలా వెయ్యి రూపాయలు చందావేసుకొని కాల్వ గండిని పూడ్చడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ సమస్య కొలిక్కిరాలేదని, ఈ విషయాన్ని మైనర్ ఇరిగేషన్ అధికారులకు చెప్పడానికి అసిఫాబాద్‌లో కార్యాలయానికి వెళ్ళగా అధికారులు ఎవరూ అందుబాట్లో లేకపోవడంతో ఈ సమస్యను స్ధానిక అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళినట్లు ఆయకట్టు గ్రామాల రైతులు తెలిపారు. ఇప్పటికైనా మైనర్ ఇరిగేషన్ ఉన్నత అధికారులు స్పందించి వాంకిడి మండలంలోని చికిలి ప్రాజెక్టుకు గల ప్రధాన కాల్వను సిసితో నిర్మిస్తే వందలాది మంది రైతులకు నీరందుతుందని దీంతో పంటలు సైతం పండించగలుగుతామని వారంటున్నారు.

సేవాలాల్ సూచించిన మార్గంలో ప్రతి ఒక్కరు నడవాలి
* లంబాడా సంస్కృతి, సంప్రదాయాలు పరిరక్షించాలి
ఆసిఫాబాద్, ఫిబ్రవరి 15: సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ చూపిన మార్గంలో ప్రతి ఒక్కరు నడుచుకోవాలని కుమ్రం భీం జిల్లా కలెక్టర్ చంపాలాల్ సూచించారు. ఎంతో పురాతనమైన లంబాడా సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు తోడ్పడాలని ఆయన ఈసందర్భంగా పిలుపునిచ్చారు. సంత్ సేవాలాల్ మహారాజ్ 278వ జయంతి వేడుకలను పురస్కరించుకొని జిల్లాకేంద్రంలోని పరేడ్ క్రీడామైదానంలో బుధవారం నిర్వహించిన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మహనీయుల మార్గంలో వెడితే భావితరాల భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందన్నారు. సేవాభావంతో చరిత్రలో చిరస్థాయిగా నిలిచి పోతామని పేర్కొన్నారు. నేటి ఆధునిక యుగంలో ఘనమైన లంబాడా సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత కులస్థులపై ఉందని కలెక్టర్ సూచించారు. జిల్లా ఏర్పాటు తరువాత మొదటి సారిగా ప్రభుత్వ పరంగా ఈ వేడుకలు నిర్వహించుకోవడం సంతోషకరమన్నారు. గతంలో సేవాలాల్ జయంతి ఉత్సవాలు ఇప్పుటు పట్టణ కేంద్రాల్లో జరుపుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు. సద్గురు సంత్ సేవాలాల్ మహరాజ్, హతిరాంబాబాలు బంజారా జాతిలో ఆణిముత్యాలని ఆయన కొనియాడారు. జీవితంలో ప్రతి ఒక్కరి ఆధ్యాత్మిక చింతన అవసరమనే సత్యాన్ని ఈమహానుభావులు మనకు భోదించారని, వీటిన తూచ తప్పకుండా ఆచరించి తోటి మనిషి పట్ల ప్రేమానురాగాలతో వ్యవహరించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
అన్నివర్గాల అభివృద్ధికి పెద్దపీట: ఎమ్మెల్యే కోవ లక్ష్మి
రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడేండ్ల పాలనలో అన్ని వర్గాల అభివృధ్దికి పెద్దపీట వేస్తున్న విషయాన్ని ఎమ్మెల్యే కోవలక్ష్మి గుర్తు చేశారు. సేవాలాల్ జయంతి వేడుకలను పురస్కరించుకొని పరేడ్ మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. అన్ని కులాల పండగలకు ముఖ్యమంత్రి కేసీ ఆర్ ఎనలేని ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. ఆదివాసీ, గిరిజన సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. గిరిజన ఆరాధ్యదైవం కొలువుదీరిన శంకర్‌లొద్ది పుణ్యక్షేత్రానికి వచ్చే ఏడాదిలోగా రోడ్డు సౌకర్యం కల్పిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. జిల్లాకేంద్రంలో బంజారాభవన్ నిర్మాణం కోసం ప్రభుత్వ నిధులు మంజూరు చేసిందని, ఇందుకు అవసరమైన స్థలాన్ని త్వరలోనే గుర్తిస్తామని ఆమె తెలిపారు.వచ్చే జయంతి ఉత్సవాల లోగా సేవలాల్ మహరాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని కోవ లక్ష్మి అన్నారు. బంజారా గురువు ప్రేంసింగ్ మహరాజ్ మాట్లాడుతూ సంత్ సేవాలాల్ మహరాజ్ ఉత్సవాలను కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు జరుపుకోవడం సంతోష కరమన్నారు. ఈసందర్భంగా కలెక్టర్, ఎమ్మెల్యేలు సేవాలాల్ మహరాజ్ భక్తిపాటల సిడిని ఆవిష్కరించారు. బంజారాలు సన్మార్గంలో నడిచి సంస్కృతి, సంప్రదాయాలను కాపాడాలని ఆయన పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో మాజీ ఎంపి రాథోడ్ రమేష్, మాజీ మంత్రి అమర్‌సింగ్ తిలావత్, ఆర్డీ ఓ పాండురంగారావు, జిల్లా రవాణా అధికారి అజ్మీరాశ్యాంనాయక్, ఎంపిపి తారాబాయి, సర్పంచ్ సరస్వతి, జెడ్పీటిసిలు కొయ్యల ఏమాజీ, అరిగెల నాగేశ్వర్ రావు, బాబూరావురాథోడ్, ఉత్సవ కమిటి సభ్యులు రాథోడ్ జనార్థన్, సుధాకర్ నాయక్, జిల్లా నలుమూలల నుండి వచ్చిన లంబాడాలు, ఆయా పార్టీల రాజకీయ నేతలు పాల్గొన్నారు.

తీరు మారకపోతే ఇంటికే
* వైద్య ఆరోగ్య సిబ్బంది పనితీరుపై కమిషనర్ అగ్రహం
* ఏజెన్సీ పిహెచ్‌సిలను మెరుగుపర్చాలని ఆదేశం

ఆదిలాబాద్, ఫిబ్రవరి 15: ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనుల వైద్యసేవల కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించి, కోట్లాది నిధులు ఖర్చుచేస్తున్నా కొన్ని ఆసుపత్రుల్లో వైద్యాధికారులు, సిబ్బంది నిర్వాకం వల్ల మెరుగైన వైద్యం అందడం లేదని, పనితీరు మార్చుకోకపోతే బాధ్యులైన వారిని ఇంటికి పంపిస్తామని రాష్ట్ర కుటుంబ సంక్షేమ వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ వి.కరుణ హెచ్చరించారు. ఆదిలాబాద్ జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ పనితీరును క్షేత్రస్థాయిలో స్వయంగా బుధవారం పరిశీలించిన కమిషనర్ పలుచోట్ల వైద్యసేవల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఆదిలాబాద్ కలెక్టరేట్‌లో ప్రభుత్వ ప్రాథమిక ఆసుపత్రులు, రిమ్స్ ద్వారా అందుతున్న వైద్యసేవలపై కలెక్టర్ బుద్ద ప్రకాష్ జ్యోతితో కలిసి సమీక్షించారు. మారుమూల గ్రామీణ ప్రాంతాలు, ముఖ్యంగా ఏజెన్సీ ఆసుపత్రుల్లో ఆధునిక వైద్యం అందుబాటులోకి తెచ్చినందునా నాణ్యమైన ప్రమాణాలతో వైద్యసేవలందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. గిరిజనుల మరణాలను అరికట్టడమే గాక వ్యాధి నిర్ధారణ పరీక్షలతో పాటు నమ్మకం కుదిరేలా వైద్యసేవలు అందించాల్సిన అవసరం ఉందని కమిషనర్ నొక్కిచెప్పారు. ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, మాతాశిశు మరణాలు అరికట్టేందుకు బాధ్యతతో విధులు నిర్వర్తించాలని సూచించారు. ప్రతినెల గర్భిణీలు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే చికిత్సలు చేసుకునేలా కార్యాచరణ రూపొందించాలని అన్నారు. ఇందుకోసం ఆసుపత్రుల్లో అన్ని సౌకర్యాలతో కూడిన వౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని అన్నారు. గిరిజన ప్రాంతాల్లో నివసించే మారుమూల ప్రాంతాల ప్రజలకు ప్రత్యేకంగా క్యాంపులు ఏర్పాటు చేసి వైద్యసేవలందించాలని, అక్కడ వైద్యులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. స్వచ్చ్భారత్ కార్యక్రమాన్ని నిర్వహించే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు అయిన వారికి జనని సురక్ష పథకం కింద ప్రోత్సాహకంగా వెయ్యి రూపాయాలు తప్పకుండా అందించాలని అన్నారు. జిల్లాలో కొన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యసిబ్బంది అందుబాటులో ఉండడం లేదని, వైద్యసేవలు కూడా అంతంతా మాత్రంగానే ఉన్నాయని ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. పనితీరు మెరుగుపర్చుకోకపోతే కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందని కమిషనర్ హెచ్చరించారు. ఉట్నూరు మండలం హస్నాపూర్ ప్రాథమకి ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బంది విధులు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, వీరు పనితీరు మెరుగుపర్చుకోవాలని, లేనట్లయితే విధుల నుండి తొలగిస్తామని హెచ్చరించారు. సబ్ సెంటర్‌లలో రోగులకు మంచినీటి సౌకర్యం కల్పించాలని, శిథిలావస్థలో ఉన్న తలమడుగు, బేల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు నూతన భవనాలు నిర్మించాలని ఆదేశించారు. ఆరోగ్య కేంద్రాల్లో సక్రమంగా పనిచేసే సిబ్బందికి ప్రతిభ అవార్డులు ఇవ్వడం జరుగుతుందని ఆమె తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ బుద్ద ప్రకాష్ జ్యోతి మాట్లాడుతూ పిహెచ్‌సిలలో ప్రసవాల సంఖ్య పెరిగేలా చర్యలు తీసుకోవాలని, పనిచేయని వైద్యసిబ్బందిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. కాంట్రాక్ట్ వైద్యులు, సిబ్బందికి ప్రతి నెల వేతనాలు అందించే విధంగా చూడాలని డి ఎం ఆండ్ హెచ్‌వోను కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ లలిత కుమారి, మలేరియా నిర్మూలన శాఖ అడిషనల్ డైరెక్టర్ ప్రభావతి, ఆదిలాబాద్ డిఆర్‌వో బానోత్ శంకర్, డిఎంఆండ్ హెచ్‌వో తొడసం చందు, డిప్యూటి డిఎంఆండ్ హెచ్‌వో వసంత్‌రావు, ప్రోగ్రాం అధికారి ప్రభాకర్ రెడ్డి, వైద్యాధికారులు పాల్గొన్నారు.