అదిలాబాద్

రసాబాసగా మున్సిపల్ బడ్జెట్ సమావేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచిర్యాల,్ఫబ్రవరి 20: గ్రేడ్ 1 మున్సిపాలిటీ మంచిర్యాల 2017-18 అంచనా బడ్జెట్‌ను సోమవారం కౌన్సిల్ సభ్యులు ఆమోదించారు. బడ్జెట్‌పై జరిగిన ప్రత్యేక సమావేశంలో ప్రతిపక్ష కౌన్సిలర్లు ప్రజా సమస్యలపై ప్రశ్నించాలని డిమాండ్ చేయడంతో అధికార పక్ష కౌన్సిలర్లు అభ్యతరాలు వ్యక్త పరచడంతో ఇరువర్గాల వాదోపవాదాల మధ్య గందరగోళం ఏర్పడింది. గొడవ మధ్యనే అంచనా బడ్జెట్‌ను అమోదించారు. చైర్మన్ మామిడిశెట్టి వసుంధర అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యే దివాకర్ రావు హాజరయ్యారు. 2017-18 బడ్జెట్ వివరాలను కమీషనర్ సభ్యులకు వివరించారు. 2017-18 బడ్జెట్‌లో సాధరణ ఆదాయం గ్రాట్యూలుకాకుండా నిర్బంధ పొదుపుతో 2592.86లక్షలుగా పేర్కొనగా మొత్తం ఆదాయం కింద గ్రాంట్‌ల ద్వారా 537.72 లక్షల డిపాజిట్లు, అడ్వాన్స్‌ల కింద 499.99 లక్షల వివరాలను వెల్లడించారు. సాధరణ వ్యయం కింద 1624.32 లక్షలు, మొత్తం వ్యయం కింద 970 లక్షలు, గ్రాంట్ ద్వారా 537.72 లక్షల డిపాజిట్లు అడ్వాన్స్‌ల ద్వారా 499.99 లక్షలు చూపించగా మిగులు బడ్జెట్ కింద 65.73 లక్షలుగా వెల్లడించారు. అంచనా బడ్జెట్‌లు ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఇరు వర్గాల అభివృద్ది కోసం షెడ్యూల్డ్ కులాల ప్రాంతాలకు 145.50 లక్షలు, షెడ్యూల్డ్ తెగల ప్రాంతాలకు 72.75 లక్షలు, స్ర్తి, శిశు సంక్షేమం కోసం 48.50 లక్షలు, బలహీన వర్గాల అభివృద్దికి 58.20 లక్షలు, మురికివాడల అభివృద్ది కోసం 388 లక్షలు, ఇతర ఖర్చుల కింద 257.65 లక్షలను కేటాయించినట్లు బడ్జెట్‌లో అమోదించారు. పట్టణ అభివృద్దిలో భాగంగా నీటి సరఫరా, రోడ్లు, వీధి దీపాలు, ఉద్యానవనాలు, స్పోర్ట్స్, కమ్యూనిటీ టాయిలెట్, కమ్యూనిటీ భవనాలు, మార్కెట్‌ల ఏర్పాటు తో పాటు అభివృద్ది పనుల కోసం 970 లక్షలను బడ్జెట్‌లో కేటాయించారు.
బడ్జెట్ సమావేశంలో గందరగోళం....
బడ్జెట్ సమావేశం గందరగోళం మధ్య సాగింది. సమస్య ప్రారంభంలో ప్రతిపక్ష పార్టీ కౌన్సిలర్లు శ్రీపతి శ్రీనివాస్, చంద్రశేఖర్ హాండే, గరిగంటి సరోజలు, పట్టణ సమస్యలపై చర్చించిన అనంతరం బడ్జెట్ సమావేశం నిర్వహించాలని డిమాండ్ చేయగా అధికార పార్టీ కౌన్సిలర్లు బొట్ల సత్యం, జగన్మోహన్ రావు, దెబ్బటి శ్రీనివాస్, పూదరి ప్రభాకర్, షఫీలు అభ్యంతరం వ్యక్తం చేసారు. బడ్జెట్ అనంతరం ప్రజా సమస్యలపై మాట్లాడాలని అధికార పార్టీ కౌన్సిలర్లు పేర్కొనగా ఎందుకు ససేమిరా అంటూ ప్రతిపక్ష కౌన్సిలర్లు స్పష్టం చేయగా ఇరు వర్గాల మధ్య గొడవకు దారి తీసింది. దీనితో ఎమ్మెల్యే దివాకర్ రావు జోక్యంతో గొడవ సద్దుమనిగిన అనంతరం బడ్జెట్‌ను ఆమోదిస్తు సమావేశాన్ని ముగించారు. ఈసమావేశంలో వైస్ చైర్మన్ నల్ల శంకర్‌తో పాటు కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.

పాడి పరిశ్రమ అభివృద్ధికి బాధ్యతతో సేవలందిస్తా
* డైయరీ సంస్థ చైర్మెన్ లోక భూమారెడ్డి
తలమడుగు,్ఫబ్రవరి 20: ముఖ్యమంత్రి కెసిఆర్ తనపై నమ్మకంతో పాడి పరిశ్రమ సంస్థ చైర్మెన్ పదవి కట్టబెట్టారని, సి ఎం నమ్మకాన్ని వమ్ము చేయకుండా అంకితభావంతో సేవలందించి పాడిపరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తానని రాష్ట్ర డైరీ డెవలఫ్‌మెంట్ కార్పోరేషన్ చైర్మెన్ లోక భూమారెడ్డి అన్నారు. నామినేటెడ్ పదవి పొందిన అనంతరం తొలిసారిగా సోమవారం రుయ్యాడి సొంత గ్రామానికి వచ్చిన సంధర్భంగా గ్రామస్తులు, మహిళలు సాదర స్వాగతం పలికారు. ముందుగా గ్రామంలోని హస్సేన్ హుస్సేన్ దేవాస్థానంలో పూజలు నిర్వహించారు. అనంతరం సాయిబాబా శివాలయం సందర్శించి పూజల్లో పాల్గొన్నారు. ఈ సంధర్భంగా తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో లోక భూమారెడ్డి మాట్లాడుతూ రుయ్యాడి గ్రామానికి రాష్టస్థ్రాయిలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చేలా కృషి చేస్తానని అన్నారు. రుయ్యాడి గ్రామ ప్రజలు ఇతరుల మాటలు వినకుండా అభివృద్దికి చేయూతనందించాలని అన్నారు. సర్పంచ్ స్థాయి నుండి టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్ష పదవి వరకు తాను చేసిన సేవలకు ప్రతిఫలంగానే కీలకమైన పదవి కెసిఆర్ కట్టబెట్టారని అన్నారు. రుయ్యాడి గ్రామాభివృద్దికి అన్ని విధాల కృషి చేస్తానని, ముఖ్యంగా పాడి పరిశ్రమతో రైతుల అభివృద్దికి బాటలు వేస్తానని పేర్కొన్నారు. ఆయన వెంట డిసిసిబి చైర్మెన్ దామోదర్ రెడ్డి, జిల్లా రైతు విభాగం నాయకులు గోవర్ధన్ రెడ్డి, టీఆర్‌ఎస్ కన్వీనర్ గంగన్న, శ్రీనివాస్ రెడ్డి, పోతరెడ్డి తదితరులు పాల్గొన్నారు.