అదిలాబాద్

సమస్యల పరిష్కారంలో అలసత్వం వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆసిఫాబాద్, ఫిబ్రవరి 20: ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో ఎలాంటి అలసత్వం వహించరాదని కుమ్రం భీం జిల్లాకలెక్టర్ చంపాలాల్ అన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజాఫిర్యాదుల విభాగంలో పాల్గొని జిల్లా నలుమూలల నుండి వచ్చిన అర్జీలను స్వీకరించారు. ప్రజల సమస్యలు ఓపికతో విని పరిష్కారానికి హామీ ఇచ్చారు. నివాస ప్రాంతాన్ని ఖాళీ చేయాలని అటవీశాఖ అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని వంజరి గ్రామస్థులు కలెక్టర్‌కు వినతి పత్రం అందచేశారు. జీవనోపాధి కోసం తాటి, ఈత చెట్టు నాటేందుకు వీలుగా ప్రభుత్వ స్థలాన్ని ఇప్పించాలని కోరుతూ వాంకిడి మండలం ఖిరిడికి చెందిన గీతకార్మికులు, మిషన్ భగీరథ కింద తాగునీటి సరఫరా చేసేందుకు ఓటేఘాట్‌లో నీటి ట్యాంకు ఏర్పాటు చేయాలని ఇక్కడి గిరిజనులు గ్రీవెన్స్‌లో అర్జీ సమర్పించారు. తాను సాగుచేసుకుంటున్న భూమిలో సోలార్ పంపుసెట్టు ఇప్పించాలని కోరుతూ కెరమెరి మండలం చందుగుడకు చెందిన జాదవ్ బాలాజీ కలెక్టర్‌కు అర్జీపెట్టుకున్నారు. ప్రాణహిత చేవెళ్ల కాలువల నిర్మాణం కింద భూములు కోల్పోతున్న తమకు నష్టపరిహారం ఇప్పించాలని దహెగాం మండలం బోగారం గ్రామస్థులు వినతి పత్రం అందచేశారు. ఆసిఫాబాద్‌కు కూతవేటు దూరంలో ఉన్న దానాపూర్‌లో కరెంటు సౌకర్యం కల్పించాలని గ్రామస్థులు కోరారు. సిర్పూర్ (టి) మండలంలో ఆదివాసీ కొలాంవార్ కమ్యునిటీ భవనాన్ని నిర్మాణానికి అవసరమైన స్థలం, నిధులు ఇవ్వాలని ఆ సంఘం కోరింది. బెజ్జూర్ మండలంలో విఆర్‌ఓగా పని చేస్తు మృతి చెందిన తన తండ్రి ఉద్యోగం ఇప్పించాలని దుర్గం మనోహర్ అనే వ్యక్తి దరఖాస్తు చేసుకున్నారు. ఇండ్లు లేని తమకు డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇప్పించాలని కోరుతూ కాగజ్‌నగర్ మండలం రేణికుంట్లకు చెందిన రమ్య వినతి పత్రం అందచేశారు. ఇలా ప్రజాఫిర్యాదుల విభాగంలో సుమారు 175కు పైగా దరఖాస్తులు అందినట్లు కలెక్టర్ తెలిపారు. వీటిని వెంటనే పరిష్కరించి అర్జీదారులకు న్యాయం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ముఖ్యప్రణాళికాధికారి కృష్ణయ్య, ఇంచార్జి డిఆర్‌ఓ రమేష్ బాబు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

పన్నులు చెల్లించి మున్సిపల్ అభివృద్ధికి సహకరించాలి
బెల్లంపల్లి, ఫిబ్రవరి 20: బెల్లంపల్లి మున్సిపాలిటీకి చెందిన అస్తి, ఇల్లు, నల్ల పనులు చెల్లించి బెల్లంపల్లి అభివృద్ధికి సహాకరించాలని మున్సిపల్ కమిషనర్ గోకు మల్లారెడ్డి కోరారు. సోమవారం మున్సిపాలిటీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2016-17 ఆర్థిక సంవత్సరం మార్చి 31 లోగా ప్రజలు అస్తి పన్ను, నల్ల బిల్లులు చెల్లించాలన్నారు. మున్సిపాలిటీలో ఒక్క కోటి 30 లక్షలు ఇంటి పన్నులు వసూలు కావాల్సి ఉండగా ఇప్పటి వరకు 54.66 లక్షల రూపాయల పన్నులు వసూలు చేయడం జరిగిందన్నారు. తెలిపారు. మున్సిపాలిటీలో 10 వేలకు పైగా బకాయిలు ఉన్న 300 మందికి రెడ్ నోటిసులు జారీ చేసినట్లు తెలిపారు. రెడ్ నోటీసులు జారీ చేసిన వారికి కేవలం మూడురోజుల గడువు మాత్రమే ఉందని ఇంటి పన్నులు చెల్లించని వారని ప్రత్యేకంగా గుర్తించి వారి అస్తులను జప్తు చేస్తామని కమీషనర్ తెలిపారు. 100 శాతం పన్నులు వసూలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించామన్నారు. మున్సిపాలిటీలో 42 శాతం ఇంటి పన్ను వసూలు అయిందని మరో 75.20 లక్షలు వసూలు కావాల్సి ఉందన్నారు. ఈ మున్సిపాలిటీలోని ప్రజలు రాజకీయ పార్టీలోని నాయకులు సహాకరించాలని కోరారు. అంతేకాకుండా ఈ పన్నుల వసూళ్ల కోసం 6 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసామని ఒక్కొక్క బృందంలో 7గురు ఉన్నట్లు తెలిపారు. ప్రజలు ఇండ్ల వద్దకు వచ్చిన మున్సిపల్ సిబ్బందికి సహాకరించాలని కోరారు. ఈ సమావేశంలో డి ఈ ఓ స్వాతి, బిల్ కలెక్టర్ రాజశేఖర్, తదితరులు ఉన్నారు.