అదిలాబాద్

సామాన్య ప్రజలకు పోలీసులు అండగా ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దివ్యనగర్, ఫిబ్రవరి 20: సామాన్య ప్రజలకు పోలీసులు అండగా ఉంటూ వారితో స్నేహభావంగా మసులుకోవాలని నిర్మల్ జిల్లా ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ తెలిపారు. సోమవారం స్థానిక పోలీసు కార్యాలయంలో ఎస్పీ ఆధ్వర్యంలో ప్రజాఫిర్యాదుల విభాగం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫ్రెండ్లీ పోలిసింగ్ అవలంభించేది మంచి మార్గంలో ఉన్న ప్రజలకేనన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేవారిపట్ల కఠినంగా చట్టరీత్యా చర్యలుంటాయని సూచించారు. పోలీసుల సహాయం కావాలనుకున్నవారు పోలీస్‌స్టేషన్‌లో నిర్భయంగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నాణ్యమైన పోలీసు వ్యవస్థను జిల్లా ప్రజలకు అందించి పోలీసుల గౌరవం మరింత పెంచే విధంగా కృషిచేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ఐదుగురు హాజరై సమస్యలను ఎస్పీకి తెలియజేసి ఆర్జీలు సమర్పించగా సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్ ద్వారా ఎస్పీ మాట్లాడి పరిష్కరించాలని సూచించారు.

జిల్లా పోలీసు కార్యాలయం ముందు అభ్యర్థుల నిరసన
ఆదిలాబాద్ టౌన్,్ఫబ్రవరి 20: ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన పోలీసు కానిస్టేబుళ్ళ నియామకాల్లో ఉద్యోగం కోల్పోయిన అభ్యర్థులు సోమవారం జిల్లా పోలీసు కార్యాలయం ముందు నిరసన తెలిపారు. వీరికి మద్దతుగా బిజెపి జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్ పాల్గొని, అభ్యర్థులతో కలసి అదనపు ఎస్పీ టి.పనసారెడ్డికి వినతి పత్రం అందజేశారు. సంవత్సర కాలం కానిస్టేబుల్ ఉద్యోగం కోసం అభ్యర్థులు కఠోర సాధన చేసి పోటీ పరీక్షలకు సిద్దమయ్యారని అన్నారు. అన్ని అర్హతలు సాధించినప్పటికీ ఉద్యోగాలు రాకపోవడంతో నిరాశ చెందుతున్నారని తెలిపారు. ప్రస్తుతం ఉద్యోగాలు కోల్పోయిన అభ్యర్థులకంటే ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు మార్కులు తక్కువగా ఉన్నాయని తెలిపారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన పోస్టులకు అర్హత సాధించిన అభ్యర్థులతో భర్తీచేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఉద్యోగుల ఎంపికలో అవకతవకలు జరిగాయని అభ్యర్థులు ఆరోపించారు. వెంటనే కట్ ఆఫ్ మార్కుల జాబితాను విడుదల చేయడంతో పాటు అవకతవకలపై ఉన్నతస్థాయి అధికారులతో ఉద్యోగాలు సాధించిన అభ్యర్థుల జాబితాను పరిశీలించాలన్నారు. ఆందోళనలో శ్రీవర్ష, శంకర్ ప్రసాద్, ముజాహిద్, శ్రీకాంత్, మహేందర్, కృష్ణ, అనీత, మహేష్, గంగాసాగర్ తదితరులు పాల్గొన్నారు.

ప్రజా సమస్యలను పరిష్కరిస్తా
* బెల్లంపల్లి ఆర్డీవో వీరన్న
బెల్లంపల్లి, ఫిబ్రవరి 20: బెల్లంపల్లి రెవెన్యూ డివిజన్ లోని ప్రజల సమస్యలు పరిష్కరిస్తానని బెల్లంపల్లి ఆర్డీవో గుగులోతు వీరన్న తెలిపారు. సోమవారం పట్టణంలోని ఆర్డీ ఓ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల విభాగంలో సందర్బంగా విలేకరులతో మాట్లాడుతూ ప్రజా సమస్యలను పరిష్కరించేందుకుప్రభుత్వం ఫిర్యాదుల విభాగాన్ని ఏర్పాటు చేసిందని తెలిపారు. పట్టా మార్పిడి చేయాలని, పట్టాలో పేర్ల మార్పు చేయాలని ఐదు ఫిర్యాదులు అందయాని ఆర్డీ ఓ తెలిపారు. పరిహారం కోరకు మూడు దరఖాస్తులు వచ్చిన్నట్లు తెలిపారు. ప్రజలు ఎదుర్కోంటున్న సమస్యలను ఆర్జీల ద్వారా స్వీకరించగా ఈ సమస్యలను పరిష్కరించేందుకు ఆయా మండలాల తహసీల్దార్‌లకు నివేధించనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా బెల్లంపల్లి తహసీల్దార్ కార్యాలయం లో ప్రజా ఫిర్యాదుల విభాగంలో 19 దరఖాస్తులు రాగా 17 భూములకు సంబంధించిన సమస్యలు, 2 మున్సిపాలిటీకి సంబంధించిన సమస్యలు వచ్చాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిడి ఓ మహేందర్, ఏ ఓ మార్గం రజిత, ఎం ఈ ఓ మోహన్, ఆర్ డబ్ల్యూ ఎస్ ఏ ఈ స్వాతి, తదితరులు ఉన్నారు.