అదిలాబాద్

చారిత్రక సంపదను కాపాడడానికి చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాంకిడి, ఫిబ్రవరి24: మండల కేంద్రంలోని చారిత్రక కట్టడమైన పూరాతన శివాలయాన్ని కాపాడడానికి అన్ని చర్యలు తీసుకొంటామని కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ చంపాలాల్ పేర్కొన్నారు.శుక్ర వారం మహాశివరాత్రి సందర్భంగా శివాలయాన్ని సందర్భంచిన కలెక్టర్ దంపతులకు ఆలయ కమిటి ఏర్పాటు చేసిన సన్మాన సభలో ఆయన మాట్లాడుతూ ఇలాంటి చారిత్రకమైన కట్టడం ఆసిఫాబాద్ జిల్లాలోనే అతిపెద్ద చారిత్రక సంపదని,దీన్ని పూర్తిస్థాయిలో రక్షించి భావితరాలకు అందించడం ప్రభుత్వ బాద్యతగా స్వీకరిస్తామని ఆయన పేర్కొన్నారు. ఇంత పెద్ద పురాతన గుడిని దేవాదాయ కమిటి ద్వారా స్దానికులే దాదాపు 50 లక్షల రూపాయల వ్యయంతో చికిలి నది వరద నుండి కాపాడే చర్యలు తీసుకోవడం అభినందనీయమని అయన పేర్కొన్నారు. అదే కాకుండా ఇంత గొప్ప చారిత్రక సంపదనను కాపాడ్డానికి తన నిధుల నుండి 10 లక్షలు ఇచ్చి తక్షణ అభివృద్ది పనులు చేయించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.అదేవిదంగా దేవాదాయ శాఖ నుండి పురాతన దేవాలయాల రక్షణ చర్యల్లో భాగంగా మరమ్మత్తు చర్యలు చేపట్టడానికి ప్రతిపాధనలు పంపించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిందని,దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణరెడ్డికి సైతం ఈ దేవాలయం గురించి తెలుసని,దీంతో ఈ దేవాలయాన్ని అభివృద్ది చేయడానికి ఆసక్తితో ఉన్నారని పేర్కొన్నారు.అయినప్పటికీ అలయ అభివృద్ది కమిటి మా వెంటపడి పనులు చేయించుకోవాలని ఆయనన్నారు.ఈ దేవాలయం గురించి వాంకిడి జడ్పిటిసి అరిగెల నాగేశ్వర్‌రావు సైతం తన వద్ద అనేక సార్లు ప్రస్తావన తీసుకొచ్చారని,దీంతో ఈ గుడిని గతంలో కూడా ఒక సారి దర్శించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా వాంకిడి జడ్పిటిసి అరిగెల నాగేశ్వర్‌రావు సైతం ఆలయాభివృద్దికి తన వంతు కృషి చేస్తానని స్ధానిక ఎమ్మెల్యే కోవ లక్ష్మి,ఎమ్మెల్సి పురాణం సతీష్,రాష్ట్ర మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డిల దృష్టికి సమస్యను తీసుకొని వెళ్ళి అధిక నిధులు రావడానికి చర్యలు తీసుకొంటామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మండల ఎంపిపి దుర్గం ఆర్తిక,సర్పంచ్ విమలాబాయి,ఉపాధ్యక్షులు దేవినేని గొల్ల,ఆలయ కమిటి చైర్మన్ గాదే ప్రవీన్‌కుమార్,సభ్యులు పురుషోత్తం,జమాల్‌పూరి సుధాకర్,గాదే శివుకుమార్,ముండే రాజు,శ్రావన్,తాటిపల్లి రవి,లక్ష్మినారాయణ,అశోక్,మనోహర్,శివశంకర్,బంటి,సుచిత్,రోహిదాస్,మొండిలతోపాటు ప్రజలు పాల్గొన్నారు.
కలెక్టర్ దంపతులను ఘనంగా సన్మానించిన ఆలయ కమిటి
మహాశివరాత్రి సందర్భంగా వాంకిడి శివాలయాన్ని శుక్రవారం సందర్శించిన కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ చంపాలాల్,సతీమణి డాక్టర్ చంద్రకళను స్ధానిక ఆలయ కమిటి చైర్మన్ గాదే ప్రవీన్‌కుమార్,కార్యదర్శి గాదే శివ్‌కుమార్,కమిటి సభ్యులు రామగిరి పురుషోత్తం,జమాల్‌పూరి సుధాకర్,అశోక్,రాజు,శ్రావన్,లక్ష్మినారాయణ,తాటిపల్లి రవిలు ఘనంగా సన్మానించారు.

ఆలయ అభివృద్ధికి కృషి చేస్తా
* ఎంపి గెడం నగేష్
ఇచ్చోడ, ఫిబ్రవరి 24: జిల్లాలోనే అతి పురాతనమైన సిరిచెల్మ శివాలయ అభివృద్దికి అన్నివిధాల కృషి చేస్తానని పార్లమెంట్ సభ్యులు గెడం నగేష్, పాడిపరిశ్రమ అభివృద్ధి శాఖ చైర్మెన్ లోక భూమారెడ్డిలు అన్నారు. శుక్రవారం శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని సిరిచెల్మ శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ సమైక్యపాలంలో పురాతన దేవాలయాలు అభివృద్దికి నోచుకోకుండా నిర్లక్ష్యానికి గురయ్యాని, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఆలయాలను అభివృద్ది చేయడానికి కృతనిశ్చయంతో ఉందని, దేవాదాయ, ధర్మదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డితో చర్చించి ఆలయ అభివృద్దికి ప్రత్యేక నిధులు మంజూరి చేయిస్తామని అన్నారు. అనంతరం పాడిపరిశ్రమ అభివృద్ది శాఖ చైర్మెన్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించి, మొదటి సారిగా మండలానికి వచ్చిన సంధర్భంగా లోక భూమారెడ్డిని మండల టీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు పూలమాలలు, శాలువాలతోఘనంగా సత్కరించారు.