అదిలాబాద్

శంభో శంకర... మహాదేవ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, ఫిబ్రవరి 24: మహాశివరాత్రి పర్వదిన వేడుకలను శుక్రవారం ప్రజలు భక్తిశ్రద్దల నడమ ఘనంగా జరుపుకున్నారు. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లోని శైవక్షేత్రాలన్నీ భక్తుల తాకిడితో కిటకిటలాడాయి. ఎక్కడచూసినా శివాలయాలకు ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడగా, అభిషేకాలు, యజ్ఞహోమాలు, జాగారాలు, ప్రత్యేక పూజలు, గోదావరి తీరంలోభక్తుల పుణ్యస్నానాలతో భక్తిపారవశ్యం వెల్లివిరిసింది. ఉపవాస దీక్షలతో బోళా శంకరునికి పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఉమ్మడి జిల్లాల్లోని వేలాల జాతర, కదిలి పాపహరేశ్వరాలయం, బాసర దేవాలయం, గూడెం దేవాలయం, బేల మండలంలోని నందీశ్వరుని ఆలయం, మామడ మండలంలోని రాజ రాజేశ్వర ఆలయం, ఇచ్చోడలోని సిరిచెల్మ, జైనథ్ మండలంలోని భోరజ్ శివాలయంలో వేకువ జామునుంటే భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. మంత్రి జోగురామన్న ఆదిలాబాద్‌లోని గంగపుత్ర శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా, బిజెపి జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్ సతీసమేతంగా శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఇచ్చోడ మండలంలోని సిరిచెల్మలో ఎంపి గెడం నగేష్, ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, జాయింట్ కలెక్టర్ కృష్ణారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించగా, బెల్లంపల్లి మండలంలోని కన్నాల గ్రామంలోని బుగ్గ రాజేశ్వర స్వామి ఆలయంలో ఎమ్మెల్యే చిన్నయ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోదావరి తీరానికి భక్తులు పోటెత్తగా మంచిర్యాల జిల్లా ముల్కల గోదావరి వద్ద ఇద్దరు యువకులు స్నానాలు చేస్తూ గల్లంతయ్యారు. ఖానాపూర్ మండలం తర్లపాడులో శివరాత్రి వేడుకలను ఓంకారేశ్వరాలయంలో ఘనంగా నిర్వహించారు. చెన్నూర్‌లోని శివాలయంలో శివపార్వతుల కళ్యాణం, నిశి పూజ ఘనంగా నిర్వహించారు. ఆదిలాబాద్‌లోని బ్రహ్మకుమారి విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో 108 శివలింగాల ప్రదర్శనను తిలకించేందుకు భక్తులు పోటెత్తారు. కదిలి పాపహరేశ్వరాలయంలో భక్తజనసందోహం మద్య బాసర ఈవో వెంకటేశ్వర్లు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జన్నారం మండలం బాదన్‌పల్లి, నిర్మల్ మండలం సోన్, ఖానాపూర్, కడెం, బాసర, మంచిర్యాల, చెన్నూర్ గోదావరి తీరాలు భక్తుల పుణ్యస్నానాలతో కిటకిటలాడాయి. నాలుగు జిల్లాల్లో ఆర్టీసి అధ్వర్యంలో జాతర ఉత్సవాలకు 150 ప్రత్యేక బస్సులు నడిపారు. నేరడిగొండ మండలం కుంటాల సోమేశ్వరాలయ జాతరకు భక్తులు పోటెత్తారు. జిల్లా వ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరగగా పండగ వేళ ఇద్దరు యువకులు గోదావరిలో మునిగి గల్లంతైన సంఘటన ఆ కుటుంబాల్లో విషాదాన్ని నింపింది.

కోటి 65 లక్షలతో అంతర్గత రోడ్ల నిర్మాణం
* ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్
జైనూర్, ఫిబ్రవరి 24: ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని పది మండలాల్లో సిడిపి, ఎన్ ఆర్ ఈజి ఎస్ పథకం ద్వారా కోటి 65లక్షలతో అంతర్గత సిసి రోడ్లు నిర్మిస్తున్నట్లు ఎమ్మెల్సీ పురాణం సతీష్ అన్నారు. ఆయనతో పాటు ఎమ్మెల్యే కోవలక్ష్మి శుక్రవారం ఆశపెల్లి, జైనూర్‌లో పర్యటించారు. ఆయా గ్రామాల్లో ప్రజలు పలు సమస్యలను వారి దృష్టికి తీసుకవచ్చారు. సమస్యల పరిష్కారానికి, తాగునీటి సరఫరాకు కృషి చేస్తామని వారు హామీ ఇచ్చారు. అనంతరం జైనూర్‌లోని సోన్‌పటేల్ గూడలో సిసి రోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేశారు. సర్పంచ్ నివాసంలో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, మార్కెట్ చైర్మెన్లకు గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. ఈ సంధర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ అన్ని వర్గాల అభివృద్దికి ముఖ్యమంత్రి కెసిఆర్ ఎంతో కృషి చేస్తున్నాని, ఇప్పటి వరకు ఏ ప్రభుత్వాలు చేయని విధంగా ప్రణాళిక బద్దంగా పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. ప్రతిపక్షా కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ ఉనికిని కాపాడుకునేందుకు ప్రజల ఆవేదన పేరిట సభలు నిర్వహిస్తున్నారని, వీటిని ప్రజలు పట్టించుకునే పరిస్థితుల్లో లేరన్నారు. జర్నలిస్టులకు డబుల్‌బెడ్‌రూం ఇండ్లు మంజూరి చేయడానికి సి ఎం అంగీకరించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు ఇంతియాజ్ లాలా, కో అప్షన్ సభ్యులు సుబూర్‌ఖాన్, సర్పంచ్‌లు మెస్రం లక్ష్మణ్, మడావి భీంరావు, మెస్రం గోవింద్‌రావు, మాదవ్‌రావ్, నాయకులు కనక యాదవ్‌రావు, జాడి రవీందర్, అంబాజీ రావు తదితరులు పాల్గొన్నారు.