అదిలాబాద్

మిషన్ భగీరథలో చేర్చండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాంకిడి, మార్చి 31: మా గ్రామాలను సైతం మిషన్ భగీరధలో చేర్చి మాకు తాగు నీటి సౌకర్యం కల్పించాలని ఈ పథకంలో చోటు లభించని మండలంలోని తీవ్ర నీటి ఎద్దడిగల మారుమూల గిరిజన గ్రామాలైన సర్కెపల్లి, చింతరిట్, సోయగూడ, పాకిడి గూడ, జోలపటార్, బోడిపటార్, రింగరిట్, మానిక్‌పటార్, ఎల్లాపూర్ గ్రామాల గిరిజనులు ఉన్నతాధికారులను వేడుకొంటున్నారు. రెండేళ్లుగా వర్షాలు సరిగా లేకపోవడంతో వాగులు ఎండిపోయి బోర్వెల్లు లేకపోవడంతో తాగేందుకు గుక్కెడు మంచినీళ్లు కరవైనాయని వెలిగిలోని పాకిడిగూడ గిరిజనులు వాపోతున్నారు. గ్రామంలో బోర్వెల్లు వేయాలని ఏళ్ల తరబడి వేడుకొంటున్నా ఎవరూ స్పందించడంలేదని వాపోతున్నారు. ఇప్పటి వరకు వాగు నీటిని తాగి అనేక రోగాల పాలైనా తాము అధికారుల రాకకోసం ఎదురుచూస్తున్నామని అయినా ఐటిడిఎకు చెందిన ఏ అధికారి గ్రామానికి రావడంలేదన్నారు. వర్షాకాలంలో వాగుల్లో బురద నీరు వస్తే కనీసం తాగుదామన్న మంచినీరు దొరక్కపోవడంతో దిక్కులేక వాగునీరు తాగుతున్నామన్నారు. ఈ విషయంలో ఎమ్మెల్యే చొరవ తీసుకొని గ్రామంలో సమస్యకు పరిష్కారం చూపాలని కోరుతున్నారు.
వాగువచ్చిన రోజు మురికి నీరే దిక్కు
* వెలిగి సర్పంచ్ మడావి చంపబాయి
గ్రామం ఏర్పడి 15ఏళ్లు దాటుతున్నా బోర్వెల్ కూడా లేదని ఇప్పటికీ వాగు నీరు తాగుతున్నామని వెలిగి మాజీ సర్పంచ్ మడావి చంపాబాయి పేర్కొన్నారు. బోర్వెల్ వేయాలని అనేక మంది అధికారులు, ప్రజాప్రతినిధులను కలిసినా లాభం లేకపోయిందని ఆమె పేర్కొన్నారు.
వాగు నీరు తాగుతున్నం కనికరించండి
* గ్రామ పటేల్, ఆత్రం సోము
తాగునీరు లేకపోవడంతో వాగు నీరే తాగుతున్నామని బోర్వెల్ లేకపోవడంతో ఈ పరిస్థితి దాపురించిందని గ్రామ పటేల్ ఆత్రం సోము తెలిపారు. వాగులో చెలిమెలుతీసి నీరు తీసుకొని తాగుతామాని, వాగువస్తే ఇబ్బంది అవుతుందని ఆయన పేర్కొన్నారు.
బోర్ లేదు, రోడ్డు లేదు
* ఎస్‌హెచ్‌జి అధ్యక్షురాలు రుక్మాబాయి
గ్రామానికి రోడ్డులేదు, తాగునీరు లేదని వాగు నీరే తాగుతామని గ్రామంలోని స్వయం సహాయక సంఘం అధ్యక్షురాలు కుమరం రుక్మాబాయి ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి గ్రామానికి రోడ్డువేసి, తాగు నీటి కోసం బోర్వెల్ వేయాలని ఆమె పేర్కొన్నారు.