అదిలాబాద్

గిరిజన చట్టాలను సవరిస్తే సహించం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇచ్చోడ,మార్చి 5: రాజ్యాంగం కల్పించిన చట్టాలను ప్రభుత్వాలు సవరిస్తే ఆదిమ గిరిజనులు చూస్తూ ఊరుకోరని, దొడ్డిదారిన వచ్చి సంక్షేమ ఫలాలు అనుభవిస్తున్న వలసవాదులను తరిమికొడుతామని ఆదివాసి హక్కుల పరిరక్షణ సమితి (తుడుం దెబ్బ) నాయకులు హెచ్చరించారు. ఆదివారం బోథ్‌లో జరిగిన సింహగర్జనకు ముఖ్య అతిథిగా హాజరైన హైదరాబాద్ హైకోర్టు రిటైర్డ్ జడ్జి చంద్రకుమార్ మాట్లాడుతూ నీతి నిజాయితికి మారుపేరైన ఆదిమ గిరిజనుల హక్కులను ప్రభుత్వం కాలరాయడానికి ప్రయత్నాలు చేస్తుందని, గిరిజన చట్టాలలో మార్పులు తెచ్చి కైత లంబాడి, వాల్మికిబోయ కులాలను ఎస్టీ జాబితాలో చేర్చడానికి చెల్లప్ప కమిషన్‌ను ప్రభుత్వం నియమించడం జరిగిందని, ఈ కమిషన్‌ను ఆదిమ గిరిజనులు ఎట్టిపరిస్థితుల్లో ఒప్పుకోరని ఆయన అన్నారు. గిరిజన ప్రాంతాల్లో పనిచేసే అధికారులు లంచాలకుమరిగి గిరిజన చట్టాలను ఉల్లంఘిస్తున్నారని అన్నారు. 123 జీవోను తాను గతంలో వ్యతిరేకించడం జరిగిందని, దీనిపై ముఖ్యమంత్రి చంద్రశేఖరరావ్‌కు విన్నవించినప్పటికీ మొండిగా వ్యవహరించడంతో నేడు ఆ జీవోను హైకోర్టు కొట్టివేసిందని తెలిపారు. ముఖ్యమంత్రి కల్లబొల్లి మాటలతో కాలం వెల్లదీస్తున్నారని విమర్శించారు. నేటికి గిరిజన ప్రాంతాలలో వౌలిక సదుపాయాలు కూడా లేవని, మందులు, సిబ్బంది కొరత తీవ్రంగా ఉందన్నారు. సకాలంలో వైద్యం అందకపోవడంతో తమ ప్రాణాలను కోల్పోతున్నారని అన్నారు. గిరిజన చట్టాలకు రక్షణ కల్గాలంటే ఆదిమ గిరిజనులంతా ఐక్యమత్యంగా ఉండి ఉద్యమించాలని పిలుపునిచ్చారు. బోథ్ మాజీ ఎమ్మెల్యే సోయం బాపురావు మాట్లాడుతూ పక్కరాష్ట్రాల నుండి దొడ్డిదారిన చొరబడి ఉద్యోగాలు, భూమి, తమ సంస్కృతిని వలస వాదులు దోచుకుంటున్నారని, తమ హక్కులు కాలరాస్తున్న వలసవాది లంబాడీలను తరిమికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. వలసవాది లంబాడీలకు స్థానిక అధికారులు కొందరు సహకరిస్తూ తప్పుడు దృవీకరణ పత్రాలను అందజేస్తున్నారని, ఇలాంటి అధికారులపై కూడా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. గిరిజన విద్యాభివృద్దికి ఉట్నూరులో గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసి నాన్ ఏజెన్సీ గిరిజన ప్రాంతాలను ఏజెన్సీ ప్రాంతాలుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. 5వ షెడ్యూల్ ప్రకారం గిరిజనులకు రావాల్సిన ఉద్యోగాలను గిరిజనులకే కేటాయించాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో 1/70, ఫిసా చట్టం పకడ్బందీగా అమలు చేసి టైగర్‌జోన్, ఓపెన్‌కాస్టు, భారీ ప్రాజెక్టుల నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఆదివాసి నిరుద్యోగ యువతీ యువకులకు ఏజెన్సీ ప్రాంత ఉత్తర్వుల ప్రకారం అన్ని శాఖల్లో ఉద్యోగ, ఉపాధి కల్పించి, డి ఎస్సీ, టెట్, గ్రూపు వంటి ఉచిత శిక్షణ హైదరాబాద్‌లో ఇప్పించాలని, భూమి లేని నిరుపేద ఆదివాసీలకు మూడెకరాల భూమిని వెంటనే పంపిణీ చేయాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన చెల్లప్పకమిషన్‌ను వెంటనే రద్దుచేయాలని, లేని పక్షంలో తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమాలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు. మహారాష్టక్రు చెందిన ప్రొఫెసర్ ఆమ్రాజ్ మాట్లాడుతూ ఆదిమ గిరిజనులంతా సంఘటితంగా ఉండి ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, చంద్రలింగయ్య, ప్రొఫెసర్ నాగేశ్వర్‌రావు, గిరిజన నాయకులు ఉయిక సంజీవ్, నారాయణదొర, లచ్చన్న, సాయన్న, కుక్కల రవి, బుర్రాల రవి, కొడప నగేష్ తదితరులు పాల్గొన్నారు.