అదిలాబాద్

నేటి నుంచి అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్ రూరల్,మార్చి 7: పోలీసు కానిస్టేబుల్ (సివిల్/ఏఆర్) ఉద్యోగాల భర్తీలో భాగంగా ప్రాథమిక జాబితాలో ఉన్న అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని జిల్లా ఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం స్థానిక పోలీసు సమావేశ మందిరంలో పోలీసు కార్యాలయం అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ శ్రీనివాస్ మాట్లాడుతూ నెల 8 నుంచి 10వ తేదీ వరకు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ధ్రువీకరణ పత్రాల పరిశీలన జరుగుతుందన్నారు. స్థానిక పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లోని చక్రపాణి హల్‌లో అభ్యర్థుల నిజ ధ్రువీకరణ పత్రాలను పరిశీలించేందుకు పోలీసు అధికారులతో పాటు డిపివో అధికారులను నియమించామని అన్నారు. పత్రాలను పరిశీలించే ప్రక్రియను కౌంటర్లవారీగా అధికారుల సమక్షంలో పరిశీలించడం జరుగుతుందని, జిల్లా అదనపు ఎస్పీ పనసారెడ్డి, కార్యాలయం ఏవో జె.పుష్పరాజ్ పర్యవేక్షణలో పత్రాలను క్షుణ్ణంగా పరిశీలిస్తారని అన్నారు. జిల్లా పోలీసు కంప్యూటర్ నిపుణులు అభ్యర్థుల పూర్తిడేటాను పరిశీలిస్తారని, తుది వ్రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు తమ నిజ ధృవపత్రాలను గజిటెడ్ అధికారిచే ధృవీకరించబడి రెండు జతల జిరాక్స్ కాఫీలు, రెండు పాస్‌పోర్టు సైజ్ ఫోటోలను వెంట తీసుకొని రావాలన్నారు. కానిస్టేబుల్ ఉద్యోగానికి దరఖాస్తు చేసిన సమయంలో అభ్యర్థుల జతపర్చిన విద్య, కుల, స్థానికంతో పాటు ఇతర అదనపు అర్హతలకు సంబంధించిన పత్రాలను సమర్పించాల్సి ఉంటుందన్నారు. అభ్యర్థులు తమ అటెస్టెషన్ ఫారాలను తమ చేతుల మీదుగా పూరించాలని సూచించారు. అభ్యర్థులు తమ ధృవీకరణ ప6తాలను జాగ్రత్తగా చదివి పూరించాలని, ఎటువంటి వాస్తవాలను దాచిపెట్టడం లేదా వాస్తవాలను అణచిపెట్టిన వారు అనర్హులుగా పరిగణించబడుతారన్నారు. నిజ ధృవపత్రాలను సమర్పించిన అనంతరం పోలీసు స్పెషల్ బ్రాంచ్ అధికారులచే సంబంధిత కార్యాలయంలో ప్రత్యేక్షంగా పరిశీలించడం జరుగుతుందన్నారు. అభ్యర్థుల నిజ ధృవపత్రాలను ముండంచెల పద్దతిలో పరిశీలిస్తామని అన్నారు. అభ్యర్థులు ఎటువంటి అవకతవకలకు పాల్పడకుండా అధికారులకు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ టి.పనసారెడ్డి, డిఎస్పీ కె.సీతారాములు, ఏవో జె.పుష్పరాజ్, కార్యాలయం అధికారులు ఆర్.్భరతి, కె.పుష్ప, రిజ్వానాబేగం, జె.్భరతి, బి. ఆశన్న, వెంకటరమణ, సిసి ఎం పోతరాజ్, యండి ఆయూబ్, ఎం.కిష్టారెడ్డి, ఎం.ప్రసాద్, స్పెషల్ బ్రాంచ్ అధికారులు బి.ప్రవీణ్, ఎస్సైలు అన్వర్ ఉల్ హఖ్, ఆర్ ఐబి జెమ్స్, ఆర్ ఎస్సై బి.పెద్దయ్య, తదితరులు పాల్గొన్నారు.