అదిలాబాద్

పిహెచ్‌సిని తనిఖీ చేసిన కలెక్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమిని, మార్చి 10: భీమిని మండలంలోని శుక్రవారం మంచిర్యాల జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఆకస్మిక తనిఖీలతో అధికారులను హాడలెత్తించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసారు. తనిఖీలలో భాగంగా ఆసుపత్రిలోని పలు రికార్డులను పరిశీలించారు. ఆసుపత్రిలో వినియోగిస్తున్న వైద్య పరికరాలను పరిశీలించారు. ఆసుపత్రిలో వైద్యుడు ఇతర సిబ్బంది ఫార్మసిస్టు, ల్యాబ్ అసిస్టెంట్, హెల్త్ సూపర్‌వైజర్, హెల్త్ అసిస్టెంట్‌లు ఆసుపత్రిలో లేకపోవడంతో వారిపై ఆగ్రహం వ్యక్తం చేసారు. సిబ్బంది స్థానికంగా ఉండాలని లేకపోతే చర్యలు తప్పవని పని తీరు మార్చుకోవాలని ఆసుపత్రిలో ప్రసవాలు పెరిగేలా చూడాలని సిబ్బందికి సూచించారు. అక్కడి నుంచి ఎస్టి కాలనీలో ఎన్ ఆర్ ఈ జి ఎస్‌లో నిర్మిస్తున్న సిసి రోడ్డు పనులను పరిశీలించారు. సిసి రోడ్డుకు వాటర్ క్యూరింగ్ సరిగా లేదని నాణ్యత లోపం కూడా ఉందని ఇలా నిర్మాణాలు చేస్తే అధికారులపై చర్యలు తప్పవని అన్నారు. ఎస్టి కాలనీలో గిరిజనులతో కొద్దిసేపు ముచ్చంటించారు. గిరిజన చట్టాలను వినియోగించుకోని అభివృద్ది చెందాలని ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను వినియోగించుకోని మంచి విద్యను అభ్యసించి విద్యవంతులుగా ఎదగాలని వారికి సూచించారు. కలెక్టర్ వెంట భీమిని తహాసీల్దార్ రాజన్న, ఈవోపిఆర్‌డి శంకర్, ఆర్ ఐ భీమ్లాలు ఉన్నారు.

వేసవిలో తాగునీటికి ఇబ్బందులు లేకుండా చూడాలి
* జిల్లా కలెక్టర్ ఇలంబరిది
నిర్మల్, మార్చి 10: వేసవిని దృష్టిలో ఉంచుకుని జిల్లాలో తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలంబరిది రక్షిత మంచినీటి విభాగం అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులతో మిషన్ భగీరథ ఇంట్రావిలేజ్ పైప్‌లైన్ పనులు, తాగునీటి పనులపై మండలాల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వేసవిలో తాగునీటి ఎద్దడి రాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. 14వ ఆర్థిక సంఘం నిధులతో తాగునీటి పనులకు మొదటి ప్రాధాన్యతనిచ్చి పూర్తిచేయాలన్నారు. జిల్లాలో 123 మంచినీటి పథకాలు సక్రమంగా పనిచేయడంలేదని గుర్తించివాటిలో 94 పనులకు మరమ్మత్తులు చేయించడం జరిగిందని, ఇంకా 28 పనులను త్వరలోనే మరమ్మత్తులు చేపట్టి పూర్తిచేయనున్నట్లు ఆర్‌డబ్ల్యూ ఎస్ అధికారులు కలెక్టర్‌కు వివరించారు. జిల్లాలో ఎన్ని బోరుబావులు ఉన్నాయి, వాటిలో పనిచేయని వాటిని గుర్తించి యుద్దప్రాతిపదికన పూర్తిచేయాలన్నారు. గ్రామాల్లో వేసవిలో తాగునీటికి మాత్రమే నిధులు వెచ్చించాలని సూచించారు. రక్షిత మంచినీటి విభాగం ఈఈ దేవెంధర్‌రెడ్డి మాట్లాడుతూ మిషన్‌భగీరథ పథకం కింద ఇంట్రావిలేజ్ పైప్‌లైన్ 671 పనులకు 175.18 కోట్లు మంజూరీకాగా గ్రామపంచాయతీ నుండి సర్పంచ్‌లతోకలిసి వివిధరకాల గూగుల్ మ్యాప్‌లను తెప్పించి ప్రతిపాదనలు తయారుచేశామన్నారు. అయితే అదనంగా మరో 48 కోట్లు అవసరమవుతాయని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఆర్‌డబ్ల్యూ ఎస్‌డిఈ కట్ట శ్రీనివాస్, ఎఈలు పాల్గొన్నారు.