అదిలాబాద్

పథకాలు పకడ్బందీగా అమలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైనూర్, మార్చి 23: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ఆయా శాఖల అధికారులు పకడ్బందీగా అమలు చేయాలని కుమురంభీం జిల్లా జాయింట్ కలెక్టర్ అశోక్ కుమార్ అన్నారు. గురువారం జైనూర్ తహశీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మండలంలో కళ్యాణలక్ష్మి, షాదిముబారక్ పథకాల కింద ఎంత మంది లబ్దిపొందారు, ఇంకా ఎంత మందికి నిధులు రావాల్సి ఉన్నాయో అధికారులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలకు పాఠ్యపుస్తకాల పంపిణీ, విద్యార్థులకు యూనిఫాం దుస్తుల పంపిణీ విషయాలపై సమీక్షించారు. ఉపాధి హామీ, ఇందిరకాంతి పథకాల్లో ఆయా శాఖల పనితీరుపై అధికారులతో సమీక్షించారు. అధికారులు లబ్దిదారులకు లాభం చేకూరేలా పథకాలు అమలుపర్చాలని, విధుల పట్లనిర్లక్ష్యం చేయకూడదని ఆదేశించారు. ఈ సమావేశంలో తహసీల్దార్ శంకర్ గౌడ్, ఐకెపి ఏపి ఎం ఆశోక్, మండల విద్యాశాఖాధికారి కుడ్మెత సుధాకర్, ఈజీ ఎస్ ఏపివో బాలయ్య, ఆర్ ఐ బాబుసింగ్, అధికారులు పాల్గొన్నారు.

వడ దెబ్బతో యువకుడి మృతి
ఉట్నూరు, మార్చి 23: వడదెబ్బతో యువకుడు మృతి చెందిన సంఘటన మండలంలో చోటుచేసుకుంది. స్థానిక మండలం రామలింగంపేటకు చెందిన గురిజల ఎల్లన్న (22) అనే యువకుడు బుధవారం పొలం పనులకు వెళ్ళగా తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వాంతులు, విరేచనలతో ఆనారోగ్యానికి గురైన ఎల్లన్న చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందాడు. కాగా, రోజుకు రోజుకు ఎండలు తీవ్రం అవుతుండడంతో ఉపాధి కూలీలు, చేను పనికి వెళ్లే రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

నీటి ఎద్దడి గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా నీరు
* ఆర్డీవో కదం సురేష్
జైనూర్, మార్చి 23: వేసవి కాలంలో నీటి ఎద్దడి సమస్య తలెత్తకుండా తగు చర్యలు తీసుకుంటున్నట్లు కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఆర్డీవో కదం సురేష్ పేర్కొన్నారు. ఆయన గురువారం మండలంలోని జెండాగూడ పంచాయతీలో గల లెండిగూడ, ఆశపల్లి పంచాయతీలో గల నందినాయక్ తాండా, సుభాష్‌గూడ గ్రామాలను సందర్శించారు. ఆయా గ్రామ సమస్యలతో పాటు నీటి ఎద్దడి సమస్యపై ప్రజలతో అడిగి తెలుసుకున్నారు. మంచినీటి పథకాలు సరిగ్గా పనిచేయడం లేదని, నీరు సరిగ్గా రావడం లేదని చెప్పడంతో మంచినీటి పథకాలకు మరమ్మత్తులు చేయించడంతో పాటు అవసరమైతే నీటి ఎద్దడి గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. అనంతరం జైనూర్ మండల కేంద్రంలోని జిసిసి డిఆర్ డిపో పక్కన జిసిసి ద్వారా నూతనంగా ఏర్పాటు చేసే పెట్రోల్‌బంక్‌కై స్థలాన్ని పరిశీలించారు. ఈ స్థలం వివరాలను తనకు సమర్పించాలని తహశీల్దార్‌ను ఆదేశించారు. ఆయన వెంట తహశీల్దార్ శంకర్ గౌడ్, ఆర్‌ఐ బాబుసింగ్, ఆశపెల్లి సర్పంచ్ రాథోడ్ దూదురాం, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు తదితరులు ఉన్నారు.

సింగరేణిలో బెల్లంపల్లికి బంగారు భవిష్యత్
200 సంవత్సరాలకు పైగా బొగ్గు నిల్వలు
* డైరెక్టర్ పిపి మనోహర్ రావు
బెల్లంపల్లి, మార్చి 23: సింగరేణి చరిత్రలో బెల్లంపల్లికి బంగారు భవిష్యత్ ఉందని 200ఏళ్లకు పైగా బొగ్గు నిల్వలు బెల్లంపల్లిలో ఉన్నాయని సింగరేణి ప్రాజెక్ట్ ప్లానింగ్ డైరెక్టర్ ఎ మనోహర్ రావు స్పష్టం చేశారు. గురువారం బెల్లంపల్లి సింగరేణి ఏరియాసుపత్రిలో రూ.85 లక్షల వ్యయంతో ఆధునీకరించి న అత్యవసర చికిత్స విభాగాన్ని ప్రారంభించారు. రోగుల కోసం గదుల్లో ఏసి లు ఏర్పాటు చేయడంపట్ల సంతోషం వ్యక్తంచేశారు. సంజీవని అంబులెన్స్‌ను ప్రారంభించారు. సింగరేణి వ్యాప్తంగా ఆసుపత్రులను వృద్దాశ్రమాలను నిర్వహించేందుకు యజమాన్యం ఎనలేని కృషి చేస్తుందన్నారు. పట్టణంలోని శాంతిఖని బొగ్గు గనిలో వచ్చే సంవత్సరంలో లాంగ్‌వాల్‌ను ప్రవేశపెట్టనున్నారని ప్రస్తుతం ఆ గనిలో కంటిన్యూయస్ మైనర్ యంత్రాన్ని ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. బెల్లంపల్లి ఏరియాలో శ్రావణపల్లి, కాసిపేట-1,2, బెల్లంపల్లి ప్రాజెక్ట్‌లు, బొగ్గు ఉత్పత్తిలు, సింగరేణి కి తలమానికంగా నిలుస్తాయని వెల్లండించారు. అధికారులు కార్మికులు సంస్థ కు బొగ్గు ఉత్పత్తిని పెంచి ఉత్పత్తి అయ్యే ఖర్చులను తగ్గించినప్పుడు సంస్థ లాభాలలో పయనిస్తుందన్నారు. సవాళ్లను అధిగమించి లాభాల బాట పట్టించేందుకు సంస్త అధికారులు ఉద్యోగులు కార్మికులు కలిసి కట్టుగా పని చేయాలని విజ్ఞప్తి చేసారు. సింగరేణి సంస్థలో ప్రధాన అధికారిగా విధులను నిర్వాహించాల్సి రావడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. కార్యక్రమంలో బెల్లంపల్లి, మందమర్రి, ఏరియా జిఎంలు రవిశంకర్, రాఘవులు, మందమర్రి, ఎస్‌ఓటూ జిఎం రాంమూర్తి, బెల్లంపల్లి ఏరియా డిజి ఎం, చిత్తంరజన్ కుమార్, డివైజిఎం రాజేశ్వర్, ఆసుపత్రి సూపరింటెండెంట్ అశోక్‌కుమార్, టిబిజికెఎస్ కేంద్ర కమిటీ కార్యదర్శులు శ్రీనివాస్ రావు, సిరికొండ సత్యనారాయణ, బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షుడు సదాశివ్, ఖలాలి నర్సయ్య, రాజలింగు, చిప్ప నర్సయ్య, మిట్టపల్లి వెంకటస్వామి, వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు.