అదిలాబాద్

కందుల కొనుగోళ్ళపై విజిలెన్స్ నజర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, మార్చి 24: మునుపెన్నడూ లేని రీతిలో కందుల నిల్వలు భారీగా మార్కెట్‌కు తరలివస్తుండగా కుంటిసాకులతో అధికారులు తరచూ కొనుగోళ్ళను నిలిపివేస్తూ, మరోవైపు వ్యాపారులకు కొమ్ముకాస్తున్న వ్యవహారంపై విజిలెన్స్ అధికారులు కూపీ లాగుతున్నారు. ఇటీవల ఆదిలాబాద్, ఇంద్రవెల్లి, ఇచ్చోడ కేంద్రాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దాడులు నిర్వహించి 1150 క్వింటాళ్ళపైనే అక్రమం గా వ్యాపారులు నిల్వఉంచిన కందులను స్వాదీనపర్చుకొని కేసులు నమోదు చేశారు. అయితే తరచూ ప్రభుత్వ రంగ సంస్థలైన నాఫెడ్ తరచూ కొనుగోలు కేంద్రాలను మూసివేస్తుండడంతో వ్యాపారులకు ఈ వ్యవహారం లాభసాటిగా మారింది. పైగా నాఫెడ్ కొనుగోలు కేంద్రాలను తెరిచినా మూడు రోజుల కొక్కసారి మూసివేస్తూ రైతులతో చెలగాటమాడుతోంది. అధికారుల మధ్య సమన్వయలోపం, ప్రజా ప్రతినిధుల పర్యవేక్షణలోపం కారణంగా ఉమ్మడి జిల్లాలో కందులు మార్కెట్‌యార్డుకు కాకుండా బ్లాక్ మార్కెట్‌కు తరలివెళ్తున్నాయి. రైతుల బలహీనతలను ఆసరాగా చేసుకొని వ్యాపారులు అయినకాడికి దోచుకుంటున్నారు. దీంతో కంది సాగుచేసిన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 2.5 లక్షల ఎకరాల్లో కంది పంట సాగుచేయగా ఊహించని రీతిలో ఈ ఏడాది 4.20లక్షల క్వింటాళ్ళ కందుల కొనుగోళ్ళు జరగడం గమనార్హం. వీటిలో ఆదిలాబాద్ జిల్లాలోనే 2.4లక్షల కందుల కొనుగోళ్ళు జరగగా, ఆదిలాబాద్ మార్కెట్‌యార్డులో వారంరోజుల నుండి నాఫెడ్, ఎఫ్‌సిఐ అధికారులు కొనుగోళ్ళను నిలిపివేయడం తో ప్రైవేట్ వ్యాపారుల దందా యదేచ్ఛగా సాగుతోంది. మార్కెట్ పన్నుకు ఎగనామం పెడుతూ ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర రూ.5050 కూడా దక్కడం లేదని రైతులు వాపోతున్నారు. అయితే ప్రభుత్వ రంగ సంస్థలు కొనుగోలు చేస్తే పక్షం రోజుల వరకు డబ్బులు బ్యాంకుల్లో జమకావడం లేదని పేర్కొంటున్నారు. ఎఫ్‌సిఐ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి గుట్టుచప్పుడు కాకుండా మూసివేయడం, నాఫెడ్ ప్రభుత్వరంగ సంస్థ తరచూ కొనుగోళ్ళను నిలిపివేయడంతో రైతులు పడరాని కష్టాలు పడుతున్నారు. జైనథ్ మార్కెట్ యార్డులో వారం రోజుల తర్వాత శుక్రవారం కొనుగోళ్లు చేపట్టగా ఉదయం 7గంటల నుండే సుమారు 300 పైగా లారీలు, వాహనాలు బారులు తీరాయి. ఆదిలాబాద్ మార్కెట్‌యార్డులో రైతుల సమస్యలను దృష్టిలో పెట్టుకొని కొనుగోళ్ళు చేపట్టాలని రైతులు మొరపెట్టుకుంటున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రైవేట్‌లో కందుల కొనుగోళ్ళ వ్యాపారం జోరుగా సాగుతుండడం ఇటీవలే కెడి ఆర్ దాల్‌మిల్లులో భారీ మొత్తంలో అక్రమంగా నిల్వ ఉంచిన 719 క్వింటాళ్ళ కందులు బయటపడడంతో విజిలెన్స్ అధికారులు మరిన్ని దాడులు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. అక్రమ కొనుగోళ్ళకు తోడు అధికారులు, వ్యాపారులు కుమ్మక్కైనట్లు సమాచారం ప్రభుత్వం దృష్టికి వెళ్ళడంతో మంత్రి హరీష్‌రావు ఆదేశాల మేరకు విజిలెన్స్ అధికారులు ఆదిలాబాద్, బోథ్, ఇచ్చోడ, కాగజ్‌నగర్, ఇంద్రవెల్లి, భైంసా, ఆసిఫాబాద్ మార్కెట్లపై నిఘా పెంచినట్లు తెలుస్తోంది. దీంతో ముందస్తుగా తేరుకున్న సివిల్ సప్లయ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు జిల్లావ్యాప్తంగా సోదాలు చేస్తుండడం గమనార్హం. విజిలెన్స్ అధికారులు లోతైన విచారణ సాగిస్తూనే అధికారుల అక్రమ దందాపై నిఘా పెంచినట్లు తెలుస్తోంది. నాఫెడ్, ఎఫ్‌సిఐ అధికారులు కనీస మద్దతు ధరకు మార్కెట్‌యార్డుల్లో నిరాటంకంగా కొనుగోళ్ళు జరిపితే తమకు న్యాయం జరుగుతుందని రైతులు పేర్కొంటున్నారు.

భూముల మార్పిడిపై చర్యలు తీసుకోండి
* డిసిసి అధ్యక్షుడు మహేశ్వర్ రెడ్డి
నిర్మల్, మార్చి 24: దిలావర్‌పూర్ మండలంలో ఎస్టీలకు చెందిన భూమిని అధికార పార్టీకి చెందిన వారి పేరుపై మార్పిడి చేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని నిర్మల్ డిసిసి అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆయన స్వగృహంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వంశపారపర్యంగా వస్తున్న రైతుల పట్టాలను అక్రమంగా ఇతరులపై మార్పిడి చేయడం విడ్డూరమన్నారు. మార్పిడి చేసిన అధికారులపై చర్యలు తీసుకుని అట్రాసిటి కేసు నమోదుచేయాలని డిమాండ్‌చేశారు. ఇందుకు బాధ్యత వహించాలని విజ్ఞప్తి చేశారు. నిర్మల్ పట్టణంలో అసైన్డ్ భూములను, కందకాలను, ధర్మసాగర్ చెరువు భూములను అక్రమంగా అధికార పార్టీ మంత్రితోపాటు కుటుంబీకులు ఆక్రమిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకుని భూములను కాపాడాలని విజ్ఞప్తిచేశారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వినాయక్‌రెడ్డి, తక్కల రమణరెడ్డి, సాద సుదర్శన్, సిద్దముత్యం, సత్యంచంద్రకాంత్, పోశెట్టి, జమాల్, సూరి తదితరులు పాల్గొన్నారు.