అదిలాబాద్

టిఆర్‌ఎస్‌తోనే పట్టణాల అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్ టౌన్, మార్చి 25: పట్టణాల అభివృద్ధికి టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని, కాలనీల్లో సిసి రోడ్లు, మురికి కాలువల నిర్మాణానికి పెద్దఎత్తున నిధులు మంజూరు చేయడం జరుగుతుందని రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ చైర్మన్ లోక భూమారెడ్డి అన్నారు. శనివారం ఆదిలాబాద్ పట్టణంలోని పాత హౌసింగ్‌బోర్డు కాలనీలో మున్సిపల్ చైర్‌పర్సన్ రంగినేని మనీషాతో కలిసి ఎంపి నిధుల కింద మంజూరైన రూ.10లక్షలతో సిసి రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా భూమారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో పార్టీలకతీతంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. రాబోయే రెండేళ్ళలో మిషన్ భగీరత కింద ప్రతి ఇంటికి కుళాయిల ద్వారా తాగునీరందిస్తామని, ఇక మహిళలకు నీటి కష్టాలు ఉండవన్నారు. పార్టీ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి టిఆర్‌ఎస్ ఫార్టీలో చేరేందుకు ప్రజలు ఆసక్తిచూపుతున్నారన్నారు. ఉద్యమాలతో సాధించుకున్న రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు. చైర్‌పర్సన్ రంగినేని మనీషా మాట్లాడుతూ ఆదిలాబాద్ పట్టణంలోని 36 వార్డులలో దశలవారీగా అభివృద్ధి పనులను చేపట్టడం జరుగుతుందన్నారు. ఇప్పటికే పలు కాలనీల్లో మురికి కాలువలు, సిసి రోడ్ల నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. కార్యక్రమంలో డిసిసిబి చెర్మన్ ముడుపు దామోదర్ రెడ్డి, హౌసింగ్‌బోర్డు కౌన్సిలర్ అంబకంటి సుష్మ అశోక్, టీఆర్‌ఎస్ నాయకులు బాలూరి గోవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.