అదిలాబాద్

నాసాకు ఎంపికైన ట్రిపుల్ ఐటి ప్రాజెక్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాసర, మార్చి 27: బాసర ట్రిపుల్ ఐటి కళాశాల విద్యార్థులు మరో అరుదైన ఘనతను సాధించారు. అమెరికాలోని నాసా అంతరీక్ష పరిశోధన సంస్థ పోటీలలో బాసర ట్రిపుల్ ఐటికి చెందిన విహాన్ ప్రాజెక్టు ప్రపంచవ్యాప్తంగా రెండవ ప్రాజెక్టు గుర్తింపు లభించిందని కళాశాల వైస్ ఛాన్స్‌లర్ సత్యనారాయణ తెలిపారు. ప్రపంచదేశాలకంటే ముందుగా అంతరీక్ష ప్రయోగాలుచేస్తూ నూతన ఆవిష్కరణలతో అద్భుతాలను కనుగొని అమెరికాకు చెందిన నాసా నిర్వహించిన పోటీలలో విద్యార్థులు సత్తాచాటడంపై వైస్ ఛాన్స్‌లర్ సత్యనారాయణ సంతోషం వ్యక్తంచేశారు. అంతరీక్షంలో మానవ వికాస యోగ్యంపై స్పేస్ సెటిల్‌మెంట్ డిజైన్ కాంటెస్ట్‌ను సాసా ప్రతీ సంవత్సరం నిర్వహిస్తుంది. 2017 సంవత్సరానికిగాను బాసర ట్రిపుల్ ఐటి విద్యార్థులు పంపించిన రెండు ప్రాజెక్టులలో ఒక ప్రాజెక్టుకు రెండవస్థానం దక్కగా ప్రాజెక్టుకు గౌరవపురస్కారం లభించిందని తెలిపారు. ప్రపంచంలో జనాభా పెరుగుదలకు భూమిపై కాలుష్యకారకాలు పెరిగి జీవన మనుగడకు ప్రమాదకరపరిస్థితులు తలెత్తుతున్న తరుణంలో వసతులలేమితో ఇబ్బందులు పడుతున్న సందర్భంలో వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని ప్రపంచవ్యాప్తంగా నాసా సంస్థ పోటీలను నిర్వహిస్తుంది. అంతరీక్షంలో మానవునికి నివాసాలు, అక్కడ జీవన అవసరాలు, నీరు, విద్యుత్, ఆహార ఉత్పత్తులను చేసుకోవడం మానవ మనుగడకు కావాల్సిన అంశాలను దృష్టిలో ఉంచుకుని ఆకాష్, ప్రణయ్, రమ్యశ్రీ, వెంకటేష్, విష్ణుప్రియ, విద్యార్థుల బృందం విహాన్ ప్రాజెక్టుకు రెండవస్థానం దక్కిందని పేర్కొన్నారు. మరో రెండు నెలల్లో విద్యార్థుల బృంధం తమ విహాన్ ప్రాజెక్టును ఊహాత్మకంగా, ప్రయోగాత్మకంగా వివరించేందుకు అమెరికాకు వెళ్లనున్నట్లు తెలిపారు. టీమ్ క్రియజని ప్రాజెక్టును రూపొందించిన విద్యార్థులు హేమ, ఝాన్సీ, ప్రదీప్, శ్రీచందన విద్యార్థులకు గౌరవ బహుమతి లభించడంపై సంతోషం వ్యక్తంచేశారు. ప్రతీ సంవత్సరం ఈ పోటీలలో కళాశాల విద్యార్థులు పాల్గొని బాసర ట్రిపుల్ ఐటి యూనివర్సిటి పేరును విస్తరింపచేయడంపై ఆనందం వ్యక్తంచేశారు. విద్యార్థులకు ప్రతిభకు గుర్తింపు లభించడం సంతోషంగా ఉందని భౌతికశాస్త్ర విభాగ అధిపతి రాకేష్‌రోషన్ అన్నారు. ఈ సందర్భంగా నాసా ప్రాజెక్టుకు ఎంపికైన రెండు ప్రాజెక్టుల విద్యార్థిని, విద్యార్థులకు వైస్ ఛాన్స్‌లర్ అభినందించి యూనివర్సిటి పరంగానే విద్యార్థులను అమెరికాకు పంపేందుకు కృషిచేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో కళాశాల పిఆర్‌వొ మధుసుదన్‌రెడ్డి, డీన్ సుధాకర్, విద్యార్థులు పాలుపంచుకున్నారు.