అదిలాబాద్

ఇంద్రవెల్లిలో ప్రశాంతంగా సంస్మరణ దినం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉట్నూరు, ఏప్రిల్ 20: పోలీసు ఆంక్షల నడమ ఇంద్రవెల్లి కేంద్రంలో సంస్మరణ దినం ప్రశాంతంగా ముగిసింది. గురువారం ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని ఆదివాసి గిరిజనుల స్థూపం వద్ద మృతవీరులకు నివాళులర్పించడానికి పోలీసులు అరగంట సమయం ఇవ్వగా అడుగడుగునా ఆంక్షలు పెట్టినప్పటికీ ఆదివాసి సంఘాల నాయకులు, గిరిజనులు పెద్ద ఎత్తున తరలివచ్చి నివాళులర్పించారు. ఆదిలాబాద్ ఎంపి గెడం నగేష్‌తో పాటు బోథ్ మాజీ ఎమ్మెల్యే సోయం బాపురావుతో పాటు పలు ఆదివాసి సంఘాల నాయకులు, గిరిజనులు స్థూపం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదే విధంగా ఇంద్రాదేవి ఆలయం నుండి అమరవీరుల ఆశయ సాధన సమితి అధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించగా సంస్మరణ దినం చేపట్టారు. అదే విధంగా ర్యాలీ పొడవున అమరవీరుల ఆశయాలు నెరవేరాలిజల్‌జంగల్ జమీన్‌పై హక్కులు ఇవ్వాలంటూ నినాదాలు చేస్తూ సాంప్రదాయ వాయిద్యాల మధ్య ర్యాలీ కొనసాగింది. అనంతరం స్థూపం ముందు సాంప్రదాయ జెండాలను ఎగరవేసి అమరవీరులకు జోహార్లంటూ పూజలు నిర్వహించారు. ఆదివాసి గిరిజనులు పోలీసుల తూటాలకు బలై నేటికి 36 సంవత్సరాలు గడుస్తున్నా వారి ఆశయాలను ప్రభుత్వాలు నెరవేర్చడం లేదని పలువురు గిరిజన నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఏ ఎస్పీ పనసారెడ్డి అధ్వర్యంలో డిఎస్పీ చంద్రప్రభు భారీ పోలీసు బందోబస్తు నిర్వహించి, 144 సెక్షన్‌ను విధించారు. ఈ సంస్మరణ దినం ప్రశాంతంగా జరగడంతో అధికారులు, నాయకులు ఊపిరి పీల్చుకున్నారు.

పోలీసుల సంక్షేమ చర్యలకు ప్రత్యేక బృందం ఏర్పాటు
* జిల్లా ఎస్పీ ఎం.శ్రీనివాస్
ఆదిలాబాద్ రూరల్, ఏప్రిల్ 20: జిల్లా పోలీసు కుటుంబాలకు ప్రభుత్వం కల్పించే సంక్షేమ పథకాలను సత్వరమే అందేవిధంగా చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ ఎం.శ్రీనివాస్ అన్నారు. గురువారం స్థానిక పోలీసు కార్యాలయంలో పోలీసు అసోసియేషన్ ప్రతినిధులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గత డిసెంబర్ నెలలో గుండెపోటుతో మృతి చెందిన హెడ్‌కానిస్టేబుల్ కొడిమెల సంజీవ్‌కుమార్ (51) కుటుంబానికి రూ.5లక్షల 50వేల చెక్కును జిల్లా ఎస్పీ అందజేశారు. తలమడుగు గ్రామ నివాసుడైన సంజీవ్‌కుమార్ 1984 సంవత్సరంలో పోలీసు కానిస్టేబుల్‌గా ఎంపికై మందమర్రి, జైనూర్, ఆదిలాబాద్ రూరల్ పోలీసు స్టేషన్‌లో విధులు నిర్వర్తించారని, 2014 నుండి సిసిఎస్‌లో విధులు నిర్వహిస్తున్న సమయంలో ఆర్థీక నేరాలకు పాల్పడిన నిందితులను పట్టుకోవడంలో కీలకపాత్ర పోషించారు. 2011 సంవత్సరంలో హెడ్‌కానిస్టేబుల్‌గా పదోన్నతి పొందిన ఆయన గుండెపోటు రావడంతో మృతి చెందాడు. కాగా, ఆయనకు భార్య ప్రభా, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లా పోలీసులు ధృడంగా ఉండాలని, ఆరోగ్యంపై ప్రత్యేకశ్రద్ధ తీసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మంజూరైన 5.5లక్షల చెక్కును కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగిందని, బాధిత కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చే విధంగా జిల్లా కలెక్టర్‌కు నివేదికలు పంపినట్లు తెలిపారు. జిల్లా పోలీసు అసోసియేషన్ అధ్యక్షుడు పెంచాల వెంకటేశ్వర్లు అధ్వర్యంలో సభ్యులు ఎస్‌కె తాజోద్దిన్, శివాజి చౌహన్, ఎన్.సత్యనారాయణ, సిఆర్ గంగారాంలు బాధిత పోలీసు సభ్యులకు అండగా ఉండి ప్రభుత్వం నుండి అందే ప్రయోజనాలతో పాటు ఉద్యోగ అంశాలపై చర్యలు తీసుకోవాలన్నారు. బాధిత కుటుంబాలకు అన్ని విధాల ఆదుకుంటామని ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసు అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పెంచాల వెంకటేశ్వర్లు, ప్రతినిధులు ఎస్‌కె తాజోద్దిన్, సిఆర్ గంగారాం, బేర పెద్దయ్య, బి.సంతోష్, రవి, సిసిఎం పోతరాజు, ఫిర్యాదుల విభాగం అధికారిని జైస్వాల్ కవిత పాల్గొన్నారు.

మిషన్ భగీరథ పనులను వేగిరపర్చండి
* మంత్రి జోగు రామన్న

ఆదిలాబాద్, ఏప్రిల్ 20: ఇంటింటికి తాగునీరందించే మిషన్ భగీరథ పనులు జిల్లాలో మందకొడిగా సాగుతున్నాయని, కాంట్రాక్టర్లు పనులను వేగిరపర్చి 2019లోగా ప్రతి ఇంటికి తాగునీరందించాలని రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మిషన్ భగీరథ పనులపై కాంట్రాక్టర్లతో మంత్రి సమీక్షించారు. ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పైపు లైన్ల పనులు జిల్లాలో మొక్కుబడిగా సాగుతున్నాయని, కాంట్రాక్టర్లు నిర్ణిత గడవులోగా పనులు చేపట్టడం లేదన్నారు. పూర్తిచేసిన పనులకు కేవలం ఐదు రోజుల్లోగా డబ్బులు చెల్లించడం జరుగుతుందని తెలిపారు. ఖమ్మం, భూపాలపల్లి జిల్లాలో పనులు వేగంగా జరుగుతుంటే ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం లక్ష్యానికి ఆమడదూరంలో పనులు సాగుతున్నాయని మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్ల సమస్యలను రాష్టస్థ్రాయిలో పరిష్కరించేందుకు కమిటీ చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ జగన్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ రిజర్వాయర్లు, ప్రాజెక్టుల నుండి తాగునీటిని పైపులైన్ల ద్వారా ఓహెచ్ ఆర్ ట్యాంకులకు అనుసంధానం చేసేందుకు కాంట్రాక్టర్లకు బాధ్యతలు అప్పగించడం జరిగిందన్నారు. ట్యాంకుల డిజైన్ల గురించి రాష్టస్థ్రాయి కమిటీతో చర్చించడం జరిగిందన్నారు. ఇసుకు, కంకర్ వంటి ముడిసరకు రవాణా దూరంగా ఉండడం వల్ల నార్నూర్, ఉట్నూరు ప్రాంతాల్లో పైపులైన్ల నిర్మాణంలో జాప్యం జరుగుతుందని పేర్కొన్నారు. ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ మూర్తి మాట్లాడుతూ పైపులైన్లకు సంబంధించిన అగ్రిమెంట్లను వెంటనే పూర్తిచేసుకొని సకాలంలో తాగునీరందించాలన్నారు. సమావేశంలో కలెక్టర్ బుద్ద ప్రకాష్ జ్యోతి, ఈఈలు, డిఈలు, ఎఈలు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.