అదిలాబాద్

ప్రజాసమస్యలపై అలసత్వం వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెజ్జూర్,మే 2;ప్రజలు ఎదుర్కోంటున్న సమస్యలపై అధికారులు అలసత్వం ప్రదర్శించవద్దని కుమ్రం భీం జిల్లా జాయింట్ కలెక్టర్ అశోక్‌కుమార్ అన్నారు.మంగళవారం పెంచికల్‌పేట తాహసిల్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ ప్రజాఫిర్యాదుల విభాగం నిర్వహించిన సందర్బంగా మాట్లాడారు.నూతనంగా ఏర్పాటు చేసిన మండలాల్లో ప్రజలకు దూరభారం తగ్గించాలనే ఉద్దేశ్యంతో ప్రజాఫిర్యాదుల విభాగాలు నిర్వహించి ఆర్జిలు స్వీకరిస్తున్నట్లు తెలిపారు.పెంచికల్‌పేట మండలంలో 32మంది ధరఖాస్తులు చేసుకున్నట్లు మండలంలోని పెంచికల్‌పేట వారంతపుసంతకు స్థలం కేటాయించాలని ఎల్లూరు శివారులో నిర్మించిన బొక్కివాగు ప్రాజెక్టు ముంపులో భూములు కోల్పోయిన రైతులకు పరిహారం ఇప్పించాలని,లోన్‌పల్లి గ్రామంలో త్రిఫేజ్ విద్యుత్ సౌకర్యం కల్పించాలని వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు జెసికి వ్రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు.కాగా మండలంలోని భూసమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని తాహసిల్దార్ మనోహర్‌ను జెసి ఆదేశించారు.మండలంలోని రైతులు ఆన్‌లైన్ పహనీలు,టైటిల్ పుస్తకాల కోసం ఫిర్యాదు చేసుకున్నారు.ఈకార్యక్రమంలో కాగజ్‌నగర్ ఆర్డివో రమేష్‌బాబు,ఎంపిడివో తోటాజి,లోన్‌పల్లి సర్పంచ్ శ్రీనివాస్ తదితరులు పాల్గోన్నారు.

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు
మంచిర్యాల అర్బన్, మే 2: నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికే జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించామని ప్రభుత్వ ఐటి ఐ కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మయ్య తెలిపారు. మంగళవారం మంచిర్యాల పట్టణంలోని ప్రభుత్వ ఐటి ఐ కళాశాల ఆవరణలో మేగా జాబ్‌మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ జాబ్ మేళాకు అపూర్వ స్పందన ఏర్పడిందని, ఈ కార్యక్రమంలో 200మంది విద్యార్థులు పాల్గొన్నారని వారి అర్హత ప్రకారం హైదరాబాద్‌లోని ప్రముఖ కంపెనీలైన హోండా, ప్లాస్టిక్ కంపెనీలలో ఐటి ఐ లో ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, టర్నర్, మోటర్ మెకానిక్, డీజిల్ మెకానిక్, ఎలక్ట్రానిక్ మెకానిక్‌లలో ఉత్తీర్ణులైన వారికి పై కంపెనీలలో అప్రెంటీస్ మరియు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. విద్యార్థుల నుంచి పూర్తి వివరాలు, సర్ట్ఫికేట్, బయోడేటా ఫారాలు తీసుకొని వారికి మెరిట్ ఆధారంగా అన్ని సదుపాయాలతో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు.
ఈ జాబ్ మేళా కార్యక్రమంలో హైదరాబాద్‌లోని ప్రముఖ కంపెనీలకు చెందిన మేనేజర్‌లు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.

గ్రామాల్లో పారదర్శకంగా రెవెన్యూ సేవలు
* ట్యాబ్‌లతో రెవెన్యూ అక్రమాలకు అడ్డుకట్ట * కలెక్టర్ ఇలంబరిది
నిర్మల్,మే2: గ్రామీణ ప్రాంత ప్రజలకు రెవెన్యూ సంబంధమైన సేవలను పారదర్శకంగా, త్వరితగతిన అందజేసేందుకు ప్రభుత్వం వి ఆర్‌వోలకు ట్యాబ్‌లను అందజేస్తుందని జిల్లా కలెక్టర్ ఇలంబరిది అన్నారు. వీటి వల్ల రాబోయే రోజుల్లో రెవెన్యూ అక్రమాలకు అడ్డుకట్ట వేయవచ్చని అన్నారు. రెవెన్యూకు సంబంధించిన అన్ని జీవోలు, సమాచారం, నివేదికలను ట్యాబ్‌లో నిక్షిప్తం చేయడం వల్ల ఎప్పటికప్పుడు గ్రామీణ ప్రాంత ప్రజలకు సేవలను అందించేందుకు ఈ కార్యక్రమం ద్వారా చేపట్టవచ్చన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లాలోని వి ఆర్‌వోలకు ట్యాబ్‌లను కలెక్టర్ పంపిణి చేశారు. అనంతరం జరిగిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వి ఆర్‌వోలకు ట్యాబ్‌లను అందజేయడం వల్ల ప్రజలకు రెవెన్యూ సేవలు సత్వరంగా అందించడమే కాకుండా సంబంధిత క్లస్టర్ వి ఆర్‌వో తన పరిధిలోని ప్రభుత్వ పట్ట్భాముల వివరాలు, పంటల సాగు వివరాలు, పంటనష్టం, కరువు పరిస్థితుల్లో భూములకు సంబంధించిన మ్యాప్‌లు తదితర వివరాలను ట్యాబ్‌ల ద్వారా అప్‌లోడ్‌చేసుకుని విస్తృతంగా సేవలందించవచ్చన్నారు. అంతేకాకుండా ఎన్నికల సమయంలో పోలింగ్‌స్టేషన్ల వివరాలు, కులాల ప్రాతిపదికన జనాభా వివరాలను, కిందిస్థాయి నుండి పై స్థాయి అధికారి వరకు తెలిసేవిధంగా ప్రత్యేక సైట్లతో ఆన్‌లైన్‌లో ఉంచవచ్చన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితుల వల్ల కరువు పరిస్థితులు తలెత్తినప్పుడు, అకాలవర్షాలతో పంటనష్టం జరిగితే గతంలో కిందిస్థాయి సిబ్బంది తప్పుడు నివేదికలు ఇవ్వడం వల్ల పంటనష్టపోయిన అర్హులైన రైతులకు అన్యాయం జరిగిన సంఘటనలు అనేకం ఉన్నాయన్నారు. ప్రస్తుతం అందజేసిన ట్యాబ్‌ల ద్వారా సమగ్ర వివరాలను ఫోటోలతో సహా ట్యాగింగ్‌చేస్తే ఇలాంటి అక్రమాలకు చెక్‌పెట్టవచ్చన్నారు. కబ్జాకు గురైన ప్రభుత్వ భూములను సైతం అధికారులు స్వాధీనం చేసుకునే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం ఎంతో సదుద్దేశంతో అందజేసిన ఈ ట్యాబ్‌లను వి ఆర్‌వోలు సక్రమంగా ఉపయోగించుకుని సమగ్ర సమాచారాన్ని బాధ్యతాయుతంగా, తప్పుడు సమాచారం లేకుండా నిక్షిప్తంచేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ సి.హెచ్.శివలింగయ్య, డి ఆర్‌వో నగేష్, జిల్లాలోని తహసిల్దార్‌లు, వి ఆర్‌వోలు పాల్గొన్నారు.