అదిలాబాద్

కాంగ్రెస్, టిఆర్‌ఎస్ నేతలపై కమలనాథుల గురి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, మే 14: రానున్న అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ సంస్థాగత బలోపేతంపై దృష్టిసారిస్తోంది. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ప్రజాసమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపు తూ ప్రతిపక్ష పార్టీగా ప్రధానపాత్ర పోషిస్తున్న బిజెపి రానున్న స్థానిక ఎన్నికలతోపాటు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పట్టునిలబెట్టుకునేందుకు పావులు కదుపుతోంది. గ్రామ, మండల, పట్టణ కమిటీ కార్యవర్గాలను పూర్తిచేసుకొని రాష్ట్ర బాధ్యులతో జిల్లా స్థాయి కార్యవర్గ సమావేశాలు నిర్వహించారు. కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపేందుకు ప్రధాని మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అమలుపరుస్తున్న పథకాలను ప్రజల్లో తీసుకువెళ్ళేలా కార్యక్రమాలు రూపొందించారు. ఇందులో భాగంగానే పొరుగు మహారాష్టల్రోని చంద్రపూర్ ఎంపి, తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇంచార్జి, కేంద్రమంత్రి హన్సరాజ్ గంగారాజ్ నెల రోజుల్లోనే జిల్లాలో మూడుసార్లు పర్యటించి పార్టీ శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపారు. అయితే పార్టీకి క్యాడర్ బలంగా ఉన్నప్పటికీ సంస్థాగతంగా నాయకత్వం కొరత స్పష్టంగా కనిపించడంతో ప్రజాదరణ పొందిన నేతలకువలవేసి పార్టీలో చేర్చుకునేందుకు జాతీయ స్థాయి కమిటీ వ్యూహం రూపొందించి, నేతలను రంగంలోకి దించింది. నియోజకవర్గాల్లో పట్టుకలిగిన కాంగ్రెస్, టిఆర్‌ఎస్, టిడిపి నేతలకు బిజెపి తీర్థం అందించేందుకు కసరత్తు సాగిస్తున్నారు. ఇందులో భాగంగానే టీఆర్‌ఎస్‌లో అంటిముట్టన్నట్టుగా వ్యవహరిస్తూ అధికార పార్టీలోనే ప్రతిపక్షపాత్ర పోషిస్తున్న జడ్పీటీసీల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి సభ్యుడు, ఆసిఫాబాద్ జడ్పీటీసీ కొయ్యల ఏమాజీ బిజెపిలో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఈనెల 22,23,24 తేదీల్లో బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా తెలంగాణ పర్యటనలో భాగం గా జిల్లాకు చెందిన వివిధ పార్టీల నేతలతోపాటు ఏమాజీ బిజెపి తీర్థం పుచ్చుకోనున్నారు. అదేవిధంగా ఆదిలాబాద్‌కు చెందిన కాంగ్రెస్ యువ నాయకుడు, ముథోల్ నియోజకవర్గంలో పట్టుకలిగిన కాంగ్రెస్, టీఆర్‌ఎస్ సీనియర్ నేతలతో బిజెపి రాష్ట్ర నాయకులు మంతనాలు సాగిస్తున్నారు. టీఆర్‌ఎస్‌లో పార్టీ టికెట్ దక్కే అవకాశం లేని అసమ్మతి వాదులు సైతం బిజెపిలో చేరేందుకు ఆసక్తిచూపుతున్నట్లు తెలిసింది.