అదిలాబాద్

అపోహలు వీడి.. రక్తదానంతో ప్రాణదాతలుకండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, జూన్ 14: సమాజంలో రక్తదానానికి మించిన సేవా గుణం మరోటిలేదని, రక్తదానం పట్ల ప్రజల్లో ఉన్న అపోహలు విడనాడి ఆపద్కాలంలో అభాగ్యుల ప్రాణాలను కాపాడేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని ఆదిలాబాద్ జిల్లాకలెక్టర్ బుద్ద ప్రకాష్ జ్యోతి పిలుపునిచ్చారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం నుండి అవగాహన ర్యాలీని ప్రారంభించగా, అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని ప్రసంగించారు. యువకుల్లో సేవాగుణం పెంపొందించడం వల్ల అత్యవసర సమయాల్లో రోగులకు అవసరమైన రక్తం అందించేందుకు వీలుంటుందని, బ్లడ్‌బ్యాంక్‌లో కూడా నిల్వ చేసుకోవచ్చని అన్నారు. రెడ్‌క్రాస్ సోసైటి అధ్వర్యంలో ప్రతి ఏటా రక్తదాన శిబిరాలు, రక్తదాన కార్యక్రమాలు నిర్వహిస్తారని, స్వచ్చందంగా పలుమార్లు రక్తదానం అందించి, అభాగ్యులకు ప్రాణదాతలుగా నిలిచిన యువకులు సమాజంలో ఆదర్శంగా నిలుస్తారని అన్నారు. ముఖ్యంగా యువజన సంఘాల నాయకులు బాల శంకర్ కృష్ణ 60 దఫాలుగా రక్తదానం చేయడం అభినందించదగిన విషయమన్నారు. ప్రజల్లో చైతన్యంతో పాటు రక్తదానం చేస్తే పలు ఆనర్థాలు ఏర్పడుతాయన్న అపోహలు విడనాడాలని కలెక్టర్ అన్నారు. సామాజిక సేవా రంగంలో రక్తదానంకు ఉన్న ప్రాధాన్యత ఇతర వాటికి లేదన్నారు. ప్రతి ఒక్కరు తమ పుట్టిన రోజును పురస్కరించుకొని సమాజంలో మంచి కార్యక్రమం చేయాలన్న తపనతో రక్తదానం చేయడం అలవాటు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. వైద్య ఆరోగ్య శాఖలో వైద్య సిబ్బంది సుమారు 4వేల మంది ఉంటారని, విద్యాశాఖలో కూడా పెద్ద సంఖ్యలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఉంటారని,వారు రక్తదానం చేస్తూ ఆదర్శంగా నిలిస్తే యువత ముందుకు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. గిరిజన ప్రాంతాలతో పాటు మారుమూల ప్రాంతాల్లో గిరిజనులు రక్తహీనత వల్లే డెంగ్యూ, ఇతర పౌష్టికాహార లోపంతో వ్యాధుల బారిన పడి మృతి చెందుతున్నారని, వారికి అవసరమైన రక్తం అందించేందుకు ముందుకు రావాల్సిన అవసరం ఉందని కలెక్టర్ అన్నారు. ప్రతి మండలం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 500 మంది రక్తదాతలను గుర్తించి, రక్తం సేకరించేలా వైద్యశాఖ ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్ళాలని అన్నారు. రాష్ట్రంలోనే జిల్లాను రక్తసేకరణలో ముందువరుసలో నిలుపాలని అన్నారు. బ్లడ్‌బ్యాంకు కేంద్రాల్లో రక్తం నిల్వలు తక్కువగా ఉన్నచోట యువతను ప్రోత్సహించి, లక్షాలను సాధించాలన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి రాజీవ్‌రాజు మాట్లాడుతూ జిల్లాలో రక్తసేకరణకు అనేక చర్యలు తీసుకుంటున్నామని, బ్లడ్‌బ్యాంకులు కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈకార్యక్రమంలో ఇమ్యూనైజేషన్ ప్రాజెక్టు అధికారి డాక్టర్ చందు, డాక్టర్ శోభ పవార్, డాక్టర్ సాధన, ఉట్నూరు ఆసుపత్రి సూపరింటెండెంట్ వేణుగోపాల్, బాల శంకర్ కృష్ణ, బండారి దేవన్న తదితరులు పాల్గొన్నారు.

న్యాయ పరమైన చిక్కులను అధిగమించి వారసత్వం అమలు చేయాలి
* డైరెక్టర్ పవిత్రన్ కుమార్
శ్రీరాంపూర్ రూరల్, జూన్ 14: చట్టానికి లోబడి సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని డైరెక్టర్ (పా) పవిత్రన్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం శ్రీరాంపూర్ ఏరియాలో సమ్మెపై తీసుకుంటున్న నివారణ చర్యలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ (ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్) భాస్కరరావుతో కలిసి మాట్లాడారు. సంస్థ ఉత్పత్తి సాధించే దశలో సమ్మె ప్రకటించడంపట్ల విచారం వ్యక్తం చేశారు. యజమాన్యం, ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నప్పుడు సమ్మె ప్రకటించడం దురదృష్టకరమన్నారు. జాతీయ సంఘాలతో చర్చల ప్రక్రియ ప్రారంభం అయిన తరువాత కూడా యజమాన్యాలతో సహకరించక, ఒంటెద్దు పోకడలను అవలంభిస్తూ సమ్మెకువెళ్లడం కార్మికులకు సరికాదన్నారు. వారసత్వ ఉద్యోగాలపై ప్రభుత్వం, యజమాన్యం అన్ని కోణాల నుంచి న్యాయ నిపుణులతో చర్చిస్తుందని, త్వరలోనే వారసత్వ ఉద్యోగాలపై స్పష్టమైన వైఖరిని ప్రకటించనుందన్నారు. రాష్ట్రానికి తలమానికమైన సింగరేణి అభివృద్ధిలో పాలుపంచుకుంటున్న తరుణంలో సమ్మె ద్వారా కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుందని ఇప్పటికీ వారసత్వంపై ప్రభుత్వం ప్రకటించి దాన్ని అమలు చేసేందుకు సింగరేణి యజమాన్యం సిద్ధంగా ఉన్నప్పటికీ కోర్టు అడ్డగించడంతో చట్టానికి లోబడి న్యాయబద్ధంగా వారసత్వ ఉద్యోగాలు ఇప్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ప్రభుత్వం, సింగరేణి యజమాన్యం ఇవ్వకుండా వారసత్వ ఉద్యోగాలు ఎవరు సాధిస్తారో తెలుపాలన్నారు. సింగరేణి కార్మికులు సమ్మెపై పునరాలోచించి సంస్థ, రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాడాలన్నారు. కార్యక్రమంలో శ్రీరాంపూర్ జిఎం ఎస్‌డిఎం సుభానీ, ఎస్‌ఓటూ జిఎం సత్యనారాయణ, డివై జిఎం జె కిరణ్, ఎఎస్‌వో టూ డైరెక్టర్ మురళీసాగర్ తదితరులు పాల్గొన్నారు.