అదిలాబాద్

కొనసాగుతున్న ఎంసెట్ కౌనె్సలింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెల్లంపల్లి, జూన్ 14: బెల్లంపల్లి పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో టిఎస్‌ఎం సెట్ 2017 కౌనె్సలింగ్ కొనసాగుతోంది. కౌనె్సలింగ్‌కు పాలిటెక్నిక్ కళాశాల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 14వ తేదీన ఉదయం 9 గంటల నుంచి 16001 ర్యాంకు నుంచి 18500 ర్యాంకు వరకు, మధ్యాహ్నం 11:30 గంటల నుంచి 18501 ర్యాంకు నుంచి 21000 ర్యాంకు వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 21001 నుంచి 23500 వరకు , మధ్యాహ్నం 3 గంటల నుంచి 23501 ర్యాంకు నుంచి 26000 ర్యాంకు వరకు కౌనె్సలింగ్ నిర్వాహించామని ప్రిన్సిపల్ కరుణకుమార్ తెలిపారు. కౌనె్సలింగ్‌కు హాజరైన విద్యార్థులు ధృవీకరణ పత్రాలను పరిశీలించారు. కౌనె్సలింగ్‌కు 118మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. మరుసటి రోజు 15 వ తేదీన ఉదయం 9 గంటల నుంచి 26001 ర్యాంకు నుంచి 36000 ర్యాంకు వరకు కౌనె్సలింగ్ జరుగుతుందని తెలిపారు.

జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి
* టిడిపి జిల్లా అధ్యక్షుడు ఆనంద్
ఆసిఫాబాద్, జూన్ 14: కుమ్రం భీం జిల్లాలో తెలుగుదేశం పార్టీ అభివృధ్దికి తన వంతు కృషి చేస్తానని ఆ పార్టీ జిల్లా అధ్యక్షునిగా కొత్తగా ఎన్నికైన జి ఆనంద్ స్పష్టం చేశారు. జిల్లా అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టిన అధిష్టానానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే ఎన్నికల నాటికి ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజక వర్గాల్లో పార్టీని పటిష్ఠం చేసేందుకు పని చేస్తానన్నారు. పేద వర్గాల కోసం పని చేసేది ఒక్క తెలుగుదేశం పార్టీ అని ఆయన పేర్కొన్నారు. స్వార్థం కోసం కొంత మంది నేతలు పార్టీని వీడుతున్నప్పటికి, ప్రజల్లో తమ పార్టీకి ఏమాత్రం ఆదరణ తగ్గలేదని ఆనంద్ అన్నారు. 2019 ఎన్నికల్లో జిల్లాలోని రెండు అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంటామనే ధీమాను ఆయన వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో అన్ని మండలాల్లో కమిటీలను వేయనున్నామన్నారు. మూడేండ్ల పాలనలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లో ఎండగడతామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని టిఆర్‌ఎస్ ప్రభుత్వం నెరవేర్చలేక పోయిందని ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెలతామన్నారు.

వెంకటాపూర్‌లో బడిబాట
* పాల్గొన్న డిఈవో ప్రణీత
నిర్మల్, జూన్ 14: మండలంలోని వెంకటాపూర్ గ్రామంలో బుధవారం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ అధికారిణి టి.ప్రణీత హాజరై మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలని కోరారు. పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని తెలిపారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. చదువుయొక్క ఆవశ్యకతను తెలిపారు. ఈ కార్యక్రమంలో సెక్టోరల్ అధికారులు వై.వెంకటరమణరెడ్డి, సలోమి కరుణ, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు,ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు, విద్యా కమిటి సభ్యులు పాల్గొన్నారు.

సమ్మెకు దూరంగా ఉండాలి
* శ్రీరాంపూర్ జిఎం ఎస్‌డిఎం సుభానీ
శ్రీరాంపూర్ రూరల్, జూన్ 14: సింగరేణి కాలరీస్‌లో జాతీయ కార్మిక సంఘాలు తలపెట్టిన సమ్మెకు కార్మిక వర్గం దూరంగా ఉండి ఉత్పత్తి ఉత్పాదకతకు కృషి చేయాలని శ్రీరాంపూర్ జిఎం ఎస్‌డిఎం సుభానీ పిలుపునిచ్చారు.బుధవారం శ్రీరాంపూర్ లో మాట్లాడుతూ సింగరేణి కార్మికులు విజ్ఞతతో ఆలోచించి సమ్మె ఎందుకు చేయాలో ప్రశ్నించు కోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి యజమాన్యం డిపెండెంట్ ఉద్యోగాలను పునరుద్దరించేందుకు సుముఖంగా ఉన్నప్పటికీ సమ్మె ఎవరి కోసం చేయాలో ఆలోచించాలని పేర్కొన్నారు. విజ్ఞులైన సింగరేణి కార్మికులు సమ్మెకు దూరంగా ఉంటారని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. కార్మికుల సంక్షేమం కోసం సింగరేణి యాజమన్యం చేపడుతున్న అభివృద్ది పనులను ప్రతి కార్మికునికి లబ్ది చేకూరేలా అమలు చేస్తున్నామని ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వారసత్వంపై న్యాయపరమైన సమస్యలు ఉన్నందున వారసత్వం జాప్యం అవుతుందని త్వరలోనే వారసత్వ ఉద్యోగాలు సాధ్యమయ్యేలా ప్రభుత్వం, సింగరేణి యజమాన్యం కృషి చేస్తుందని పేర్కొన్నారు. త్వరలోనే వారసత్వంపై అడ్డంకులు తొలిగి కార్మికుల పిల్లలకు డిపెండెంట్ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆశా భావం వ్యక్తం చేశారు. కావున సమ్మెకు కార్మికులు వెళ్లకుండా విధులు నిర్వహించాలని కోరారు. కార్యక్రమంలో శ్రీరాంపూర్ డివై జిఎం కిరణ్ కుమార్, ప్రాజెక్ట్ అధికారి కవీంద్ర, ఎఎస్‌వో జెవిఎల్ గణపతి, మేనేజర్ నరేందర్, వెంకటేశ్వర్ రెడ్డి, టిబిజికెఎస్ నాయకులు పెంట శ్రీనివాస్, ఖలీందర్ ఆలీఖాన్, అమ్జాద్ ఆలీ, కాంగ్రెస్ నాయకులు డి అన్నయ్య, ఏఐటియూసి నాయకులు కాల్వ శ్రీనివాస్, మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.