అదిలాబాద్

హామీలిచ్చారు కానీ.. అమలుపర్చడం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచిర్యాల, ఏప్రిల్ 4: తెరాస ప్రభుత్వం ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి నెరవేర్చడంలేదని ఎన్ ఎస్‌యు ఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ మండిపడ్డారు. సోమవారం మంచిర్యాల పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేశారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. విద్యార్థులు ఉన్నత చదువులు చదివినప్పటికీ తెలంగాణ వస్తేనైనా ఉద్యోగాలు వస్తాయని అనుకున్న నిరుద్యోగుల ఆశలు నిరాశలుగా మారుతున్నాయే తప్ప ఉద్యోగాలు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కేజీ టు పీజీ ఉచిత విద్య అందిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటి వరకు వాటిని అమలు పర్చడమే కాక విద్యార్థులకు ఫీజు రీయంబర్స్‌మెంట్ కూడా అందించడం లేదని అన్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో 2000 ప్రభుత్వ పాఠశాలలు మూతపడే దుస్థితి నెలకొందన్నారు. హెచ్‌సియులో దళిత విద్యార్థులపై జరుగుతున్న దాడులను నిలదీయడానికి ఎమ్మెల్యే సంపత్ వెళితే ఆయన వాహనంపై దాడి చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ ప్రభుత్వం విద్యార్థి వ్యతిరేక విధానాలను అవలంభిస్తుందని, వాటిని మానుకోవాలని హెచ్చరించారు. బంగారు తెలంగాణలో 2లక్షల ఉద్యోగాలు కల్పిస్తానని హామీ ఇచ్చి వాటిని కార్యరూపం దాల్చడం లేదని విమర్శించారు. ఎన్నికల హామీలను నెరవేర్చాలని, విద్యారంగంలోని సమస్యలు పరిష్కరించని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడుతామన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఇంచార్జి ఫిరోజ్ ఖాన్, రాష్ట్ర ఉపాద్యక్షులు వల్లభ్, యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కిరణ్‌కుమార్, రాష్ట్ర కార్యదర్శులు సంతోష్, ప్రవీణ్, ఎన్ ఎస్‌యు ఐ మాజీ అధ్యక్షుడు నరేందర్, జిల్లా ఉపాద్యక్షులు నరేష్, ఆదర్శ్, ప్రధాన కార్యదర్శి భరద్వాజ్, తిరుమల్‌రావు, నియోజకవర్గ అధ్యక్షులు అశోక్ తేజ, విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.