అదిలాబాద్

బతుకమ్మ చీరల దగ్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, సెప్టెంబర్ 18: రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ప్రతిష్టాత్మకంగా పంపిణీ చేసిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం పలుచోట్ల అబాసుపాలైంది. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో బతుకమ్మ చీరల కోసం బారులు తీరి అతికష్టం మీద పొందిన మహిళలు అధికారుల ముందే చీరల నాణ్యతను చూసి నిరసన వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ పట్టణంలో చించర్‌వాడ కాలనీ మహిళలకు మంత్రి జోగురామన్న బతుకమ్మ చీరలు పంపిణీ చేయగా నాసిరకం చీరలు ఇవ్వడంపై మహిళలు అసంతృప్తి వ్యక్తం చేయడమే గాక ఆ కాలనీకి వెళ్ళి చీరలను బహిరంగంగా తగలబెట్టారు. బతుకమ్మ ఉత్సవాలకు నేత చీరలను పంపిణీ చేస్తామని ఆర్బాటంగా ప్రకటనలు జారీ చేసి ఆశలు నింపారని, తీరా చీరలు పొందితే నాణ్యత లేకుండా రూ.50 విలువచేసే చవకబారు చీరలు పంపిణీ చేసి తమ మనోభావాలను దెబ్బతీశారని మహిళలు అక్రోశం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే మార్కెట్‌యార్డులో వేలాది మంది మహిళలు క్యూలైన్‌లో నిల్చోని బతుకమ్మ చీరల కోసం పడరాని పాట్లు పడ్డారు. జన్నారంలో చీరల పంపిణీ ఉందని తెలిసి వివిధ గ్రామాల నుండి వచ్చిన మహిళలకు చేదు అనుభవం ఎదురైంది. సాయంత్రం 5 గంటల వరకు చీరల కొరత కారణంగా పంపిణీ చేయకపోవడంతో అప్పటి వరకు పడిగాపులు కాసిన మహిళలు సాయంత్రం రహదారిపై రాస్తారోకో నిర్వహించి, తమ నిరసన తెలిపారు. భైంసా కేంద్రంలో చీరల కోసం మహిళల తోపులాట చోటుచేసుకుంది.