అదిలాబాద్

గ్రంథాలయ సంస్థ ఛైర్మెన్‌కు నియామక పత్రం అందజేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్మల్, సెప్టెంబర్ 18: జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మెన్‌గా టిఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు ఎర్రవోతు రాజేందర్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీచేసింది. సోమవారం ఈ మేరకు స్థానిక వైఎస్‌ఆర్ ఫంక్షన్‌హాల్‌లో జరిగిన కార్యక్రమంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి చేతులమీదుగా రాజెందర్ ఈ నియామక పత్రాన్ని అందుకున్నారు. మరో వారం రోజుల్లోగా రాజేందర్ గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇదిలాఉండగా, రెండు నెలల క్రితమే ఎర్రవోతు రాజేందర్‌ను ప్రభుత్వం గ్రంథాలయ సంస్థ ఛైర్మెన్‌గా నియమించిన సంగతి తెలిసిందే. పరిపాలనపరమైన అంశాల కారణంగా ఆయన నియామకానికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు జారీకాలేదు. దీంతో ఆయన పదవిపై తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది. అయితే కొత్త జిల్లాల ఏర్పాటుకారణంగా జిల్లాస్థాయి సంస్థల నియామకానికి సంబంధించి పలు అవరోధాలు ఏర్పడడంతో ఉత్తర్వుల విడుదల జాప్యమైనట్లు తెలుస్తోంది. కాగా ఎర్రవోతు రాజెంధర్ మొదటి నుండి క్రియాశీలక రాజకీయాల్లో కొనసాగుతూ వస్తున్నారు. విద్యార్థి సంఘాల్లో పనిచేసిన ఆయన తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమానికి ఆకర్షితుడై మరో సీనియర్ నేత సత్యనారాయణగౌడ్‌తో కలిసి ప్రస్తుత ముఖ్యమంత్రి కేసి ఆర్ సమక్షంలో టి ఆర్ ఎస్‌లో చేరారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన పోషించిన పాత్రను అధిష్టానం గుర్తించింది. 42 రోజులపాటు సాగిన సకలజనుల సమ్మె నిర్మల్‌లో విజయవంతం కావడంలో ఆయన కీలకపాత్ర పోషించాడు. ముఖ్యంగా వివిధ రాజకీయ పార్టీలు ప్రజాసంఘాల మద్య సమన్వయం సాధిస్తూ ఉద్యమాన్ని ముందుకు నడిపించారు. అందరితో కలిసిపోయే రాజెంధర్.. నేతలమద్య సంధానకర్తగా కూడా వ్యవహరించారు. ఆ తర్వాత మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా మారారు. అయితే పదవుల పంపిణిలో అధిష్టానం ఉద్యమ, పార్టీ సీనియారిటిని పరిగణలోకి తీసుకోవడంతో ఎర్రవోతు రాజెంధర్ పేరు తెరపైకి వచ్చింది. మంత్రులు జోగురామన్న, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర నాయకులు సత్యనారాయణగౌడ్ తదితరులంతా రాజెంధర్‌ను బలపరుస్తూ గ్రంథాలయ సంస్థ ఛైర్మెన్‌గా నియమించాలని ప్రభుత్వానికి సిఫారసు చేశారు. వీరి డిమాండ్‌మేరకు ముఖ్యమంత్రి కేసి ఆర్ రాజెంధర్‌ను ఛైర్మెన్ పదవికి ఎంపికచేశారు. ఈ సందర్భంగా ఎర్రవోతు రాజెంధర్ మాట్లాడుతూ తనకు పదవి రావడానికి కారకులైన మంత్రులు రామన్న, ఇంద్రకరణ్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర నాయకులు సత్యనారాయణగౌడ్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో గ్రంథాలయ అభివృద్దికి కృషిచేస్తానని పేర్కొన్నారు.